ఢిల్లీ జుత్తు మ‌న చేతిలోకి రావాల‌న్న కేటీఆర్‌..!

ఢిల్లీ జుత్తు మ‌న చేతిలో ఉండాలంటే, కేంద్రాన్ని యాచించి కాదు… శాసించి తెలంగాణ‌కు నిధులు తెచ్చుకోవాలంటే కీలెరిగి వాత పెట్టాల‌న్నారు కేటీఆర్‌. జ‌హీరాబాద్ లో జ‌రిగిన స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ… లోక్ స‌భ ఎన్నిక‌ల్లో మ‌రోసారి తెలంగాణ స‌త్తా, పౌరుషాన్ని చూపాల‌న్నారు. 16 మంది ఎంపీల‌తో సీఎం కేసీఆర్ ఏం చేయ‌గ‌ల‌రంటూ కొంత‌మంది బీజేపీ నాయ‌కులు అంటున్నారనీ, ఇద్ద‌రే ఇద్ద‌రు ఎంపీల‌తో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మొన‌గాడు కేసీఆర్ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప‌ద‌హారు మందితో ఢిల్లీ మెడ‌లు వంచుతార‌న్నారు. కాంగ్రెస్ నాయ‌కులు మ‌ళ్లీ కొత్త‌గా స‌వాల్ చేస్తున్నార‌నీ, లోక్ స‌భ ఎన్నిక‌ల‌తో కేసీఆర్ కి సంబంధ‌మేంట‌ని అంటున్నార‌ని అన్నారు.

ఈ ఎన్నిక‌లు తెలంగాణ‌కు అత్యంత కీల‌క‌మ‌నీ, ప‌క్క‌నే ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పోల‌వ‌రం ప్రాజెక్టుకి జాతీయ హోదాను ప్రధాని మోడీ ఇచ్చార‌న్నారు. కానీ, తెలంగాణ‌లోని కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు అడిగితే కేంద్రం ఇవ్వ‌లేద‌న్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు వ‌ల్ల మా భూములు మునిగిపోతున్నా ఓర్చుకున్నామ‌నీ, ఖ‌మ్మం జిల్లాలో గిరిజ‌నులు మునుగుతున్నా రైతుల‌కు న్యాయం జ‌రుగుతోందని భావించామ‌న్నారు కేటీఆర్‌. పోల‌వ‌రం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వ‌డం అభ్యంత‌రం లేద‌నీ, కానీ తెలంగాణ‌కు కూడా న్యాయం చెయ్యాల‌న్నారు. 16 మంది ఎంపీలు పార్ల‌మెంటులో ఉంటే… కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు జాతీయ హోదా త‌న్నుకుంటూ వ‌స్తుంద‌న్నారు. ఢిల్లీ నుంచి హైద‌రాబాద్ కి వ‌చ్చి తెలంగాణ‌కు కేంద్రం నిధులు ఇచ్చి వెళ్లే ప‌రిస్థితి వ‌స్తుంద‌న్నారు. మోడీ గ్రాఫ్ ప‌డిపోయింద‌నీ, కాంగ్రెస్ కూడా పుంజుకునే ప‌రిస్థితి లేద‌న్నారు.

ఎన్నికలను తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎదుర్కొనే విధాన‌మే ఈ సంద‌ర్భంగా చ‌ర్చించాల్సిన అంశం! ఏదో ఒక బ‌ల‌మైన వ్య‌తిరేక‌త‌పై పోరాటం చేయాల‌నే పంథాలోనే ఎన్నిక‌ల‌న్ని ఫేస్ చేస్తున్నారు. గ‌డ‌చిన అసెంబ్లీ ఎన్నిక‌లే తీసుకుంటే… తెలంగాణ ఢిల్లీకి గులాం కావాలా, ఆంధ్రా నాయ‌క‌త్వం తెలంగాణ‌కు అవ‌స‌ర‌మా అంటూ ప్రచారం చేసి సెంటిమెంట్ తో ల‌బ్ధి పొందారు. ఇప్పుడు కూడా… ఢిల్లీ మెడ‌లు వంచాలి, జుత్తు ప‌ట్టుకోవాలి, ప‌ద‌హారు మంది ఎంపీల‌ను ఇస్తే ఢిల్లీపై కేసీఆర్ పెత్త‌నం చేస్తారు… ఒక ర‌క‌మైన ఎమోష‌న‌ల్ పంథాలోనే ఇప్పుడు కూడా ప్ర‌చారం సాగిస్తున్నారు కేటీఆర్‌. ఇద్దరు ఎంపీలతో ఉద్యమం సాగించడానికీ, పదహారు మందితో కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించడానికి ఉన్న పోలిక ఏంటి..? రాజకీయం వేరు, ఉద్యమం వేరు. ఇంకా ఉద్యమ పంథాలోనే రాజకీయం చేస్తోంది తెరాస. ఎన్నిక‌లంటే భావోద్వేగాల‌కు సంబంధించిన అంశంగా ప్రొజెక్టు చేస్తున్నారు. ఇక‌, త్వ‌ర‌లో సీఎం కేసీఆర్ కూడా ప్ర‌చారానికి దిగుతున్నారు. ఆయ‌న ప్ర‌చార స‌ర‌ళి మ‌రింత తీవ్రంగా ఉంటుంద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close