అఖిల్ కోసం.. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌..?

గీతా ఆర్ట్స్‌లో అఖిల్ ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. అఖిల్ కోసం ప‌ర‌శురామ్ ఓ క‌థ సిద్ధం చేస్తున్నార‌ని చెప్పుకుంటున్నారు. `గీత గోవిందం`తో సూప‌ర్ ఫామ్‌లోకి వ‌చ్చేశాడు ప‌ర‌శురామ్‌. త‌నైతే అఖిల్ కెరీర్‌ని ఓ గాడిన పెట్టొచ్చ‌నిపిస్తోంది. కాక‌పోతే… అఖిల్ కోసం క‌థ సిద్ధం చేస్తోంది ప‌ర‌శురామ్ కాద‌ని, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ అని తేలింది. భాస్క‌ర్ ఎప్ప‌టి నుంచో గీతా ఆర్ట్స్ చుట్టూనే తిరుగుతున్నాడు. నాలుగైదు క‌థ‌లు సిద్ధం చేసుకున్న భాస్క‌ర్‌కి హీరో దొర‌క‌డం లేదు. అయినా ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నాడు. ఎట్ట‌కేల‌కు అఖిల్‌ని సెట్ చేశార‌ని స‌మాచారం. `బొమ్మ‌రిల్లు` త‌ర‌వాత ఆ స్థాయి విజ‌యాన్ని చ‌విచూడ‌లేక‌పోయాడు భాస్క‌ర్‌. ప‌రుగు ఓకే అనిపిస్తే ఆరెంజ్ ఫ్లాప్ లిస్టులో చేరింది. ఒంగోలు గిత్త డిజాస్ట‌ర్ అనిపించుకుంది. అప్ప‌టి నుంచీ భాస్క‌ర్ మీడియా ముందుకు కూడా రాలేదు. అలాంటి భాస్క‌ర్‌కి వెన్నెద‌న్నుగా నిలిచింది గీతా ఆర్ట్స్‌. మ‌రి వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న భాస్క‌ర్‌.. త‌న‌లానే ప‌రాజ‌యాల‌తో కొట్టుమిట్టాడుతున్న అఖిల్‌కి ఓ హిట్టు ఇవ్వ‌గ‌ల‌డా?? అన్న‌దే మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బేలగా మోదీ ప్రచారం – ఏం జరుగుతోంది ?

నరేంద్రమోడీ ఎప్పుడైనా దూకుడుగా ప్రచారం చేస్తారు. ప్రత్యర్థుల్ని ఇరుకున పెడతారు. తనను చాయ్ వాలా అంటే చాయ్ పే చర్చ అని కార్యక్రమం పెట్టి అందర్నీ ఆకట్టుకుంటారు. ఇటీవల తనను...

అబద్దాల ప్రభుత్వం – అమల్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రెస్ మీట్ పెట్టి అదే చెబుతున్నారు. కోర్టుల్లో తీర్పులు వచ్చిన తర్వాతనే అమలు చేస్తామని...

ఓటేస్తున్నారా ? : ఒక్క సారి మద్యం దుకాణాల వైపు చూడండి !

అనగనగరా ఓ ఊరు. ఆ ఊరిలో ఓ పాలకుడు. అక్కడ అతను చెప్పిందే కొనాలి. అతను చెప్పిందే తాగాలి . అంతా అతని దుకాణాలే ఉంటాయి. ఆ దుకాణాల్లో అమ్మేవి తాగి చచ్చిపోతే...

కోవిషీల్డ్ …డేంజరేనా..?

కరోనా విజృంభణ సమయంలో ప్రాణాలు కాపాడుతాయని నమ్మి వేసుకున్న వ్యాక్సిన్లు ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతున్నాయి. వ్యాక్సిన్ లో లోపాలు ఉన్నాయని వ్యాక్సిన్ వేసుకున్న పలువురు చెప్తూ వచ్చినా మొదట్లో కొట్టిపారేసిన బ్రిటన్ ఫార్మా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close