కొత్తగా ఇవ్వబోయే హామీల్ని అమలు చేస్తున్న చంద్రబాబు…!

అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికలకు వెళ్లాలంటే అనేక చిక్కులు ఉంటాయి. అందులో మొదటిది కొత్త హామీలు ఇవ్వడం. ఏదైనా కొత్త హామీ ఇస్తే.. ఐదేళ్లు అధికారంలో ఉన్నావు కదా.. ఎందుకు అమలు చేయలేదనే విమర్శలు వస్తాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి… టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు… తాను ఇవ్వాలనుకుంటున్న హామీలన్నింటినీ ముందుగానే అమలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం రెట్టింపు పెన్షన్ల హామీ ఇవ్వాలని గత ఏడాది నుంచే ఆయన పార్టీ నేతలకు చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు అమలు చేయడం ప్రారంభించారు. రైతులకు ఉచిత విద్యుత్ తొమ్మిది గంటలకు పెంచారు. గిరిజనులకు పోషకాహారం అందించడానికి ఫుడ్ బాస్కెట్ అంటూ.. కొత్త పథకానికి రూపకల్పన చేశారు. అమలుకు ఆదేశాలిచ్చారు.

ఎన్నికల హామీల తీరు మారిపోతోంది. ఓటర్ల మనసులు కూడా మారిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం మాకేమిచ్చింది… అని ఆలోచిస్తున్నారు. ఏదైనా వ్యక్తిగత ప్రయోజనం కలిగింది అని అనుకున్నప్పుడు మాత్రం… పాజిటివ్ కోణం బయటకు వస్తోంది. దానికి సంక్షేమం అని పేరు పెట్టి ప్రభుత్వాలు.. అలా పంచుకుంటూ వెళ్తున్నాయి. గతంలో… ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టేది.. కానీ ఇప్పుడు నేరుగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఇదో విప్లవాత్మక మార్పులాంటిది. అధికారికంగా ఓట్లు కొనుగోలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నా .. లబ్దిపొందిన వాళ్లు అండగా ఉంటారని.. అధికార పార్టీలు ఆశ పడుతున్నాయి.

ఏపీ ప్రభుత్వం కూడా అదే బాటలో ఉంది. సంక్షేమ పథకాల లబ్దిదారులు ఓటేస్తే చాలు మళ్లీ అధికారంలోకి వస్తామని నిర్ణయించింది. ఫలితంగా… ఇప్పుడున్న సంక్షేమాన్ని రెట్టింపు చేస్తున్నారు. ప్రత్యేకంగా పట్టించుకునే ప్రభుత్వం ఉందని చెప్పేందుకు ఫోన్లు చేసి కనుక్కుంటున్నారు. కొత్తగా ప్రజలు ఆశిస్తున్న వాటిని నెరవేర్చేందుకు వెనుకాడటం లేదు. మరి ఈ ప్రభుత్వం చేస్తున్న దాని కన్నా ఎక్కువగా ప్రతిపక్షం హామీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయం వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉంటుందో చూడాలి..!. టీడీపీ మాత్రం.. తాము చెప్పనవి కూడా అమలు చేశామని చెవ్పుకునేందుకు రెడీ అయిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close