పవన్‌కి టైం లేదు.. ఇక పోరాటయాత్రల్లేవ్..!

పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి ఎన్ని సంవత్సరాలైంది..?. ఐదేళ్లు దాటిపోయింది. ఇప్పటికీ.. నాకు సమయం సరిపోవడం లేదు… అని కారణం చెబితే.. ఆయనను ఏమనాలి..?. సీరియస్ పొలిటిషియన్‌గా గుర్తించాలా…?. పార్ట్ టైమ్ పొలిటిషియన్ అనుకోవాలా..? ప్రణాళిక లేని… నిర్లక్ష్య రాజకీయ నేత అనుకోవాలా..? లేక… గాలి వాటం మనిషి అనుకోవాలా..? ఏదైనా అనుకోవాల్సిందే. ఎందుకంటే.. పవన్ కల్యాణ్ తన.. పని చేయలేకపోవడానికి… పోటీ చేయలేకపోవడానికి మరో సారి కారణంగా సమయాన్ని చూపించారు.

పోరాటయాత్ర బంద్..! టైం లేకపోవడమేనట…!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని జిల్లాలున్నాయి…? పదమూడు జిల్లాలున్నాయి. ఈ పదమూడు జిల్లాలో తిరగడానికి కూడా.. పవన్ కల్యాణ్‌కు సమయం సరిపోలేదు. పోరాటయాత్ర చేస్తా.. కవాతు ద్వారా.. రాజకీయం చేస్తా.. అంటూ బయలుదేరాడు కానీ..ఐదు జిల్లాలు తిరిగే సరికే.. సమయం మొత్తం గడిచిపోయింది. ఇప్పుడు ఎన్నికలు ముంగిటకు వచ్చేశాయి కాబట్టి.. పోరాటయాత్ర నిలిపివేసి.. ఆయన జిల్లాలో అంశాల వారీ సమస్యలు తీసుకుని పర్యటించాలని అనుకుంటున్నారట. కనీసం పదమూడు జిల్లాల్లో పర్యటించలేని రాజకీయ నేత… ఎవరైనా ఉన్నారా అంటే.. అది పవన్ కల్యాణే. కనీసం.. ఐదేళ్ల కాలంలో.. తన పార్టీ ఏమిటి..? తన పార్టీ పరిస్థితి ఏమిటి..? ఏ జిల్లాల్లో ఏంటి పరిస్థితి అని.. కనీసం ఓ సారి ఆయా జిల్లాలకు వెళ్లి వ్యవహారాలు చక్కబెట్టుకోలేని రాజకీయ నేత… ఒక్క పవన్ కల్యాణ్ మాత్రమే అవుతారు.

ఓ ప్రణాళిక లేకుండా రాజకీయాలు ఎలా చేస్తారు..?

పవన్ కల్యాణ్ కాల్షీట్లకు అలవాటు పడిపోయారు. సంవత్సరాల తరబడి సినిమాలు తీయడం ఆయనకు అలవాటైపోయింది. దానికి ప్లానింగ్ లేదు. ఎప్పుడు డుమ్మా కొట్టాలనుకుంటే.. అప్పుడు డుమ్మాకొట్టేస్తారు. పోరాటయాత్రను కూడా అంతే చేశారు. ఎంత తీరుబడిగా చేసినా… పోరాటయాత్రకు ఒక్కో జిల్లాకు ఒక్క నెల అంటే… చాలా ఎక్కువగా ఒక్కో నియోజకవర్గంలో మూడు, నాలుగు రోజులు కేటాయించవచ్చు. కానీ పవన్ కల్యాణ్… నియోజకవర్గానికి రోజు కూడా కేటాయించలేదు. కానీ.. సమయం గడిచిపోయింది. గత మేలో… శ్రీకాకుళం జిల్లాలో పోరాటయాత్ర చేశారు. నియోజకవర్గానికి ఒక్క రోజు కేటాయించినా.. ఈ పాటికి.. ఏపీ మొత్తం తిరిగేసి ఉండేవారు. ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాలు తిరిగేసి.. ఇక సమయం లేదని… కాళ్లు చాపి కూర్చోవడం.. ప్రణాళిక లేని రాజకీయం అవుతుంది. కనీసం.. పార్టీ కార్యక్రమాల్ని… కూడా.. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించలేనంతగా పరిస్థితులు ఉంటే.. ప్రజలు ఎలా నమ్ముతారు..?

అందరికీ ఒకే టైమండి పవన్ గారూ..!

రాజకీయ నేతల్లో సమయం లేదనే కారణం బహుశా… ఒక్క పవన్ కల్యాణే చెబుతారు కావొచ్చు. అధికారంలో ఉన్నా .. ప్రతిపక్షంలో ఉన్నా… సమయంతో పోటీ పడి రాజకీయాలను చక్క బెట్టుకోవాలి. అందే కానీ.. ప్రతీ దానికి సమయం లేదని… తప్పించుకోవడం రాజకీయం అనిపించుకోదు. టీడీపీ అధినేత చంద్రబాబు.. ఓ వైపు ప్రభుత్వ వ్యవహారాలను చక్కబెట్టుకుంటూనే… పార్టీని నడుపుతున్నారు. ఆయన ఒక్కో జిల్లాకు పదుల సార్లు వెళ్లారు. దాదాపుగా అన్ని నియోజకవర్గాలు చుట్టబెట్టారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర యాత్ర ద్వారా మెజార్టీ నియోజకవర్గాల్లో నడిచారు. మరి ఇద్దరితో పోలిస్తే.. పవన్ కల్యాణ్.. ఏమంత బిజీగా ఉన్నారు. అయినా… పవన్ కల్యాణ్ ఎందుకు… సగం జిల్లాలను కూడా కవర్ చేయలేకపోయారు.

పోరాటయాత్రలు జరిగిన తీరు… ఆపేసిన తీరు చూస్తూంటే.. పవన్ కల్యాణ్.. ఏదో కారణం చెప్పి… అసలు సవాళ్ల నుంచి తప్పించుకున ప్రయత్నం చేస్తున్నారని మాత్రం క్లారిటీ వస్తుంది. రాజకీయాల్లో… పోరాడేవాడికే విలువ ఉంటుంది కానీ.. పారిపోయేవాడికి.. సాకులు చెప్పేవారికి ఉండదు. ఆ విషయం పవన్ కల్యాణ్ తెలుసుకోవాల్సి ఉంది..

–సుభాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close