ఎఫ్ 2’లో ప‌వ‌న్ ఫ్యాన్స్ కి ఓ స‌ర్‌ప్రైజ్‌

మెగా హీరోలు ప్రెస్ మీట్లు పెట్టినా, ఆడియో ఫంక్ష‌న్లు చేసినా, సినిమాలు చేసినా ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరుని ఓసారి మ‌న‌నం చేసుకోవాల్సిందే. లేదంటే మెగా ఫ్యాన్స్‌కి అంత కిక్ రాదు. ప‌వ‌న్‌ని మెగా హీరోల కంటే బ‌య‌టి హీరోలే ఎక్కువ వాడేస్తుంటారు. అలాంట‌ప్పుడు మెగా హీరోలు వాడుకుంటే త‌ప్పేంటి? అందుకే వ‌రుణ్‌తేజ్ ఇప్పుడు ‘ఎఫ్ 2’లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని గుర్తు చేయ‌బోతున్నాడు. ఈ సినిమాలో వెంక‌టేష్, వ‌రుణ్‌తేజ్‌ల‌పై ఓ పాట తెర‌కెక్కించారు. అందులో వెంకీ, వ‌రుణ్ ఇద్ద‌రూ కూలీల డ్రెస్‌లో క‌నిపిస్తారు. అందుకు సంబంధించిన స్టిల్ ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఈ సంద‌ర్భంలోనే వ‌రుణ్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని గుర్తు చేసేలా మేన‌రిజ‌మ్స్ ప్ర‌ద‌ర్శిస్తాడ‌ని తెలిసింది. ఈ విష‌యాన్ని దిల్ రాజు కూడా సూత ప్రాయంగా ఒప్పుకున్నారు. ”ఓ పాట‌లో వెంక‌టేష్ కూలీ నెంబ‌ర్ వ‌న్ గెట‌ప్‌లో క‌నిపిస్తారు. అదే పాట‌లో వ‌రుణ్‌తేజ్ ప‌వ‌న్‌ని గుర్తు చేసేలా త‌మ్ముడులో వేసిన డ్రెస్ వేసుకుంటారు” అని చెప్పుకొచ్చారు దిల్‌రాజు. త‌మ్ముడిలో.. ‘వ‌య్యారి భామ నీ హంస న‌డ‌క‌’ పాట కోసం ప‌వ‌న్ కూలీ అవ‌తారం ఎత్తాడు. ఇప్పుడు అదే గెట‌ప్‌లో క‌నిపించ‌బోతున్నాడు వ‌రుణ్‌. అక్క‌డే… ప‌వ‌న్ మేన‌రిజాన్ని దింపేయ‌నున్నాడ‌న్న‌మాట‌. మ‌రి దీనికి థియేట‌ర్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలిక‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close