టీడీపీలో శృతిమించుతున్న అసమ్మతి రాగాలు

ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ సమయంలో తెలుగుదేశం పార్టీలో అసమ్మతి రాగాలు శృతి మించుతున్నాయి. నిన్న మొన్న ఎమ్మెల్యే అనిత విషయంలో టీడీపీలో వచ్చిన నిరసన మరిచిపోకముందే ఈరోజు తాడేపల్లి గూడెం లో ముళ్ళపూడి బాపిరాజు పార్టీ మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

టీడీపీలో టికెట్ల పంచాయితీ అమరావతిలో కొనసాగుతోంది. పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత అభ్యర్థిత్వాన్ని టీడీపీ క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎమ్మెల్యే అనిత ఎస్సీ రిజర్వుడ్ సీట్ అయిన పాయకరావుపేటలో 2014లో ఎమ్మెల్యే గా గెలిచింది. వైఎస్ఆర్ సిపి నేత అయిన రోజా తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేసిన ప్రతిసారి తెలుగుదేశం పార్టీ నుండి దానికి ధీటుగా సమాధానం ఇస్తూ వచ్చింది. మంత్రి పదవి సైతం ఆశించినప్పటికీ ఆమె కల నెరవేరలేదు. అయితే పాయకరావుపేటలో ప్రైమరీ హెల్త్ సెంటర్ లో సరైన వసతులు సైతం లేవని, నియోజకవర్గం అభివృద్ధి కుంటుపడిందని ఆ మధ్య పవన్ కళ్యాణ్ పాయకరావుపేటలో పర్యటించినప్పుడు ఎమ్మెల్యే అనిత పై విమర్శనాస్త్రాలు గుప్పించారు. అయితే అప్పట్లో టీడీపీ నేత లు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించారు.

కానీ ఇప్పుడు అదే టీడీపీ నేతలు ఎమ్మెల్యే అనిత పై విరుచుకుపడుతున్నారు. ఆమె అవినీతి తారా స్థాయికి చేరుకుందని, ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, నాయకులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, ఆమెకు గనక మళ్లీ టికెట్ ఇస్తే టీడీపీ నేతలు ఆమెను ఘోరంగా ఓడిస్తారని నేరుగా అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కూడా అనిత అభ్యర్థిత్వాన్ని ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

ఇక తాడేపల్లి గూడెం లో కూడా ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోంది. తాడేపల్లిగూడెంలో బాపిరాజు ఎప్పటి నుండో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నారు. ఈ నియోజకవర్గాన్ని 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ బిజేపికి కి కేటాయించింది. బిజేపి తరపున అభ్యర్థిగా నిలబడి మాణిక్యాలరావు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు సైతం, ఆయనకు ముళ్లపూడి బాపిరాజు కు మధ్య కోల్డ్ వార్ కొనసాగింది. ఒకానొక సమయంలో ఆ కోల్డ్ వార్ కాస్తా బజారున పడటం, ఇద్దరూ పరస్పర సవాళ్లు విసురుకోవడం తెలిసిందే. జడ్పీ చైర్మన్ గా ఉన్న ముళ్లపూడి బాపిరాజు ఒకానొక సమయంలో మంత్రిగా ఉన్న మాణిక్యాలరావుని తీవ్ర ఇరకాటంలో పెట్టిన విషయం కూడా తెలిసిందే. ముఖ్యమంత్రి సైతం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఈ ఇద్దరు అప్పట్లో కలిగించారు. అయితే టీడీపీ బీజేపీ పొత్తు విడిపోయిన తర్వాత ఈసారి ఎమ్మెల్యే టికెట్ తనకే వస్తుందని ధీమా గా ఉన్న బాపిరాజుకు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం షాక్ ఇచ్చింది.

గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి, ఆ తర్వాత పార్టీ వీడి, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరిన ఈలి నాని కి ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేసింది. దీంతో ముళ్ళపూడి బాపిరాజు అధినాయకత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత 14 ఏళ్లుగా పార్టీలో ఉన్నానని, పార్టీ కోసం ఎంతో శ్రమించానని, పొత్తులో భాగంగా టికెట్లు వేరే పార్టీలకు వెళ్లినప్పుడు కూడా పార్టీని నమ్ముకొని ఉన్నానని, అయితే తీరా టికెట్ వస్తుందనుకున్న ఈ సమయంలో తనకు మొండి చేయి చూపడం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. గత రెండు మూడు రోజులుగా ఆయన తన క్యాడర్ తో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తన అనుచరుల మాట ప్రకారం తన తదుపరి కార్యాచరణ ఉంటుందని ఆయన సన్నిహితులతో అంటున్నారు.

ఎన్నికలు మరొక రెండు నెలల్లో ఉన్న ఈ సమయంలో టీడీపీ లో పెరుగుతున్న ఈ అసమ్మతి రాగాలు పార్టీ మీద ఏ రకంగా ప్రభావం చూపుతాయి అన్నది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close