మా ఇష్టం : ఎవరక్కడ… “ఒకటి తక్కువ వంద శాతం” టీవీని తెచ్చి పెట్టండిక్కడ..!

ఇష్టం లేనోడ్ని ఇంకెవడో పొగడితే.. మనకు కడుపు మండదా..? కచ్చితంగా మండుతుంది. ఆ పొగిడినోడు ఎవరైతే ఏంటి..? ఇష్టం లేని వాడ్ని పొగిడారు కాబట్టి.. వాడ్ని చెడామడా తిట్టాల్సిందే..!. తిట్టి కాస్త కడుపుమంట చల్లార్చుకోవాల్సిందే…!.. లేకపోతే వ్యూస్ రావడం కష్టం. అదే నేటి ” మా ఇష్టం..”

లోకేష్‌కు పొగిడితే ఇక్కడెందుకు కాలింది..!?

లోకేష్ అనే ఓ ఏపీ రాష్ట్ర మంత్రి ఉన్నాడు. ఏబీఎన్ అనే ఓ చానల్ కూడా ఉంది. లోకేష్ … దావోస్ వెళ్లి ఏం చేశాడో… ఆ చానల్ రిపోర్టర్ రాశాడు. సిబ్బంది ఎడిట్ చేశారు. అంతిమంగా ప్రసారం అయింది. అందులో ఏముంది…? లోకేష్‌ గొప్పగా పని చేస్తున్నాడని… కాస్త “అతి” పదాలు ఉపయోగించి స్క్రిప్టింగ్ చేశారు. ఇది ఆయనకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. అసలు లోకేష్‌ను అలా పొగడటం ఏమిటి.. అని ఆయన చెలరేగిపోయారు. దానితో ఆగిపోలేదు.. అసలు ఏపీ స్పెషల్ స్టేటస్ వరకూ వెళ్లిపోయారు. ఏపీ అభివృద్ధి పథంలో ఉంది కాబట్టి.. ఇక స్పెషల్ స్టేటస్ ఎందుకు అడుగుతున్నారని.. ఆయన అంతిమంగా తీర్మానించారు. అయితే మొత్తంగా… లోకేష్‌ను పొగిడినందుకే.. ఆ టీవీ చానల్‌పై.. చెలరేగిపోయారు.

ఇష్టం లేనిది ఏబీఎన్‌నా..? లోకేషా..?

ఎవరైనా… రాజకీయ నాయకులు లేదా… ప్రముఖులు.. తమపై బురదజల్లితే.. లేదా.. నెగెటివ్ కథనాలు వేస్తే..స్పందిస్తారు. అది సహజం. వాళ్లెవరో.. వేరేవర్నో పొగిడితే… మాత్రం.. స్పందించడం ఉండదు. ఎందుకంటే..అది సంబంధం లేని వ్యవహారం అవుతుంది. కానీ.. ఇప్పుడేం జరుగుతోంది. అంతా “నా ఇష్టం” ..కాబట్టి.. ఇష్టం లేనోళ్లు.. గొడవలు పెట్టుకున్నోళ్లు.. గొడవలు పడినవాళ్లు.. తమకు … అడ్డం వస్తారనుకునేవాళ్లు ఎవరిని పొగడినా కూడా… అలా పొగడటం తప్పు అని.. కాస్త వెకిలి పద్దతిలో చెప్పడం.. ప్రారంభించారు. ఇదో కొత్త పరిణామం. నన్న విమర్శిస్తే నేను స్పందిచడం.. ఇప్పటి వరకూ ఉన్న పద్దతి.. ఇష్టం లేనోడ్ని పొగిడితే.. చెలరేగిపోవడం.. తాజా ట్రెండ్.

99శాతం టీవీలో వచ్చే పొగడ్తలు ఇంపుగా ఉన్నాయా..?

సరే పొగడ్తలే ఇష్టం లేదనుకుందాం..! మరి మిగతా చానల్స్‌లో వస్తున్నదేమిటి..?. “వందకు ఒక్క శాతం టీవీ”ని చూస్తే… మా ఇష్టం అనుకునే బాపతు మనుషులు లెక్కకు మిక్కిలిగా ఉంటారు. లోకేష్‌పై ఏబీఎన్ ఓ పాజిటివ్ వార్త మాత్రమే వేసింది. కానీ.. 99 శాతం టీవీ ఏం చేస్తుంది..? ఆ పొగడ్తులు చరిత్ర సృష్టించేవి కావా..? అవేమీ.. మరి మన కళ్లకు కనిపించవా..? బంధుప్రీతితో కళ్లు మూసుకుపోయాయా..?. ఏదైనా చేయాలనుకున్నప్పుడు.. అందులో నిజాయితీ కనిపించాలి..! తప్పులన్నీ పక్కోళ్లలో మాత్రమే వెదకేవాళ్లను.. వేరే అర్థంలో చెబుతారు…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close