తెలుగుదేశం పార్టీలో అసంతృప్తుల కలకలం..! అభ్యర్థులపై తీవ్ర ప్రభావం..!

టీడీపీలో అభ్యర్థుల ప్రకటన తర్వాత.. అసంతృప్తి ఓ రేంజ్‌లో వ్యక్తమవుతోంది. తాడికొండ సీటు తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కు ఇవ్వడంతో తాడికొండ జెడ్పీటీసిగా ఉన్న వడ్లమూడి పూర్ణచంద్రరావు తన పదవికి రాజీనామా చేశారు. రెబల్ అభ్యర్థిని బరిలోకి దించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సీటు ఆశించిన కొంత మంది గుంటూరు టీడీపీ నేతలు రాజీనామాల బాట పట్టారు. జడ్పీ చైరపర్సన్ జానీమూన్ వైసీపీలో చేరిపోయారు. మాచర్ల సీటు కొత్త అభ్యర్థి అంజిరెడ్డికి కేటాయించడంతో ప్రస్తుత నియోజకవర్గ ఇన్చార్జ్ చలమారెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అభ్యర్థి మార్పు కోసం.. అనుచరులతో కలిసి సీఎం ఇంటి వద్ద ధర్నా చేస్తున్నారు. నరసరావుపేట కు కొత్త అభ్యర్థిగా అరవిందబాబు కు సీటు కేటాయించారు. టీడీపీ నేతలకు ఈ ఎంపిక నచ్చలేదు.

గుంటూరు తూర్పు టిక్కెట్ ను… వైసీపీ నుంచి వచ్చిన నజీర్ అహ్మద్ అనే వ్యక్తికి కేటాయించారు. దీంతో లాల్ జాన్ బాషా కుటుంబం అసంతృప్తికి గురయింది. అభ్యర్థిని మార్చకపోతే పార్టీని వీడతామని ప్రకటించారు. మరో నేత అల్తాఫ్ జనసేన లో చేరిపోయారు. నరసాపురం అసెంబ్లీ టికెట్ కోసం బండారు మాధవనాయుడు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడులు గట్టిగా ప్రయత్నించారు. మాధవనాయుడుకే అధిష్టానం చాన్సిచ్చింది. తీవ్ర అసంతృప్తికి గురయిన కొత్తపల్లి సుబ్బారాయుడు కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసారు. స్వతంత్రంగా బరిలో ఉంటానని చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో ఎస్వీ మోహన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఎస్పీవై రెడ్డి కుటుంబం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియని పరిస్థితి ఉంది.

ఓ వైపు.. టిక్కెట్ల కోసం.. భారీ పోటీతో… అసంతృప్తికి గురైన వారందర్నీ బుజ్జగించడం… టీడీపీ నేతలకు తలకు మించిన భారంగా మారింది. కొన్ని కొన్ని కోట్ల… పట్టించుకునే వారు లేకపోవడం… వైసీపీ నేతలు వచ్చి తమ పార్టీలో చేరాలని ఆఫర్ ఇస్తూండటంతో.. ఆపార్టీలో చేరిపోతున్నారు. చివరికి రెబల్స్ గా కూడా కొంత మంది బరిలో ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close