ఒకే రోజు నలుగురు ఎంపీ అభ్యర్థులకు వైసీపీ కండువాలు కప్పిన జగన్..!

నామినేషన్లకు ఒక్క రోజే ఉండటంతో.. చేరికలను పూర్తి చేసి.. అభ్యర్థుల జాబితాలను ఫైనల్ చేయాలన్న హడావుడిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. పార్టీలో చేర్చుకోవాల్సిన వారందర్నీ ఈవాళ చేర్చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వంగా గీత, నెల్లూరుకు చెందిన ఆదాల ప్రభాకర్ రెడ్డి, కర్నూలుకు చెందిన బుట్టా రేణుక, ప్రకాశం జిల్లాకు చెందిన మాగుంట శ్రీనివాసులరెడ్డిలు… వైసీపీలో చేరారు. అందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరంతా లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులే. తెలుగుదేశం పార్టీలో అసెంబ్లీ టిక్కెట్ ఖరారు చేసుకున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి… చివరి నిమిషాలో టీడీపీకి షాక్ ఇచ్చి.. చెప్పా పెట్టకుండా… హైదరాబాద్ వచ్చి జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు.

ఆయన నెల్లూరు లోక్‌సభకు పోటీ చేస్తారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి… ఒంగోలు నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారు. వంగా గీత కాకినాడ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారని.. వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. బుట్టా రేణుక.. తనకు పోటీ చేసే ఉద్దేశం లేదని చెబుతున్నారు కానీ.. కర్నూలు సీటు బీసీల సీటు అని పదే పదే నొక్కి చెప్పడంతో.. ఆమె ఉద్దేశం… అక్కడ్నుంచి మరోసారి పోటీ చేయాలనే అని వైసీపీ నేతలంటున్నారు. జగన్ టిక్కెట్ ప్రకటిస్తారో లేదో మాత్రం క్లారిటీ లేదు. టీడీపీ తనను మోసం చేసిందని బుట్టా రేణుక వ్యాఖ్యానించారు. టీడీపీలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. కర్నూలులో బీసీ సిట్టింగ్‌ సీట్లు ఓసీలకు ఇచ్చారని ఆరోపించారు. జగన్‌ను సీఎం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు.

వైసీపీలోకి తిరిగిరావడం ఆనందగా ఉందన్నారు. కోట్ల టీడీపీలో చేరుతున్నారని తెలిసినా పార్టీలోనే ఉన్నా.. అయినా తనను పిలిచి మాట్లాడలేదని బుట్టారేణుక ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ ఆశయాలు నెరవేరాలంటే జగన్‌ సీఎం కావాలని మాగుంట శ్రీనివాసుల రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఉదయం.. జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల జాబితాను.. ఇడుపులపాయలో విడుదల చేయనున్నారు. కొత్తగా పార్టీలో చేర్చుకున్న వారికి ఎంతమందికి అవకాశాలు వస్తాయో.. ఆదివారం ఉదయం తేలనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పట్టభద్రుల బైపోల్..ప్రధాన పార్టీలకు స్వతంత్ర అభ్యర్థుల బెడద..?

లోక్ సభ ఎన్నికలు ముగియడంతో తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికపైనే నెలకొంది. ఈ నెల 27న ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల స్థానానికి బైపోల్ జరగనున్న నేపథ్యంలో ఈ...

‘పుష్ష‌’పై ఫ‌హ‌ద్‌కు ఇంత చిన్న చూపా?

'పుష్ష' టీమ్ ని ఫ‌హ‌ద్ ఫాజ‌ల్ బాగా ఇబ్బంది పెడుతున్నాడు. త‌న డేట్లు ఇస్తే కానీ 'పుష్ష 2' షూటింగ్ పూర్త‌వ్వ‌దు. ఆయ‌నేమో డేట్లు ఇవ్వ‌డం లేదు. ఇది వ‌ర‌కే ఫ‌హ‌ద్ గంప‌గుత్త‌గా...

మెగా ఫ్యామిలీలో రచ్చ…అల్లు అర్జున్ పై నాగబాబు సీరియస్..!?

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారం చేయడంపై ఇంకా తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే ఆయన పర్యటన...

వ‌ర‌ల్డ్ క‌ప్ ముందు ఇది అవ‌స‌ర‌మా అధ్య‌క్షా..?!

ఏ ఆటైనా మైదానంలో జ‌ట్టు స‌భ్యులంతా స‌మ‌ష్టిగా ఆడితేనే అందం, విజ‌యం. ఒక‌రిపై మ‌రొక‌రు క‌స్సుబుస్సులాడుతుంటే, క‌య్యానికి కాలుదువ్వుతుంటే, అస‌లు జ‌ట్టు స‌భ్యుల మ‌ధ్య స‌యోధ్య లేక‌పోతే - ప్ర‌త్య‌ర్థుల‌పై ఎలా త‌ల‌ప‌డ‌తారు?...

HOT NEWS

css.php
[X] Close
[X] Close