కోడికత్తి కేసు కేంద్రానికి కూడా కామెడీ అయిపోయింది..!

విశాఖ విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో జరిగిన దాడి ఘటనపై… వైసీపీ చాలా పెద్ద పోరాటమే చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణ కేంద్ర దర్యాప్తు సంస్థల చేతుల్లోకి వెళ్లాలని తాపత్రయ పడుతోంది. దానికి .. పిటిషన్ల మీద పిటిషన్లు వేసి హైకోర్టులో విచారణ జరిగేలా చూసుకుంది. పనిలో పనిగా కేంద్రం వద్దకు వెళ్లి.. తమకు ఉన్న పలుకుబడితో.. ఆ కేసును ఎలాగైనా… కేంద్ర దర్యాప్తు సంస్థల చేతుల్లోకి తీసుకోవాలని.. విజ్ఞాపన పత్రాలు అందించింది. కానీ కేంద్రం ఏం చేస్తోంది…? వైసీపీతో ఉన్న సత్సంబంధాలను కూడా.. మర్చిపోయి కామెడీ చేస్తోంది. హైకోర్టుకు అరకొర సమాచారం ఇస్తూ.. అదేమంత పెద్ద కేసు కాదని… పెట్టీ కేసు అన్నట్లుగా… తేలికగా చూస్తోంది. హైకోర్టులో కేంద్రం దాఖలు చేస్తున్న నివేదికలు చూస్తే ఇదే నిజం తేలిపోతోంది.

జగన్‌పై దాడి ఎయిర్ పోర్టులో జరిగింది కాబట్టి… ఈ ఘటన జాతీయ దర్యాప్తు సంస్థ చట్టంలో పేర్కొన్న నేరాల కిందకు వస్తుందో రాదో చెప్పాలని గత విచారణ సమయంలో కేంద్రాన్ని ఆదేశించింది. దానిపై ఓ నివేదికను… కేంద్రం హైకోర్టులో దాఖలు చేసింది. అందులో హైకోర్టు అడిగిన అసలు విషయం కాకుండా… మిగతా కథ అంతా చెప్పింది. నిర్ణయం ఏదో హైకోర్టే తీసుకోవాలన్నట్లుగా నివేదిక ఇచ్చింది. దాంతో హైకోర్టు.. కేంద్రం తమతో పరాచికాలాడుతోందని.. ఆగ్రహించింది. కోడికత్తి కేసు ఎన్‌ఐఏ పరిధిలోకి వస్తుందో చెప్పకుండా… ఆ బాధ్యతను తమపైకి నెట్టేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోడికత్తి ఘటన ఎన్‌ఐఏ చట్ట పరిధిలోకి వస్తుందో రాదో స్పష్టంగా తెలియచేస్తూ సీల్డ్‌ కవర్‌లో నివేదిక ఇవ్వాలని మరోసారి కేంద్రాన్ని ఆదేశించింది.

కోడికత్తి కేసు ఘటనను జగన్ ఎక్కడికో తీసుకెళ్లాలనుకోవడంతో … కేంద్రానికి కూడా… ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని.. తాజా పరిణామాలతో నిరూపితమవుతోంది. రాజకీయ కారణాలతో… ఎయిర్ పోర్టులో జరిగిన ఘటనను…. ఎన్‌ఐఏకు అప్పగిస్తే.. ఇక దేశ వ్యాప్తంగా విమాశ్రయాల్లో జరిగే.,. ప్రతి చిన్న ఘటననూ.. ఎన్‌ఐఏకే అప్పగించాల్సి వస్తుందనే భయం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్లు కనిపిస్తోంది. అదే కోర్టు ఆదేశిస్తే తమ చేతికి మట్టి అంటదని అంచనా వేసుకుటున్నారు. అందుకే.. అరకొర సమాచారం ఇస్తూ.. చివరికి కోర్టును కూడా గందరగోళ పరుస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close