నెగెటివ్‌ టోన్‌లో “ఆర్టీజీఎస్‌” గొప్పతనాన్ని గొప్పగా చెప్పిన సాక్షి..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్థాన మీడియా… చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతపత్రాల్లోని డొల్ల తనాన్ని బయటపెట్టాలని.. వరుసగా ఎడిటోరియల్ పేజీలో.. స్టోరీలు ప్రచురిస్తోంది. తొలి రోజు విభజన హామీల విషయంలో భారతీయ జనతా పార్టీని ఏకపక్షంగా వెనకేసుకొచ్చిన సాక్షి.., రెండో రోజు…ఆర్టీజీఎస్ పై తనదైన ఎనాలసిస్ చేసింది. ” ఎందుకూ కొరగాని ఆర్టీజీఎస్‌!” పేరుతో ఓ కథనం ప్రచురించింది. ఆర్టీజీఎస్ అంటే.. రియల్ టైం గవర్నెన్స్. దీని వల్ల.. ఏపీ పాలనలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు వచ్చాయో.. ప్రజలకు ఎంత బాగా సేవలు చేయగలిగామో.. చంద్రబాబు రెండో శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు చెప్పుకొచ్చారు. దీనికి కౌంటర్ ఇచ్చేందుకు.. ఈ కథనం రాసుకొచ్చారు. ఎందుకూ కొరకాదని టైటిల్‌లో చెప్పినా.. ఆ వ్యవస్థ గొప్పగా ఉందని.. కొన్ని ఉదాహరణలతో చెప్పుకు రావడం.. ఈ కథనంలో కొత్త విశేషం.

” ఆర్టీజీఎస్‌లోనే పరిష్కార వేదిక పేరుతో 1100 కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసి అందులో రెండు వేల మందికిపైగా ఆపరేటర్లను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్‌ చేసి ఫిర్యాదులు చేస్తున్నారు. 2017 నవంబర్లో ఇది ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకూ 1,72,11,367 ఫిర్యాదులు రాగా అందులో 1,41,92,898 పరిష్కారమయ్యాయి..” ఇదీ ఆ కథనంలోఉన్న అంశం. అంటే అద్భుతంగా పని చేస్తున్నట్లే కదా..?. పైగా పని తీరు ఎలా ఉందో వివరించడానికి ఓ ఉదాహరణ కూడా ఓ ఆర్టికల్‌లో చెప్పారు. “మచిలీపట్నం రూరల్‌ మండలానికి చెందిన ఒక వ్యక్తి తమ గ్రామంలో రోడ్డు వేయాలని కోరితే ఆర్టీజీఎస్‌ దాన్ని సంబంధిత విభాగానికి పంపింది. ఆ పిటీషన్‌ వివిధ దశల్లో తిరిగి చివరికి ప్రస్తుతం నిధుల్లేవు, ఉన్నప్పుడు రోడ్డు వేస్తామనే సమాధానంతో ముగిసింది..” అని కథనంలో రాసుకొచ్చారు. అంటే.. ఆర్టీజీఎస్‌కు ఓ సామాన్యుడు చేసిన ఫిర్యాదును సైతం.. ఆ వ్యవస్థలో అంత సీరియస్‌గా తీసుకున్నారనే కదా అర్థం. దీన్నే సాక్షి నెగెటివ్‌గా ప్రజెంట్ చేయాలనుకుంది. కానీ చదివేవారికి మాత్రం… ఆర్టీజీఎస్ పని తీరు ఇంత బాగుందా అని అనిపించక మానదు.

ప్రభుత్వం నేరుగా ప్రజలకు ఫోన్ చేసి.. సమస్యల గురించి ప్రశ్నించడం అంటే.. అది ఊహించలేని విషయం. అది ఏపీ ప్రభుత్వం చేస్తోందని సాక్షి తన బ్లాక్ పేపర్ -2లో విశ్లేషించింది. ” కాల్‌ సెంటర్‌ నుంచి ప్రతిరోజూ 15 లక్షల మందికి ఫోన్లు చేసి ప్రభుత్వ పథకాలపై సంతృప్తిగా ఉన్నారా, లేదా అని వివిధ రకాలుగా ప్రశ్నిస్తున్నారు. ఇవికాకుండా మరో 15 లక్షల ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌తో ఈ సర్వేలు చేస్తున్నారు. వీటి ఆధారంగానే ముఖ్యమంత్రి నిత్యం ప్రజల్లో ఇంత సంతృప్తి స్థాయి ఉందని, ఇంకా పెరగాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు…” అని ఆర్టికల్‌లో తేల్చారు. అంటే పట్టించుకునే ప్రభుత్వం అధికారంలో ఉందనే కదా అర్థం. ఆర్టీజీఎస్, ఏపీ ప్రభుత్వం ఉపయోగిస్తున్న సాంకేతికతపై నీతి ఆయోగ్‌ పెదవి విరిచిందని సొంత కవిత్వం రాసుకున్నారు కానీ.. నీతి ఆయోగ్‌ నివేదికలో ఏపీ దేశంలో నాలుగో స్థానంలో ఉందని వెంటనే ఆర్టికల్‌లో సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఇలా తుపాను హెచ్చరికలు సహా ఇతర అంశాల్లో ఆర్టీజీఎస్ పనితీరుకు నేరుగా సర్టిఫికెట్ ఇచ్చేసి.. ఆ తర్వాత.. అంతా రాజకీయ పరమైన విమర్శలు చేసుకొచ్చారు కానీ.. నిజంగా ఆర్టీజీఎస్ పనితీరును…సాక్షి చెప్పినంత గొప్పగా .. ఎవరూ చప్పలేదని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close