ఇది సినిమా కాదు.. చ‌రిత్ర‌: సుమంత్‌

ఎన్టీఆర్ బ‌యోపిక్ లో నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌కు చాలా ప్రాముఖ్యం ఉంది. ఆ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారా? అనే చ‌ర్చ చాలా భీక‌రంగా సాగింది. సుమంత్ వ‌చ్చి ఈ చ‌ర్చ‌కు పుల్ స్టాప్ పెట్టాడు. అక్కినేనిగా సుమంత్ ఆ పాత్ర‌లో ఒదిగిపోయాడ‌ని చెప్ప‌డానికి… ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన స్టిల్స్ సాక్ష్యంగా నిలిచాయి. ఈ సినిమాలో న‌టించ‌డం, తాత‌య్య పాత్ర‌లో తాను క‌నిపించ‌డం, ఓ అదృష్టం, బాధ్య‌త‌గా భావిస్తున్నా అంటున్నాడు సుమంత్‌. ఎన్టీఆర్ ఆడియో వేడుక‌లో సుమంత్ మాట్లాడాడు. త‌న ఫీలింగ్స్‌ని పంచుకున్నాడు.

”నాకు ఈ అవ‌కాశం రావ‌డం అదృష్టంగా, బాధ్య‌త‌గా తీసుకున్నా. ఈ సినిమా ఎలా పూర్త‌య్యిందో, నేనెలా చేశానో, కూడా నాకు తెలీదు. మా కుటుంబం, నంద‌మూరి కుటుంబం మ‌ధ్యఎన్నో ఏళ్లుగా అనుబంధం కొన‌సాగుతూనేఉంది. ఈ అనుబంధానికి పునాది.. ఎక్క‌డ మొద‌లైందో ఈసినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఇది కేవ‌లం సినిమా కాదు. ఇదో చ‌రిత్ర‌. నంద‌మూరి అభిమానులంతా పండ‌గ చేసుకోబోతున్నారు. మీ సంతోషంలో నేను కూడా భాగ‌స్వామి అవుతా” అన్నాడు సుమంత్‌.

”సినిమా కంటే. మ‌హా కావ్యం. ఇది వినోదం కోసం కాదు. భావిత‌రాల‌కు రామారావుగారి గురించి తెలియాలి. ఎంతో స్ఫూర్తి, ఉత్తేజం క‌ల‌గాలి. స‌మాజంలో మార్పు రావాలి. చ‌రిత్ర‌లో మిగిలిపోవాలి” అని ఆకాంక్షించాడు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌.

”క్రిష్‌తో నా క్రియేటీవ్‌తో జ‌ర్నీ కృష్ణం వందే తో మొద‌లైంది. ఎన్టీఆర్ బ‌యోపిక్‌తో పూర్త‌య్యాంది. నేను డిసెంబ‌రు 14న పుట్టా. క‌థానాయ‌కుడు సినిమా విడుద‌ల రోజు అది. బాల‌కృష్ణ‌గారి రాము.. మా ఇంట్లో షూటింగ్ జ‌రుపుకుంది. నేను చూసిన తొలి షూటింగ్ అదే. చంద్ర‌బాబు నాయుడు గారికి పెద్ద థాంక్స్ చెప్పాలి. ఆయ‌న నా తొలి ప్రేక్ష‌కుడు.

ఎన్టీఆర్ గారి ఫ్యాన్ ఎప్పుడ‌య్యా అనేది గుర్తు లేదు. మూడో త‌ర‌గ‌తిలో మేజ‌ర్ చంద్ర‌కాంత్ చూశా. ఆ రోజున నిజంగా ఆయ‌నెవ‌రో నాకు తెలీదు. కానీ ఆయ‌న్ని క‌ల‌వాలి అనిపించింది. మా తాత‌గారిని అడిగాను. కానీ.. క‌ల‌వ‌డం కుద‌ర్లేదు. ఈలోగానే ఆయ‌న కాలం చేశారు. అప్పుడు ఆయ‌న్ని చూడ‌క‌పోయినా.. మ‌హానాయ‌కుడి రూపంలో ఇప్పుడు చూసే అవ‌కాశం ద‌క్కింది“ అన్నాడు రానా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పల్లీబఠాణి కామెంట్స్‌తో రాకేష్ రెడ్డిని ముంచిన కేటీఆర్

బిట్స్ పిలానీ గొప్ప కావొచ్చు కానీ మిగతా గ్రాడ్యూయేట్స్ అంతా పల్లీ బఠాణీలు అంటే ఎలా ?. కేటీఆర్ ఇది ఆలోచించలేదు. ప్రాస బాగుంది కదా అని అనేశారు. ఇప్పుడు...

నో రిఫండ్ బుకింగ్ – 9కి విశాఖ హోటల్స్ రెడీ !

వైసీపీ నేతలు చేస్తున్న అతి కారణంగా విశాఖలో 9వ తేదీన హోటల్స్ నిండిపోతున్నాయని సోషల్ మీడియాలో అనుకుంటున్నారు. కానీ ఆ రోజున విశాఖలో ఉన్న హోటళ్లలో ఇప్పటికే వందల కొద్ది రూములు...

ఆర్కే పలుకు : మీడియా విశ్వసనీయతపై ఆర్కే ఆవేదన

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం కొత్త పలుకులో తెలుగు మీడియా విశ్వసనీయత కోల్పోతోందని.. ప్రజలు ఎవరూ నమ్మలేని పరిస్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేయడానికి కేటాయించారు. చాలా కష్టపడి...

విశ్వ‌క్‌సేన్ కోసం బాల‌య్య‌

నంద‌మూరి హీరోలంటే విశ్వ‌క్‌సేన్‌కు ప్ర‌త్యేక‌మైన అభిమానం. ఎన్టీఆర్‌కు విశ్వ‌క్ వీరాభిమాని. ఎప్పుడు ఎన్టీఆర్ ప్ర‌స్తావన వ‌చ్చినా, ఊగిపోతాడు. బాల‌కృష్ణ‌తో కూడా మంచి అనుబంధ‌మే ఉంది. విశ్వ‌క్‌సేన్ గ‌త చిత్రానికి ఎన్టీఆర్ గెస్ట్ గా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close