మార్చి రెండోవారంలో వర్మ ఎన్టీఆర్…

ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాతో థియేటర్లలో తన సినిమా `లక్ష్మీస్ ఎన్టీఆర్` ట్రైలర్ ప్రదర్శించేలా ఏర్పాట్లు చేసిన రామ్ గోపాల్ వర్మ, మహానాయకుడు వచ్చిన వెంటనే థియేటర్లలోకి వచ్చే సాహసం చేయలేకపోతున్నాడు. పబ్లిసిటీ కోసం కవ్వింపు చర్యలకు దిగుతున్న వర్మ, మహానాయకుడితో పోటీకి ససేమిరా అంటున్నాడు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తరవాత ఏం జరిగిందనే కథతో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం `లక్ష్మీస్ ఎన్టీఆర్`. మార్చి రెండో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తానని ఓ టీవీ చర్చావేదికలో వర్మ తెలిపాడు. ట్రయిలర్ వివాదాలకు కారణమయ్యేలా వుండటంతో సినిమాకు కావలసినంత ప్రచారం దొరుకుతోంది. ట్రయిలర్లు హడావుడి చేయడం మినహా వర్మ తీసిన సినిమాలు థియేటర్లలో హడావుడి చేసి సంవత్సరాలు గడుస్తున్నాయి. ఈ సినిమా కూడా ఆ జాబితాలో చేరుతుందో? ఆడుతుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close