ఓట‌మిపై టి.కాంగ్రెస్ నేత‌ల‌తో రాహుల్ చ‌ర్చ‌..!

పార్ల‌మెంటు ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టంతో తెలంగాణ‌పై మ‌రోసారి దృష్టి సారించింది కాంగ్రెస్ హైక‌మాండ్‌. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి ఎదుర్కొన్న త‌రువాత‌, కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కొర‌వ‌డిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే రాష్ట్రంలో జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్ని టి. కాంగ్రెస్ ప‌ట్టించుకోలేదు. అసెంబ్లీ ఎన్నిక‌ల వైఫ‌ల్యాల‌పై కూడా స‌మ‌గ్ర‌మైన చ‌ర్చ ఇంత‌వ‌ర‌కూ పార్టీలో జ‌ర‌గ‌లేద‌నే చెప్పాలి. అయితే, ఈ అంశాన్నీ మంగ‌ళ‌వారం ఢిల్లీలో అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో చ‌ర్చ‌కు వ‌చ్చాయి. తెలంగాణ కాంగ్రెస్ నేత‌లంతా రాహుల్ తో భేటీ అయ్యారు. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పొత్తులు, అనుస‌రించాల్సిన ప్ర‌చార వ్యూహంతోపాటు, అసెంబ్లీ ఎన్నిక‌ల వైఫ‌ల్యంపై కూడా చ‌ర్చ జ‌రిగిన‌ట్టు స‌మాచారం.

రాష్ట్ర పార్టీని ప్ర‌క్షాళ‌న చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని రాహుల్ తో ఎల్బీ న‌గర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పారు. తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవ‌డం వ‌ల్ల‌నే న‌ష్ట‌పోయామ‌ని పొంగులేటి చెప్పిన‌ట్టు స‌మాచారం. అమేథీతోపాటు ఖ‌మ్మం నుంచి కూడా ఎంపీగా రాహుల్ ని పోటీ చేయాల‌ని పొంగులేటి కోరారు. అయితే, దానిపై చూద్దాం అని మాత్ర‌మే రాహుల్ స్పందించిన‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ‌లో ఓట‌మికి కార‌ణం కేసీఆర్ అమ‌లు చేసిన ప‌థ‌కాలే అంటూ కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి చెప్పిన‌ట్టు స‌మాచారం. సీట్ల కేటాయింపు వ్య‌వ‌హారం ఆల‌స్యం కావ‌డంతో ప్ర‌చారానికి స‌రైన స‌మ‌యం లేకుండా పోవ‌డం కూడా ఓట‌మికి కార‌ణ‌మ‌నే అభిప్రాయం ఈ చ‌ర్చ‌లో టీ నేత‌లు వ్య‌క్తీక‌రించిన‌ట్టు తెలుస్తోంది.

గ‌త ఎన్నిక‌ల్లో ఎదురైన ఇబ్బందుల్ని అధిగ‌మించి, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పోరాటం చేస్తామ‌ని రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జ్ కుంతియా చెప్పారు. దీనికి సంబంధించిన వ్యూహాల‌పై కూడా చర్చించామంటూ ఆయ‌న అన్నారు. పొత్తుల విష‌యానికి వ‌చ్చేస‌రికి… రాష్ట్ర స్థాయిల్లో ఒక‌లా, జాతీయ స్థాయిలో మ‌రోలా ఉంటాయ‌ని కుంతియా చెప్పారు. అయితే, తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పొత్తులు ఎలా ఉంటాయ‌నేది ఇంకా కాంగ్రెస్ అధిష్టానానికే స్ప‌ష్ట‌త రాన‌ట్టుగా ఉంది. ఆంధ్రా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ది ఒంట‌రి పోరాట‌మ‌ని స్ప‌ష్ట‌మైపోయింది. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ‌లో టీడీపీతో క‌లిసి వెళ్లే ప‌రిస్థితులు ప్ర‌స్తుతానికి లేవు. అలాగ‌ని, జాతీయ రాజ‌కీయాల‌కు వ‌చ్చేస‌రికి… భాజ‌పాయేత‌ర ప‌క్షాల్లో భాగంగా టీడీపీతో క‌లిసి ప‌నిచెయ్యాలి. అంటే, లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పొత్తుల ఉంటే ఎలా ఉంటాయి, లేకపోతే ఏంటనేది కాంగ్రెస్ ఇంకా స్ప‌ష్టంగా చెప్పాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close