మ‌హానాయ‌కుడ్ని చుట్టేస్తున్నారా?

ఓ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయ‌డంలో ఉన్న క‌ష్ట‌న‌ష్టాలేంటో ‘ఎన్టీఆర్ని’ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ‘కథానాయ‌కుడు’ హిట్టై, మంచి డ‌బ్బులొస్తే.. `మ‌హానాయ‌కుడు`ని ఎప్పుడు విడుద‌ల చేద్దామా అని చిత్ర‌బృందానికి, దాన్ని ఎప్పుడెప్పుడు చూసేద్దామా? అని ప్రేక్ష‌కుల‌కూ ఉత్సుక‌త ఉండేది. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ‘క‌థానాయ‌కుడు’ ప్ర‌భావం చూపించ‌క‌పోవ‌డంతో – ‘మ‌హానాయ‌కుడు’పై ఎలాంటి ఆస‌క్తీ లేకుండా పోయిందిప్పుడు. దానికి తోడు చిత్ర‌బృందం కూడా ‘విడుద‌ల చేద్దాంలే.. త‌ప్పుతుందా’ అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ సినిమా విడుద‌ల తేదీ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కూ చిత్ర‌బృందం ఓ క్లారిటీ ఇవ్వ‌లేదు. ఫిబ్ర‌వ‌రి 7 త‌ర‌వాత 15కి వెళ్లింది, ఇప్పుడు 21 అంటున్నారు. కానీ… ఈ విష‌యంలో ఎవ‌రూ స్పందించ‌డం లేదు.

‘క‌థానాయ‌కుడు’ విడుద‌ల‌య్యే స‌మయానికి ‘మ‌హానాయ‌కుడు’కి సంబంధించి 12 రోజుల షెడ్యూల్ బాకీ ఉంది. ‘క‌థానాయ‌కుడు’ 9న విడుద‌లైతే 12నే `మ‌హానాయ‌కుడు` షూటింగ్ మొద‌లెట్టేశారు. అంటే.. ఈపాటికి ‘మ‌హానాయ‌కుడు’ పూర్త‌వ్వాలి. కానీ ఇంకా షూటింగ్ జ‌రుగుతూనే ఉంది. మ‌ధ్య‌మ‌ధ్య‌లో బ్రేకులు పడ‌డం వ‌ల్ల షూటింగ్ ఆల‌స్యం అవుతోంది. తీయాల్సిన కొన్ని స‌న్నివేశాల్ని సైతం.. కుదించేస్తున్నార‌ని వినికిడి. భారీ జ‌న సందోహం మ‌ధ్య కొన్ని షాట్స్ తీయాల్సివుంది. వాటిని బ‌డ్జెట్ త‌గ్గించాలన్న ఉద్దేశ్యంతోనో, తొంద‌ర‌గా చుట్టేయాల‌న్న ఆలోచ‌న‌తోనో పైపైనే కానిచ్చేస్తున్నార్ట‌. పైగా ‘క‌థానాయ‌కుడు’ రిజ‌ల్ట్ చిత్ర‌బృందానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దాన్నుంచి తేరుకోవ‌డం క‌ష్టం. అందుకే `ఎలాగోలా పూర్తి చేస్తే చాలు `అనుకుంటూ మిగిలిన షూటింగ్‌ని నెట్టుకొస్తున్నార‌ని స‌మాచారం. ఈనెలాఖ‌రు వ‌ర‌కూ చిత్రీక‌ర‌ణ జ‌రిగే అవ‌కాశాలున్నాయి. ఆ తర‌వాతే చిత్ర‌బృందం విడుద‌ల తేదీ విష‌యంలో స్ప‌ష్ట‌త ఇస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హోంమంత్రి అనిత … వనితలా కాదు !

ఏపీ హోంత్రులుగా దళిత మహిళలే ఉంటున్నారు. జగన్ రెడ్డి హయాంలో ఇద్దరు దళిత హోంమంత్రులు ఉన్నారు. ఒకరు మేకతోటి సుచరిత, మరొకరు వనిత. అయితే తాము హోంమంత్రులమన్న సంగతి వీరిద్దరికి కూడా...

జగన్ అహానికి ప్రజల పరిహారం పోలవరం !

పోలవరం ప్రాజెక్ట్ అనేది ఏపీ జీవనాడి. కేంద్రం వంద శాతం నిధులతో నిర్మించుకోమని జాతీయ హోదా ఇస్తే కళ్లు మూసుకుని నిర్మాణాలు పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును జగన్ రెడ్డి తన అహానికి...

ఆ 30 ఫీట్ ఇనుప కచ్చడాలు కూడా ప్రజల సొమ్మే !

తాడేపల్లిలోని జగన్ ఇల్లు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుది.. రెండు ఎకరాల చుట్టూ 30 అడుగుల ఎత్తున ఇనుప కచ్చడాలు కూడా ప్రజల సొమ్మే. వ్యూ కట్టర్స్ పేరుతో...

ప్రైవేట్ సైన్యం…జగన్ కు ఎందుకంత భయం..!!

వైసీపీ అధినేత జగన్ రెడ్డి భారీగా ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారు. తాడేపల్లిలోని జగన్ నివాసం చుట్టూ 30మందితో కొత్తగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇంత పెద్దమొత్తంలో ఆయన ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకోవడం హాట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close