అడుసు తొక్కనేల… వివరణ ఇచ్చునేల .. నాగబాబు..!

బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని ఓ వెబ్‌ మీడియాకు పిలిచి మరీ ఇచ్చిన ఇంటర్యూలో చెప్పి.. దాన్ని వైరల్ చేసుకున్న చిరంజీవి తమ్ముడు, పవన్ కల్యాణ్ అన్న నాగేంద్రబాబు… అలియాస్ నాగబాబు… ఆ తర్వాత చాలా వరుసగా బాలకృష్ణను టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ తర్వతా బాలకృష్ణ అనే పాత తరం కమెడియన్ ఫోటో చూపించి ఓ సారి.. ఆ తర్వాత కొన్ని జంతవుల ఫోటోలు పెట్టి ఓ సారి.. అలాగే బయోపిక్‌పై… ఓ కవిత రాసి… బాలకృష్ణపై తన కోపాన్నంతా చూపించారు. నాగేంద్రబాబు హఠాత్తుగా ఎందుకు బాలకృష్ణను టార్గెట్ చేస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు. పట్టించుకున్న వాళ్లు పట్టించుకున్నారు.. లేని వాళ్లు లేదు. కానీ.. హఠాత్తుగా.. ఓ వివరణ లాంటి వీడియోతో … ట్విట్టర్‌లో ప్రత్యక్షమయ్యారు.

బాలకృష్ణనే అన్నానని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు..?

బాలకృష్ణను తాను టార్గెట్ చేయలేదని.. మీరే అలా అనుకున్నారంటూ… ప్రారంభించి.. అసలు బాలకృష్ణ కూడా.. ఆరేడు నెలల కిందట.. అలా హెచ్‌ఎంటీవీలో అన్నారని… అందుకే తాను ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటున్నాన్నట్లుగా కంక్లూజన్ ఇచ్చారు. “మీరు చెయ్యేచ్చు.. మేమూ చేయకూడదా..?” అన్నది ముగింపు. అంటే.. బాలకృష్ణనే అన్నాను అని కన్ఫర్మ్ చేస్తూనే… మొదట్లో ఆ మాట అంగీకరించడానికి కూడా.. వెనుకాడరు. ధైర్యంగా బాలకృష్ణనే అన్నానని చెప్పడానికి సంకోచించడం ఎందుకు..? ఆయన అన్నాడు కాబట్టి.. తాను అన్నానని చెప్పుకోవడం ఎందుకు..?. యస్ .. నేను బాలకృష్ణనే అన్నానని చెప్పుకోవడానికి కూడా సిద్ధపడనప్పుడు.. ఇలాంటి “వార్ ఆఫ్ వర్డ్స్”లోకి దిగడం ఎందుకు..?

బాలకృష్ణ కామెంట్ ఆరేడు నెలల తర్వాత ఎందుకు గుర్తొచ్చింది..?

బాలకృష్ణ పవన్ కల్యాణ్ ఎవరో తెలియదని.. ఇటీవలి కాలంలో అనలేదు. అది జరిగి చాలా రోజులు అయింది. అప్పుడే సందర్భంలో అన్నారో కానీ… ఎప్పుడో అన్న మాటల్ని ఇప్పుడు బయటకు తీసుకురావడం ఎందుకు..?. నిజంగా.. బాలకృష్ణ మాట మనసుల్ని బాధపెట్టి ఉంటే.. అప్పుడే ఎందుకు రియాక్ట్ అవలేదు. అప్పట్లో కూడా ఇంటర్యూ ఇవ్వడానికి చాలా యూ ట్యూబ్ చానల్స్ ఉన్నాయి. వైరల్ చేసుకోవడానికి ఫేస్ బుక్ , ట్విట్టర్లు ఉన్నాయి. కానీ అప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉండి ఇప్పుడు మాత్రమే ఎందుకు హైలెట్ చేశారు. కావాలని… ప్రత్యేకంగా.. బాలకృష్ణ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టే వ్యూహమే అమలు చేశారన్న అనుమానాలు సహజంగానే ఉన్నాయి. ఏపీ రాజకీయాలు కులాల ప్రకారం విడిపోయి.. ఓ రకమైన ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన తరుణంలో నాగబాబు… ఎప్పుడో మాట్లాడిన మాటలను బయటకు తెచ్చి… ప్రత్యేకంగా టార్గెట్ చేయడం వెనుక రాజకీయం లేదని ఎలా అనుకుంటారన్న విమర్శలు సహజంగానే వస్తూ ఉంటాయి.

ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టి రాజకీయం చేయాలనే ఉద్దేశమేనా..?

ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టి రాజకీయం చేద్దామనుకుని ఫెయిలయ్యే వివరణ ఇచ్చినట్లుగా తాజా ట్వీట్ వీడియో ఉందన్న అభిప్రాయం… అందరిలోనూ కలగడానికి నాగబాబే కారణం. హీరోలు, హీరోలు బాగుంటారు.. వారి వారి కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గెట్ టు గెదర్ పార్టీల్లో పాల్గొంటూ ఉంటారు. వారి వారి పిల్లలకు.. రాజకీయాలు, కులాలు, మతాలు ఉండవు. ఆత్మీయంగా పార్టీలు చేసుకుంటూ.. సోషల్ మీడియాలో వైరల్ అయిపోతూ ఉంటారు. కానీ.. ఫ్యాన్స్ మధ్య మాత్రం ఎప్పటికప్పుడు .. ఆ గ్యాప్ ఉంచే ప్రయత్నాలు మాత్రం జరుగుతూనే ఉంటాయి. అలాంటిదే నాగబాబు చేసిన ప్రయత్నం అని అనిపిస్తే.. ఆ తప్పు నాగబాబుదే.

అందరిదీ తప్పే.. మరి వివరణ ఎందుకు..?

రాజకీయంగా పవన్ కల్యాణ్ చంద్రబాబుపై, లోకేష్‌పై చేస్తున్న విమర్శలను నాగబాబు వినడం లేదా..? అలాగే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలు కూడా ఇంపుగా ఉన్నాయా ..?. అన్నీ రాజకీయాల్లో భాగంగా.. రాజకీయంగా ఎంతైనా విమర్శించుకునే ఫ్లెక్సిబులిటీ ఉంది. వ్యక్తిగతంగా కించ పరిచే హక్కు ఉందా అంటే ఉంది.. లేదా అంటే లేదు.. అది నైతికతకు సంబంధించిన విషయం . ఉంది అని భావిస్తే వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత వివరణ ఇవ్వాల్సి వస్తుంది అనుకుంటే… వ్యక్తిగతంగా కించ పరచకుండా ఉండటమే ఉత్తమం. నాగబాబు నేర్చుకోవాల్సింది ఇదే కావొచ్చు..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

‘స్వ‌యంభూ’ యాక్ష‌న్‌: 12 రోజులు… రూ.8 కోట్లు

'కార్తికేయ 2'తో నిఖిల్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇది వ‌ర‌కు రూ.8 కోట్లుంటే నిఖిల్ తో సినిమా చేసేయొచ్చు. ఇప్పుడు ఓ యాక్ష‌న్ సీన్...

నాని సైతం.. ప‌వ‌న్ కోసం

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి ప‌దేళ్ల‌య్యింది. మెగా ఫ్యామిలీ, కొంత‌మంది క‌మెడియ‌న్లు, ఒక‌రిద్ద‌రు ప‌వ‌న్ డై హార్డ్ ఫ్యాన్స్ త‌ప్ప‌, ప‌వ‌న్‌కు నేరుగా పొలిటిక‌ల్ గా స‌పోర్ట్ ఎవ‌రూ చేయ‌లేదు. దానికి...

కేసీఆర్‌కు ధరణి – జగన్‌కు టైటిలింగ్ యాక్ట్ !

తెలంగాణలో కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు.. అంటే ప్రధాన కారణాల్లో ధరణి అని ఒకటి వినిపిస్తుంది. ఈ చట్టం వల్ల కేసీఆర్ , బీఆర్ఎస్ నేతలు భూములు దోచుకున్నారన్న ఓ ప్రచారం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close