ఆకుల” విమర్శలపై బీజేపీ స్పందించగలదా..?

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ రాజీనామా చేశారు. ప్రజల్లో బీజేపీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉందని.. దానికి కారణం విభజన హామీలపై దారుణంగా వంచించడమేనని… ఆకుల సత్యనారాయణ తన రాజీనామా కారణాలను స్పష్టంగా చెప్పారు. రాజకీయ భవిష్యత్ కోసమే.. తాను బీజేపీని వీడాల్సి వస్తోందని… అన్యాపదేశంగా అయినా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలో .. ఏపీకి బీజేపీ చేసిన అన్యాయంపై మాట్లాడారు. ప్రత్యేకహోదా, స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ సహా ప్రతి అంశంలోనూ బీజేపీ అగ్రనాయకత్వం.. ఏపీని వంచించిందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. బీజేపీలో ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నేత మొదటిసారిగా…ఈ తరహాలో గళం విప్పారు. ఇంత వరకు.. తెలుగుదేశం పార్టీ నేతలు.. ఈ విమర్శలు చేస్తూంటారు. దీనికి… కౌంటర్‌గా బీజేపీ నేతలు చాలా మాటలు మాట్లాడుతూంటారు. ప్రధాని నుంచి సోము వీర్రాజు వరకు.. చంద్రబాబు వెన్నుపోటుదారుడు అంటూ చెప్పుకొస్తారు కానీ.. విభజన హామీల గురించి మాట్లాడరు. కానీ.. ఇప్పుడు.. సొంత పార్టీ ఎమ్మెల్యే ఈ తరహా విమర్శలు ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్‌కు భారతీయ జనత పార్టీ అన్యాయం చేసిందేనేది… ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. తాము ఎంతో చేశామని బీజేపీ నేతలు చెప్పుకునే ప్రయత్నం చేయడం.. రాష్ట్ర ప్రయోజనాలను కూడా… పట్టించుకోకుండా.. సొంత రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునే ప్రయత్నమే. ప్రజల్లో ఏ మాత్రం పట్టు లేని ఏపీ బీజేపీ నేతలు… కేంద్ర ప్రబుత్వం, బీజేపీ అగ్రనాయకత్వం ఇచ్చే పదవులపైనే ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారు. ఈ కారణంగా వీరు… ఢిల్లీలోని తమ నాయకత్వాన‌్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ.. ప్రజల మనోభావాల్ని వారి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించడం లేదు. ప్రధానమంత్రి మోడీ.. యాప్‌ ద్వారా ఏపీ కార్యకర్తలతో మాట్లాడితే.. మోడీని సంతోష పరిచేందుకు చంద్రబాబును.. ” లుచ్చా.. బెచ్చా..” అని సోము వీర్రాజు లాంటి నేతలు తిట్టారు కానీ.. ఏపీ కి రావాల్సిన విభజన హామీలపై మాత్రం నోరెత్తలేదు. ఇలాంటి రాజకీయ నేతలు ఉన్న పరిస్థితుల్లో.. ఇప్పుడు బీజేపీకి.. ఆకుల సత్యనారాయణ రూపంలో సమాధానం చెప్పుకోవాల్సిన ప్రశ్నలు బయటకు వస్తున్నాయి.

ఏపీ బీజేపీలో ఆకుల సత్యనారాయణ రాజీనామా వ్యవహారం కలకలం రేపడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు కారణంగా గెలిచిన ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేల్లో… ఎవరు పార్టీలో ఉంటారు.. ఎవరు పోటీ చేస్తారన్నదానిపై క్లారిటీలేదు. ప్రజలు ఓట్లేస్తే గెలిచిన వీరు.. తమ పార్టీ అగ్రనాయకత్వం పై కినుకతోనే ఉన్నారు. కానీపార్టీని ఎదిరించలేక పోతున్నారు. అందుకే వీరిలో..అవకాశం ఉన్న వాళ్లు ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరిపోతున్నారు. కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు.. టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇక ఆరెస్సెస్ నుండి వచ్చిన మాణిక్యాలరావు… పార్టీ నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేయరు. కానీ పోటీకి మాత్రం దూరంగా ఉంటారని చెబుతున్నారు. అదే సమయంలో ఎంపీలు గోకరాజు గంగరాజు, హరిబాబు తాము పోటీ చేయడం లేదని సన్నిహితులకు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో.. ఏపీ బీజేపీలో ఆకుల సత్యనారాయణ రాజీనామా సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close