సునీల్ కామెడీ చేయ‌డం కూడా మ‌ర్చిపోయాడా?

కామెడీ నుంచి హీరోయిజానికి, మ‌ళ్లీ హీరోయిజం నుంచి కామెడీకి ట‌ర్న్ అయ్యాడు సునీల్‌. హాస్య న‌టుడి నుంచి హీరో అవ్వాల‌ని తీసుకున్న నిర్ణ‌యం మంచిదో కాదో సునీల్ కెరీర్ ని చూస్తే అర్థ‌మైపోతోంది. క‌థానాయ‌కుడిగా సునీల్ సాధించిందేం లేదు. చివ‌ర్లో అయితే వ‌రుస ఫ్లాపులు త‌గిలాయి. మ‌ళ్లీ హాస్య పాత్ర‌ల‌వైపు మొగ్గు చూప‌డం, హీరోయిజాన్ని వ‌దిలేయ‌డం మాత్రం క‌చ్చితంగా త‌న‌కు లాభ‌దాయ‌క‌మే. దానికి త‌గ్గ‌ట్టుగా ఇటీవ‌ల త‌న‌కు కొన్ని మంచి అవ‌కాశాలు కూడా వ‌చ్చాయి, వ‌స్తున్నాయి.

అయితే ఆయా సినిమాల్లో సునీల్ రాణించిందెంత‌? అని అడిగితే మాత్రం స‌రైన స‌మాధానం రాదు. `అర‌వింద స‌మేత‌`లో సునీల్ పాత్ర అంత‌గా పేల‌లేదు. ఆ పాత్ర ఉద్దేశం కామెడీ సృష్టించ‌డం కాదు కాబ‌ట్టి.. సో సోగా ఉన్నా స‌ర్దుకుపోవొచ్చు. `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ`లో సునీల్ పాత్ర పేల‌వంగా సాగింది. నిజానికి ఈసినిమాలోని పాత్ర‌ల‌న్నీ అదే టైపు. అందులో సునీల్ పాత్ర కూడా కొట్టుకెళ్లిపోయింది. తాజాగా `ప‌డి ప‌డి లేచె మ‌న‌సు`లోనూ సునీల్ త‌న పాత్ర‌కు న్యాయం చేయ‌లేక‌పోయాడు. సెకండాఫ్‌లో త‌న‌ది కీల‌క‌మైన పాత్రే. న‌వ్వించే ఛాన్స్ కూడా ఉంది. కానీ.. సునీల్ బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివరీ… ఇలా ఏది చూసినా.. ఫ‌న్ పండ‌లేదు. పాత సునీల్ ని ఎంత వెదికినా ఈ సునీల్‌లో క‌నిపించ‌లేదు. కొన్ని సంద‌ర్భాల్లో ఎలాంటి ఎక్స్‌ప్రెష‌న్ లేని సునీల్‌ని చూస్తుంటే, సునీల్ న‌వ్వించ‌డం కూడా మ‌ర్చిపోయాడా? అనే అనుమానం వేస్తుంది. సునీల్ నుంచి ఆశించేది న‌వ్వులే. ఇలా కామెడీ పాత్ర‌లు చేస్తున్న‌ప్పుడు మ‌రింత ఫ‌న్ ఆశిస్తాం. అది కూడా అందివ్వ‌క‌పోతే. అది ర‌చ‌యిత‌ల త‌ప్పా? సునీల్ త‌ప్పా?? ఇలాంటి ప్రాధాన్యం లేని పాత్ర‌లు ఎంచుకుంటూ పోతే.. హాస్య‌న‌టుడిగానూ త‌న కెరీర్ ప్ర‌మాదంలో ప‌డే ఛాన్సుంది. ఈ విష‌యాన్ని సునీల్ త్వ‌ర‌గా గుర్తిస్తే మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ వెదుకులాట!

బీఆర్ఎస్ ను చుట్టుముడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. లోక్ సభ ఎన్నికలతో కిందా మీదా పడుతున్న సమయంలోనే మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావం చూపేలా మరో ఉపఎన్నిక వచ్చి పడింది....

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో అనుప‌మ‌

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌న జోరు చూపిస్తోంది. టిల్లు స్క్వేర్‌తో హిట్టు కొట్టాక‌, ఆ ఉత్సాహం మ‌రింత‌గా పెరిగిపోయింది. వ‌రుస‌గా కొత్త సినిమాల‌పై సంత‌కాలు పెడుతోంది. తాజాగా బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో జోడీ క‌ట్ట‌డానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close