తోట త్రిమూర్తులును వైసీపీ కూడా వద్దనుకుంటోందా..?

రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఈ సారి తనతో పాటు.. తన కొడుకును కూడా ఎన్నికల బరిలో దించాలనుకుంటున్నారు. ఈ విషయంలో ఆయన జనసేనను పరిగణనలో తీసుకోవడం లేదు. టీడీపీ, వైసీపీ మధ్య బేరసారాలాడుతున్నారు. ఇప్పుడున్న పార్టీ టీడీపీ కాబట్టి… ఆ పార్టీని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. మరో వైపు.. వైసీపీతో.. సంప్రదింపులు జరుపుతున్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను హైదరాబాద్ లో కలవడం వెనుక… ఈ రాజకీయ వ్యూహం ఉందని చెబుతున్నారు. త్రిమూర్తులు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం సీటు తన కుమారుడికి ఇచ్చి….తనకు కాకినాడ రూరల్ టికెట్ ఇమ్మని అడుగుతున్నారు. అంతే కాక కాకినాడ లో ఒక ఖరీదైన వివాదాస్పద స్థలం విషయంలో ప్రభుత్వం తనకు అనుకూలంగా క్లియరెన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. చంద్రబాబు మాత్రం సిట్టింగ్ సీటు రామచంద్రపురం తప్ప.. ఇతర విషయాల్లో కనీసం మాట్లాడటానికి కూడా ఆసక్తి చూపించలేదు.

దాంతో ఆయన టీడీపీ హైకమాండ్‌పై ఒత్తిడి పెంచేందుకు రాజకీయ వ్యూహం అమలు చేస్తున్నారు. మరోవైపు వైసీపీతో లోపాయికారీగా చర్చలు జరుపుతున్నారు. వైసీపీలో కూడా తోట డిమాండ్లు నెరవేర్చే పరిస్థితి లేదు. ఆయన పార్టీలోకి వస్తే రామచంద్రపురం సీటు తప్ప వేరే ఏదీ ఇవ్వలేమని…కాదూ కూడదంటే…కాకినాడ రూరల్ సీటు గురించి ఆలోచిస్తామని …అంతే తప్ప రెండు సీట్లు ఇవ్వడం సాధ్య పడదని వైసీపీ అధిష్టానం త్రిమూర్తులుకు స్పష్టం చేసినట్టు వినిపిస్తోంది. అదే సమయంలో త్రిమూర్తులు పార్టీలో చేరితే.. చాలా కాలంగా.. పార్టీపై అసంతృప్తితో ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్… జగన్‌తో ఉంటారన్న గ్యారంటీ లేదు. రెండు మూడు రోజల్లో తన డిమాండ్లకు ఎక్కడ పరిష్కారం దొరుకుతుందో చూసుకుని త్రిమూర్తులు నిర్ణయం తీసుకుంటారని ఆయన ముఖ్య అనుచరులు అంటున్నారు.

అయితే తన రాజకీయ వ్యూహంలో తనే చిక్కుకుని.. ఏ పార్టీకి కాకుండా పోతారేమోనని ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు. హైకమాండ్ నమ్మకం కోల్పోతే… భవిష్యత్ రాజకీయాలు కష్టమని… వారి ఆందోళన. కానీ… ఒత్తిడి పెంచి.. తన డిమాండ్లు నెరవేర్చుకోవడంలో.. తోట త్రిమూర్తులది ప్రత్యేక శైలి. ఆయన రాజకీయం ఎటు వైపు మారుతుందో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close