చెట్టుకింద ప్లీడ‌ర్‌గా సాయిధ‌ర‌మ్‌?

సాయిధ‌ర‌మ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `చిత్ర‌ల‌హ‌రి` ఈ వేస‌విలో విడుద‌ల కాబోతంది. ఆ త‌ర‌వాత‌.. మారుతితో జ‌ట్టు క‌ట్ట‌బోతున్నాడు. గీతా ఆర్ట్స్ నిర్మించే ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. లాయ‌ర్ అంటే… రామ్ జెఠ్మ‌లానీ టైపులో ఊహించుకోవొద్దు. ఇది జ‌స్ట్ చెట్టుకింద ప్లీడ‌ర్ టైపు పాత్ర. `అభిలాష‌`లో చిరంజీవి పాత్ర గుర్తింది క‌దా? ఆ టైపు త‌మాషా లాయ‌ర‌న్న‌మాట‌. మారుతి వినోదం పండించ‌డంలో దిట్ట‌. ఈసారి కామెడీకి బాగా స్కోప్ ఉన్న పాత్ర‌ల్ని సృష్టించాడ‌ని టాక్‌. ఈ సినిమా కోసం సాయిధ‌ర‌మ్ తేజ్ కాస్త ఒళ్లు త‌గ్గ‌బోతున్నాడ‌ట‌. చిత్ర‌ల‌హ‌రి టీజ‌ర్‌లో కాస్త లావుగానే క‌నిపిస్తున్నాడు తేజు. లాయ‌రు పాత్ర కోసం మాత్రం కాస్త బ‌రువు త‌గ్గాల్సివ‌స్తోంది. ప్ర‌స్తుతం స్క్రిప్టు ప‌నుల్లో బిజీగా ఉన్నాడు మారుతి. మ‌రోవైపు గీతా ఆర్ట్స్ క‌థానాయిక ఎంపిక‌పై దృష్టి సారించింది. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close