ట్విస్ట్‌: మ‌హేష్‌కి సుక్కు క‌థ చెప్పేశాడు.. కానీ…

మ‌హేష్‌బాబు – సుకుమార్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా ప్లాన్ చేసింది మైత్రీ మూవీస్‌. ‘మ‌హ‌ర్షి’ త‌ర‌వాత మ‌హేష్ చేయ‌బోయే సినిమా ఇదే అని ప్ర‌చారం జ‌రిగింది. అయితే… ఇప్పుడు ఈ సినిమాని దాదాపుగా ప‌క్క‌న పెట్టేసిన‌ట్టు టాక్‌. అందుకు కార‌ణ‌మేంట‌ని ఆరా తీస్తే.. సుకుమార్ ఇంకా క‌థ సిద్ధం చేయ‌లేద‌ని, అది త‌యార‌వ్వ‌డానికి చాలా టైమ్ ప‌డుతుంద‌ని చెబుతున్నారు.

అయితే అస‌లు కార‌ణం ఇదేం కాదు. సుకుమార్ మ‌హేష్‌కి ఎప్పుడో క‌థ చెప్పేశాడు. అదీ సింగిల్ లైన్ వినిపించ‌డం కాదు, సీన్ బై సీన్ క‌థ చెప్పాడు. కానీ సుకుమార్ చెప్పిన క‌థ మ‌హేష్‌ని సంతృప్తి ప‌ర‌చ‌లేద‌ని టాక్‌. ‘కొత్త‌గా ఉంది కానీ.. ఏదో మిస్స‌య్యింది’ అన్న‌ది మ‌హేష్ ఫీలింగ్‌. త‌న‌కు ఎలాంటి క‌థ కావాలో కూడా సుకుమార్‌కి సూచించాడ‌ట‌. అలాంటి క‌థ త‌యారు చేయ‌డానికి ఇంకాస్త స‌మ‌యం కావాలి అని సుకుమార్ మ‌హేష్‌ని అడిగిన‌ట్టు తెలుస్తోంది. అందుకే… ఈ సినిమా ప్ర‌స్తుతానికి ప‌క్క‌న పెట్టిన‌ట్టు స‌మాచారం అందుతోంది. సుకుమార్ మ‌హేష్ కోసం త‌యారు చేసిన క‌థ‌ని మ‌రొక‌రితో తీస్తాడా? లేదంటే ఆ క‌థ‌ని పూర్తిగా ప‌క్క‌న పెట్టేస్తాడా? అనేది ఆస‌క్తిగా మారింది. సుకుమార్ త‌ప్పుకోవ‌డంతో… అనిల్ రావిపూడికి మార్గం సుగ‌మం అయ్యింది. ‘ఎఫ్ 2’ విజ‌యంతో టాప్ లీగ్‌లోకి చేరిపోయాడు అనిల్‌. మ‌హేష్‌తో సినిమా చేస్తే గ‌నుక‌… త‌న పంట పండిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close