సుప్రీంకోర్టు తీర్పునకు.. ప్రభాస్ స్థలంకు సంబంధం లేదా..? మరెందుకు సీజ్ చేశారు..?

బాహుబలి ప్రభాస్… న్యాయపోరాటం చేస్తున్నారు. అదీ కూడా ప్రభుత్వంపై చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు పేరుతో… అసలు ఆ తీర్పులో చెప్పినట్లు.. సర్వే నెంబర్లకు.. కానీ… ఇతర అంశాలకు కానీ ఎలాంటి సంబంధం లేకపోయినా… తన స్థలాన్ని ప్రభుత్వ అధికారులు సీజ్ చేశారని… ఆయన ప్రధాన ఆరోపణ. ఇదే అంశాన్ని వివరిస్తూ కోర్టుకు వెళ్లారు. పిటిషన్ పై విచారణ జరుగుతోంది. మరి అది నిజంగానే సుప్రీంకోర్టు తీర్పునకు సంబంధం లేని స్థలమా..? అయితే ప్రభాస్ పై కక్ష గట్టి కావాలనే ఆ స్థలాన్ని సీజ్ చేశారా..? అన్న అనుమానాలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదర్గం మక్త గ్రామంలోని సర్వే నంబర్5/3లో ప్రభాస్‌కు చెందిన 2,083 చదరపు అడగుల స్థలం ఉంది. అది ప్రభుత్వం స్థలం అని తీర్పు వచ్చిందంటూ.. హఠాత్తుగా ఆ స్థలాన్ని తహసీల్దార్ సీజ్ చేశారు. దీనిపై ప్రభాస్ కోర్టుకు వెళ్లారు. తాను ఈ స్థలాన్ని 2005లో బి.వైష్ణవీ రెడ్డి, ఉషా, బొమ్మిరెడ్డి శశాంశ్ రెడ్డిల నుంచి తాను చట్టబద్ధంగా కొనుగోలు చేశానని ఈ భూమిపై ఎటువంటి వివాదాలు లేవని ప్రభాస్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. క్రమం తప్పకుండా ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నానని కోర్టుకు తెలిపారు. ఈ భూమిలో తాత్కాలిక నిర్మాణాలు కూడా ఉన్నాయన్నారు. ఎటువంటి వివాదాలు లేకపోయినా ముందస్తు జాగ్రత్త చర్యగా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుని రూ. కోటీ ఐదు లక్షల ఫీజు కూడా చెల్లించామని, క్రమబద్ధీకరణ దరఖాస్తు ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. అకస్మాత్తుగా రెవెన్యూ అధికారులు వచ్చి తన భూమిని ప్రభుత్వ భూమిగా చెబుతూ, తన ఇంటిని సీజ్ చేశారన్నారు.

సుప్రీంకోర్టు తీర్పులో తాను పార్టీ కాదని, అసలు సుప్రీంకోర్టు తీర్పు గురించి తమకు ఏమీ తెలియదని ప్రభాస్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పునకు.. ఆ స్థలానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ తీర్పును బూచిగా చూపుతూ తనను తన స్థలం నుంచి బలవంతంగా ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారనేది ప్రభాస్ ఆరోపణ. రెవిన్యూ అధికారులు వేసిన కౌంటర్ పై వాదనలను ఈ నెల 31 న విచారణ జరగనుంది. నిజంగా అది ప్రభుత్వ భూమే అయితే.. ప్రభాస్ పట్టించుకోకపోయేవారని.. కానీ తనపై కక్ష సాధిస్తున్నారన్న ఉద్దేశంతోనే ప్రభాస్ కోర్టుకు వెళ్లాడని అంటున్నారు. అంటే ఈ విషయంలో… సుప్రీంకోర్టు తీర్పు నేపధ్యంగా..ఏదో జరుగుతోందన్న విషయం మాత్రం స్పష్టమవుతోందంటున్నారు. అదేమిటో బయటకు తేలాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close