చైతన్య: దేశంలో ఫెడరల్ స్ఫూర్తి మోడీ పాలైంది..!

కేంద్ర, రాష్ట్రాల మధ్య యుద్ధమా..?

కోల్‌కతాలోని సీబీఐ ఆఫీసు చుట్టూ.. పోలీసులు మోహరించారు. పోలీస్ కమిషనర్ని అరెస్ట్ చేయడానికి వచ్చిన 40 మంది సీబీఐ అధికారుల్ని అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ వైపు నుంచి.. ఎలాంటి కవ్వింపు చర్య జరిగినా… పోలీస్ యాక్షన్‌కు రంగం సిద్ధమైంది..!

గంట తర్వాత కేంద్ర రక్షణ బలగాలు.. రంగంలోకి దిగాయి. సీఆర్పీఎఫ్ వంటి దళాలకు చెందిన వారు కోల్‌కతాలోని సీబీఐ ఆఫీసుకి అత్యవసరంగా వచ్చారు. పోలీసులపై చర్యకు సిద్ధమయ్యారు. కానీ పరిస్థితి అంత వరకూ దిగజారలేదు..

అంటే.. ఓ రాష్ట్రంలో.. ఓ రాష్ట్ర పోలీసు అధికారులకు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన బలగాలకు మధ్య దాదాపుగా యుద్ధం ప్రారంభమైనంత పని అయిందన్నమాట. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది..? కేంద్ర, రాష్ట్రాలు శత్రువులుగా తలపడాల్సినంత దుస్థితిని ఎవరు తీసుకొచ్చారు..? ఇది దేశానికి ఎంత నష్టం చేస్తుందో వారికి తెలుసా..?.

మోడీ మార్క్ ఫెడరల్ స్ఫూర్తి ఇదేనా..?

కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా అస్థిత్వం లేదు. రాష్ట్రాల సమూహమే కేంద్రం. అలా రాష్ట్రాల మీద ఆధారపడి నడుస్తున్న కేంద్రం.. ఆ రాష్ట్రాల అధికారాలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకోవడానికి.. చేయాల్సిన పనులన్నీ చేస్తోంది. ఆర్థికంగా .. తను విదిలిస్తే మాత్రమే.. రాష్ట్రాలకు అందేలా నిబంధనలు మార్చుకోవడం దగ్గర్నుంచి.. ఇష్టం లేని.. ప్రభుత్వాలు ఉన్న చోట.. దర్యాప్తు సంస్థలతో అలజడి రేపడం వరకూ.. ఎన్నో చర్యలను కేంద్రం చేపడుతోంది. రాజకీయంగా ఏం చేసినా.. అది చెల్లుబాటు అవుతుంది. కానీ.. రాజకీయం కోసం.. దర్యాప్తు సంస్థల్ని.. అత్యంత దారుణంగా ఉపయోగించుకోవడం.. వారిని ఇబ్బందులు పెట్టడం… అంటే.. అది కచ్చితంగా ఫెడరల్ స్ఫూర్తిపై దాడే..! కేంద్రం.. బాధ్యత దేశాన్ని కలిపి ఉంచడం..! కానీ ఇప్పటి ప్రభుత్వం రాజకీయం కోసం విడదీస్తోంది..!

ఓ ఉన్నతాధికారి పట్ల సీబీఐ ప్రవర్తించే తీరు అదేనా..?

పోలీస్ కమిషనర్ని.. మాఫియా గ్యాంగ్ లీడర్నీ అరెస్ట్ చేసినట్లు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడం ఏమిటి..? యభై మంది సీబీఐ అధికారులు… కోల్‌కతా పోలీస్ కమిషనర్ ఇంటి ముందు హంగామా చేశారు. ఆయనను అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని.. అదీ కూడా.. ఎలాంటి నోటీసులు లేకుండా… అరెస్ట్ చేయడానికి వెళ్లడం దేనికి సంకేతం.. ? . సామాన్యుల్ని కూడా అరెస్ట్ చేయడానికి వెళ్లేటప్పుడు ఓ ప్రాసెస్ ఉంటుంది. ప్రశ్నించడానికి ప్రాసెస్ ఉంటుంది. కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ వాటన్నింటికీ ఎందుకు అతీతమయ్యాడో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆయన ఏ నోటీసులకు స్పందించకపోతే.. కోర్టు ఉండనే ఉంది కదా..!?. ఇంత రచ్చ అయిన తర్వాత ఇప్పుడు కోర్టుకెళ్తామని.. సీబీఐ తీరిగ్గా చెప్పడం.. ఏమిటి..?

కచ్చితంగా ఎమర్జెన్సీనే..!

రాష్ట్రాలపై .. కేంద్రం చేస్తున్న దాడే ఇది. బీజేపీకి సన్నిహితంగా ఉండే పార్టీల వాళ్లు ఒక్కరూ మాట్లాడలేదు.. మాట్లాడరు. ఎందుకంటే.. అలా మాట్లాడితే.. ఇలాంటి పరిస్థితులు తమకు వస్తాయనేది వారి భయం. కానీ.. బీజేపీని వ్యతిరేకిస్తున్న వారంతా ముక్త కంఠంతో ఖండించారు. దేవేగౌడ… ఎమర్జెన్సీతో పోల్చారు. అందరూ .. ఫెడరల్ స్ఫూర్తిని మంటగలుపుతున్నారని అన్నారు. ఈ అభిప్రాయాలకు సంపూర్ణ సమర్థన లభిస్తుంది. దేశాన్ని కలిపి ఉంచాల్సిన కేంద్రం… రాజకీయం కోసం విడదీసే ప్రయత్నం చేయడం .. ఇప్పుడు చూస్తున్నాం. అందులో ఎలాంటి సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెగా ఫ్యామిలీలో రచ్చ…అల్లు అర్జున్ పై నాగబాబు సీరియస్..!?

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారం చేయడంపై ఇంకా తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే ఆయన పర్యటన...

వ‌ర‌ల్డ్ క‌ప్ ముందు ఇది అవ‌స‌ర‌మా అధ్య‌క్షా..?!

ఏ ఆటైనా మైదానంలో జ‌ట్టు స‌భ్యులంతా స‌మ‌ష్టిగా ఆడితేనే అందం, విజ‌యం. ఒక‌రిపై మ‌రొక‌రు క‌స్సుబుస్సులాడుతుంటే, క‌య్యానికి కాలుదువ్వుతుంటే, అస‌లు జ‌ట్టు స‌భ్యుల మ‌ధ్య స‌యోధ్య లేక‌పోతే - ప్ర‌త్య‌ర్థుల‌పై ఎలా త‌ల‌ప‌డ‌తారు?...

విజ‌య్ స‌ర‌స‌న సాయి ప‌ల్ల‌వి?

టాలీవుడ్ లో ఓ కొత్త కాంబోకి తెర లేవ‌నుందా? విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సాయి ప‌ల్ల‌వి క‌లిసి న‌టించ‌బోతున్నారా? ఆ అవ‌కాశాలు ఉన్నట్టే క‌నిపిస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా దిల్ రాజు బ్యాన‌ర్‌లో...

విశ్వసనీయత కోల్పోతున్న కేసీఆర్…?

అనేక ఆటుపోట్లను ఎదుర్కొని రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తెలంగాణలో బీఆర్ఎస్ ను తిరుగులేని శక్తిగా నిలిపిన కేసీఆర్ ప్రస్తుతం రాజకీయాల్లో విశ్వసనీయత కోల్పోతున్నారా..?ఇందుకు కారణం ఆయన వరుసగా చేస్తోన్న వ్యాఖ్యలేనా..? అంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close