రూ. ఐదున్నర లక్షల కోట్లిచ్చాం.. ఇంకేం కావాలంటున్న అమిత్ షా ..‍!

రూ. పది వేల కోట్ల లోటు భర్తీ, రూ. ఐదు, పదివేల కోట్ల ప్రాజెక్టుల గురించి ఏపీలో ఉద్యమాలు చేస్తున్నాయి కానీ.. భారతీయ జనతా పార్టీ అంత కంటే ఎక్కువే.. ఎక్కువ.. అంటీ మరీ.. మరీ ఎక్కువ ఏపీకి ఇచ్చింది. ఈ ఎక్కువ.. ఎంత మొత్తం అనే లెక్కల్లో చెప్పుకోవాలంటే.. రూ.5,56,985 కోట్లు. అంటే.. అక్షరాలా ఐదు లక్షల యాభై ఆరు వేల 985 కోట్ల రూపాయలు. నమ్మలేకపోతున్నారా..? ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షులం వారు.. ఒడిషా మీదుగా ఏపీకి వేంచేసి.. విజయనగరంలో చేసిన ప్రకటన ఇది. ఇక ఇస్తారా లేదా.. అన్న ప్రకటనలు అవసరం లేదు.. ఇచ్చేశారనే ఆయన చెబుతున్నారు. దేశమంతా ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్న మోడీ, షా ఏపీలోనూ తిరగాలనుకుంటున్నారు. ముందుగా… బీజేపీ నేతల బస్సు యాత్ర ప్రారంభించేందుకు ఆయన ఏపీకి వచ్చారు.

ముందుగా విజయనగరంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలను సీఎం తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
ఏ ఏ అంశాలపై తప్పుదోవ పట్టిస్తున్నారన్నది తర్వాత చెబుతానని తప్పించుకున్నారు. చంద్రబాబు యూటర్న్‌ ముఖ్యమంత్రేనని చంద్రబాబు గురించి నాకంటే ఏపీ ప్రజలకు ఎక్కువ తెలుసని .. చెప్పుకొచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్‌తో జత కట్టారని .. తెలంగాణలో ఓడిపోయాక ఫ్రంట్‌ అంటున్నారని విమర్శించారు. 2019 ఎన్నికల తర్వాత కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వం వస్తుందని .. అప్పుడు మళ్లీ చంద్రబాబు ఎన్డీయేవైపు వచ్చేందుకు ప్రయత్నిస్తారు .. కాని తాము రానివ్వబోమని.. ప్రకటించేశారు. రాష్ట్ర విభజన చట్టంలో 14 అంశాల్లో 10 అమలు చేశామని వివరించారు.

విజయనగరం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో బహిరంగసభకు వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం సభలో ప్రసంగించి బస్సుయాత్రను ప్రారంభించాల్సి ఉంది. కానీ.. పట్టుమని వంద మంది కూడా సభా ప్రాంగణంలో లేకపోవడంతో..నేరుగా బస్సుయాత్ర ప్రారంభించడానికి వెళ్లిపోయారు. అక్కడ బస్సు చుట్టూ గుమికూడిన ఓ రెండు వందల మందిని ఉద్దేశించి ప్రసంగించారు. టీడీపీ, వైసీపీ కుటుంబ పార్టీలని అమిత్‌షా విమర్శించారు. టీడీపీ, వైసీపీ అవినీతిలో కూరుకుపోయాయన్నారు. బీజేపీతోనే అవినీతి రహిత పాలన సాధ్యని ఆయన చెప్పుకొచ్చారు. పలాసలో అమిత్‌ షా పర్యటనకు వ్యతిరేకంగా టీడీపీ ఆందోళన చేశారు. అమిత్‌ షా గో బ్యాక్‌ అంటూ టీడీపీ కార్యకర్తల నినాదాలు చేశారు. ఎమ్మెల్యే శివాజీ, పలువురు టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు తీసుకున్నారు. అమిత్ షా సభకు, బస్సు యాత్ర ప్రారంభానికి వచ్చిన వారికంటే.. నిరసన వ్యక్తం చేయడానికి వచ్చిన టీడీపీ కార్యకర్తలే ఎక్కువగా ఉండటంతో.. అమిత్ షా కు అనవసరంగా ప్రాధాన్యం ఇచ్చామని.. టీడీపీ నేతలు ఊసురుమన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటేస్తున్నారా ? : కోర్టు ధిక్కరణల పాలన గుర్తుకు తెచ్చుకోండి!

రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం ఏర్పడుతుంది. మరి ఆ రాజ్యాంగాన్ని అమలు చేయకపోతే ఆ ప్రభుత్వం ఎందుకు ?. గతంలో ఒక్క కేసులో కోర్టు ఏదైనా వ్యాఖ్యలు చేస్తే ప్రభుత్వం రాజీనామా...

రాజేష్ మహాసేనను సస్పెండ్ చేసిన టీడీపీ

రాజేష్ మహాసేనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీడీపీ అధిష్టానం. గన్నవరంలో జనసేన అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో అప్రమత్తమైన టీడీపీ హైకమాండ్ రాజేష్ ను పార్టీ...

ఓటర్ల జాబితాలో డబ్బుల జమకు హైకోర్టు పర్మిషన్

అనేక రకాల కుట్రల విషయంలో వైసీపీ పెద్దల ప్లానింగ్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. చేయాలనుకున్నది చేసేయడానికి నాలుగు మార్గాలను ఎంచుకుంటారు. అందులో ఒక దాని ద్వారా...

ఎడిటర్స్ కామెంట్ : బై .. బై .. !

" టెన్షన్ లో నీకేమీ తెలియడం లేదు కానీ బుల్లెట్ ఎప్పుడో దిగిపోయింది " అని ఓ సినిమాలో హీరో విలన్ గ్రూపులో సభ్యుడితో అంటాడు. అంటే టెన్షన్ లో ఉన్నప్పుడు.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close