ఇది విన్నారా: బోయ‌పాటి ఇంకా ‘హిట్టే’ అంటున్నాడ‌ట‌

‘విన‌య విధేయ రామ‌’ పంచాయితీ ఇంకా న‌లుగుతూనే ఉంది. బోయ‌పాటి నుంచి 5 కోట్లు తిరిగి రాబ‌ట్ట‌డానికి డి.వి.వి దాన‌య్య పెద్ద యుద్ధ‌మే చేస్తున్నాడు. దానికి త‌గ్గ‌ట్టుగానే బోయ‌పాటి కూడా ప‌ట్టుద‌ల ప్ర‌ద‌ర్శిస్తున్నాడు. పారితోషికంలో రూ.5 కోట్లు వెన‌క్కి ఎందుకు ఇవ్వాలో దాన‌య్య కార‌ణాలు చెబుతుంటే, ఎందుకు ఇవ్వ‌కూడ‌ద‌ను అనడానికి బోయ‌పాటి కూడా గ‌ట్టి కార‌ణాలే వెదుకుతున్నాడు.

అసలింత‌కీ ‘విన‌య విధేయ రామ‌’ అనేది ఫ్లాప్ కాద‌ని, అది హిట్టు సినిమా అని బోయ‌పాటి వితండ‌వాదం చేయ‌డం ఈ పంచాయితికి వ‌చ్చిన పెద్ద‌ల్ని సైతం విస్మ‌య‌ప‌రుస్తోంది. ”నేను హిట్టు సినిమానే తీశాను. వ‌సూళ్లు బాగా వ‌చ్చాయి. కావాల‌ని మా సినిమా ఫ్లాప్ అయ్యింద‌ని ప్ర‌చారం చేస్తున్నారు” అని వాదిస్తున్నాడ‌ట బోయపాటి. అస‌లు త‌న‌ని అడ‌క్కుండా చ‌ర‌ణ్ అభిమానుల‌కు ఉత్త‌రం ఎలా రాస్తాడు? అది న‌న్ను అగౌర‌వ‌ప‌రిచిన‌ట్టు కాదా? అని ఎదురు ప్ర‌శ్నిస్తున్నాడ‌ని స‌మాచారం. ఓ సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన ద‌ర్శ‌కుడు డ‌బ్బులు తిరిగి ఇవ్వాల‌ని ఏ చ‌ట్టంలో ఉంద‌న్న‌ది బోయ‌పాటి లాజిక్కు. ఇది వ‌ర‌కు దాన‌య్య తీసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయ‌ని, ఆయా ద‌ర్శ‌కులంతా డ‌బ్బులు వెన‌క్కి ఇవ్వ‌లేద‌ని గుర్తు చేస్తున్నాడ‌ట‌.

అయితే.. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం కేవ‌లం 5 కోట్ల‌తో ముడిప‌డి ఉన్న‌ది కాదు. ఇది ‘ఈగో’ స‌మ‌స్య‌గా మారింది. బోయ‌పాటి నుంచి డ‌బ్బులు తిరిగి రాబ‌ట్టాల్సిందే అని దాన‌య్య‌, ఇవ్వ‌కూడ‌ద‌ని బోయ‌పాటి గ‌ట్టిగా ప‌ట్టుక్కూర్చున్నారు. ఎవ‌రు త‌గ్గినా.. ప‌రువు పోతుంద‌ని భ‌య‌ప‌డుతున్నారు. అందుకే… ఈ స‌మ‌స్య మ‌రింత జ‌టిలంగా మారింది. పెద్ద మ‌నుషులుగా కూర్చున్న వాళ్లు సైతం `ఈ గొడ‌వ మేం తేల్చ‌లేం.. మీరో మీరు ఓ నిర్ణ‌యానికి రండి` అంటున్నార్ట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close