PEN : పార్టీల పోరు సరే! ఓటర్ల వ్యూహం ఏమిటి?

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు అధికారపార్టీ శాసనసభ్యుల అక్రమాల మీద, అవినీతి మీద జనానికి వ్యతిరేకత ఉన్నది. ఆ జనమే కాదు, చంద్రబాబు మీద ఎంతో అయిష్టం ఉన్న వారు కూడా ఇంకో అవకాశం బాబుకు ఇవ్వాలేమో అనే ఆలోచనలో ఉన్నారు.

కొత్తరాష్ట్రం, రాజధాని నిర్మాణం, అసంపూర్తి ప్రాజెక్టులు, పెట్టుబడుల సమీకరణ– వంటి కారణాలు చెప్పుకుని, అనుభవజ్ఞుడే ఉండాలేమో ఇంకోసారి కూడా అని వ్యాఖ్యానిస్తున్నారు.

అదేమీ స్థిరపడిపోయిన అభిప్రాయం కాదు కానీ, జనం ఆలోచనాధోరణికి ఒక సూచిక. జగన్‌ వంటి సాహసి, పట్టుదల, సంకల్పబలం ఉన్న నాయకుడు ఉంటే కానీ, రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరవు అని ఆలోచించేవారు ఒక బలమైన సెక్షనే ఉన్నారు.

ఎన్నికలపై ఇద్దరు లేదా కొందరి మధ్య సంభాషణ మొదలైతే ఒకే ప్రశ్న. ఏమిటి, ఏమి జరగబోతోంది? ఒకరికొకరు ఏదో సమాధానం చెప్పుకుంటారు. కాసేపు తర్జన భర్జన పడతారు. వాదనలు, వాటికి పోటీ వాదనలు ముందుకు వస్తాయి. చివరకు, అప్పటికే తమ మనసులో ఉన్న అభిప్రాయంతో కొత్త సమాచారాన్ని బేరీజు వేసుకుంటారు.

ఇదంతా ఒక ప్రక్రియ. సొంత ఆలోచనలతో ఓటు చేయాలనుకునే వారి మనసులో ఒక నిర్ణయం స్థిరపడే క్రమం అది. ఓటుచేసే వారిని నడిపించే నాయకుల మనసుల్లో సైతం జరిగే రాజకీయమథనం అది. మంచిచెడ్డల విచక్షణ మాత్రమే పనిచేయకుండా ఆర్భాటాలూ వ్యూహనైపుణ్యాలూ జిత్తులమారి తనాలూ ఓటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇది పోలింగ్‌ తేదీ నాటికి మౌనంగానో బాహాటంగానో జనాభిప్రాయం రూపుదిద్దుకునే క్రమం.

వ్యతిరేకతను మూటగట్టుకున్న సిటింగ్‌ శాసనసభ్యులకు కూడా తిరిగి అభ్యర్థిత్వాలను ఇవ్వడం పైన కలిగిన నిరాశ కావచ్చు, ఊహించినదాని కంటె మెరుగుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్‌ స్పందిస్తుండడం కావచ్చు– పోరు తీవ్రంగానే ఉంటుందన్న వాతావరణం బలపడింది.

ఎన్నికల ప్రచారపు ఆర్భాటం ఒక్కటే కాదు, 5 ఏళ్ళ తెలుగుదేశం పాలనలోని మంచిచెడ్డలన్నీ చర్చకు వస్తున్నాయి. బిజెపితో ప్రేమ, పెళ్ళి, విడాకుల తతంగంలో ప్రశ్నలకు తెలుగుదేశం వద్ద సమాధానం లేకపోవడం అధికారపార్టీ శ్రేణులకు కూడా నిరుత్సాహజనకంగా ఉన్నది.

‘‘ఐదేళ్ళ కాలంలో జరిగిన అభివృద్ధి మరే ప్రభుత్వం ఉన్నా జరిగేదా? ఇంతిం పింఛను ఎప్పుడన్నా కళ్లజూశామా? పెళ్లికి, పురుటికి ప్రభుత్వమే కట్నాలు ఇవ్వడం కనీవినీ ఎరుగుదుమా? అనేక ప్రాజెక్టులు నడిమధ్యలో ఉన్నాయి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించవలసి ఉన్నాయి, వాటికి పూచీ కావాలంటే చంద్రబాబే మళ్లీ సీఎంగా ఉండాలి కదా? ఎమ్మెల్యేలదేముంది సార్‌, బ్యాలెట్‌ పేపర్‌ మీద అభ్యర్థుల పేర్లను చూసి ఓటు వేస్తారా ఏమిటి, అక్కడ సైకిల్ గుర్తు ఉంటది, వాళ్లకు అందులో బాబు‌ బొమ్మ కనిపిస్తది..’’ తెలుగుదేశం అభిమానులు చేస్తున్నఈ వాదన తీసిపారేయదగ్గది కాదు.

నిన్నటిని రేపటిని కలిపి ఆలోచించవలసిన బాధ్యతను ఇప్పుడు ఓటరు తలకెత్తుకుంటున్నాడు.

ఏమి జరగబోతోంది?– అన్న కుతూహలం వెనుక, సమాజం అంతరాల్లో మనకు అంతుపట్టని జనాభిప్రాయం రూపుదిద్దుకుంటోందేమోనన్న అనుమానం వస్తూనేవుంది. అయితే, తటస్థంగా నిలబడి, ఆ ప్రశ్నలు వేసేవారే ఈ అనుమానానికి సమాధానం అవుతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close