ఈ సినిమాని సాక్షి కూడా వ‌దిలేస్తే ఎలా..?

బ‌యోపిక్‌ల ప‌రంప‌ర‌లో వ‌స్తున్న మ‌రో సినిమా యాత్ర‌. వై.ఎస్‌.ఆర్ జీవిత క‌థ ఇది. ఎన్నిక‌ల సీజ‌న్‌కి ముందు ఈ సినిమాని విడుద‌ల చేస్తారు. ఈ సినిమా వెనుక వై.ఎస్‌. జ‌గ‌న్ ఉన్నాడ‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. ఆయ‌న స‌ల‌హాలు, సూచ‌న‌ల ప్ర‌కార‌మే ఈ సినిమా రూపొందుతోంది. పెట్టుబ‌డి కూడా జ‌గ‌న్ వ‌ర్గీయులే పెట్టార‌ని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్‌. విడుద‌ల‌కు మ‌రో రెండు వారాల గ‌డువు మాత్ర‌మే ఉంది. అయితే.. ఈ సినిమాకి సంబంధించి ప‌బ్లిసిటీ ఇంకా ఊపందుకోలేదు. అప్ డేట్స్ కూడా అంతంత‌మాత్రంగానే బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

క‌నీసం సాక్షి దిన‌ప‌త్రిక కూడా ఈ సినిమాని ప‌ట్టించుకోక‌పోవ‌డం విచిత్రంగా క‌నిపిస్తోంది. వైఎస్‌ని దేవుడిగా చూపించుకునే ప‌త్రిక‌… వైఎస్ జీవితంపై ఓ సినిమా వ‌స్తోందంటే ఎంత హ‌డావుడి చేయాలి..? కానీ ముందు నుంచీ ఈ సినిమాకి సంబంధించిన ప‌బ్లిసిటీ సాక్షిలో అంతంత మాత్రంగానే వ‌స్తోంది. ఇది త‌మ సినిమా అనే ముద్ర ఉండ‌కూడ‌ద‌ని సాక్షి జాగ్ర‌త్త ప‌డుతుందా అనేది అర్థం కావ‌డం లేదు. అది వైఎస్ జ‌గ‌న్ సినిమా అనే ముద్ర‌తో ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి కూడా ఈ సినిమాకి త‌గినంత ప్ర‌చారం క‌ల్పించ‌డం లేదు. మొత్తానికి యాత్ర ప్ర‌చారం చాలా నెమ్మ‌దిగా సాగుతుంది. విడుద‌ల‌కు ముందైనా కాస్త స్పీడందుకుంటుందేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉరవకొండ రివ్యూ : మరోసారి పయ్యావుల కేశవ్‌కే కిరీటం

ఉరవకొండలో పయ్యావుల గెలిస్తే టీడీపీ ఓడిపోతుందన్న ఓ ప్రచారాన్ని ఆయన ప్రత్యర్థులు చేస్తూ ఉంటారు. కానీ పయ్యావుల రాజకీయాల్లోకి వచ్చిన 1994లో టీడీపీ విజయం సాధించింది. పయ్యావుల కూడా గెలిచారు. ఆ తర్వతా...

చెల్లిని కించపర్చి జాతీయ మీడియాలో జగన్ నవ్వులపాలు

జాతీయ మీడియాకు జగన్ ఇచ్చిన ఇంటర్యూలు నవ్వుల పాలయ్యాయి. ఇతర విషయాల సంగతేమో కానీ చెల్లి షర్మిలపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీహార్ లో పురుషాహంకారం ఉండే నేతలు కూడా...

పోస్టల్ బ్యాలెట్స్ కూడా రీపోలింగ్ – ఇదేం ఎన్నికల నిర్వహణ ?

ఎన్నికల నిర్వహణ ఎంత అసమర్థుల చేతుల్లో ఉందో తెలిపే ఘటన ఇది. పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట లో పోస్టల్ బ్యాలెట్లకు బదులు ఉద్యోగులకు డమ్మీ బ్యాలెట్లు ఇచ్చారు. రోజంతా ఉద్యోగులు కష్టపడి...

రైతు భరోసా స్టార్ట్ … క్రెడిట్ బీఆర్ఎస్ దేనా..?

రైతు భరోసాకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో కేసీఆర్ తనదైన రాజకీయం ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల వేళ పెట్టుబడి కింద రైతుల అకౌంట్లో డబ్బులు జమ అవుతుండటంతో ఆ క్రెడిట్ బీఆర్ఎస్ ఖాతాలో వేస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close