ధర్నా చేసింది మోహన్‌బాబు…! ఇప్పుడు సమాధానాలివ్వాల్సింది కూడా ఆయనేనా..?

“సంతానం కోసం సముద్రంలో స్నానానికెళితే… ఉప్పునీటి వల్ల… ఉండాల్సినదేదో పోయిందనే” సామెత ఉంది. అచ్చంగా ఇప్పుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పరిస్థితి అలాగే ఉంది. ఫీజ్‌ రీఎంబర్స్ మెంట్ బకాయిలు ప్రభుత్వం ఇవ్వలేదంటూ.. ఎన్నికల ముందు హడావుడి ప్రారంభించిన మోహన్‌బాబుకు సంబంధించిన వివరాలన్నీ బయటకు వస్తున్నాయి. అందులో ఆయన చెప్పుకునే ఇరవై శాతం ఉచిత విద్య నుంచి దానికి సంబంధించి.. విదేశాల్లో విరాళాలు సేకరించడం వరకూ ఉన్నాయి.

మోహన్ బాబు చెప్పే 25 శాతం ఉచిత విద్య హంబక్కేనా..?

మన దేశంలో విద్య వ్యాపారం కాదు. కానీ అందరూ దాన్ని వ్యాపారమే అనుకుంటారు. మోహన్‌బాబు దీనికి ట్రస్ట్ పేరుతో సంస్థ పెట్టి.. 25 శాతం విద్యార్థులకు ఉచిత విద్య అని పదే పదే ప్రకటిస్తూంటారు. ఇప్పుడు ఆ ఇరవై ఐదు శాతం విద్యార్థులకు ఉచిత విద్య ఇవ్వడం హంబక్కేనని… ప్రభుత్వం అధికారికంగా పత్రాలు విడుదల చేసింది. మోహన్ బాబు విద్యాసంస్థల్లో చదువుకుంటున్న ప్రతి ఒక్కరికి… రీఎంబర్స్‌మెంట్ క్లెయిమ్ చేసుకుంటున్నారు. మోహన్ బాబుకు చెందిన నాలుగు విద్యా సంస్ధలకు ఇప్పటి వరకు రూ. 95 కోట్లు కేటాయించారు. అందుకే ఆరు కోట్లు మినహా మొత్తం చెల్లించారు. ఆ ఆరు కోట్లు ఏడాది చివరికి చెల్లించాల్సినవి. ఇవన్నీ అధికారికంగా ప్రభుత్వం విడుదల చేసిన డాక్యుమెంట్లు. మరి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మోహన్ బాబు ఎందుకంటున్నారు..?. ఇరవై ఐదు శాతం విద్యార్థులకు ఉచిత విద్య అని చెప్పి.. ప్రభుత్వం దగ్గర ఎందుకు రీఎంబర్స్ చేసుకుంటున్నారు…?

ఉచిత విద్య పేరుతో విదేశాల్లో విరాళాలు ఎలా వసూలు చేస్తున్నారు…?

మోహన్ బాబు కుటుంబం… ఇరవై ఐదు శాతం మంది విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నామని బయటకు చెబుతోంది. ప్రభుత్వం వద్ద నుంచి మొత్తం రీఎంబర్స్ చేసుకుంటోంది. అదే సమయంలో తమ ఉచిత విద్యను ప్రచారం చేస్తూ… విదేశాల్లో విరాళాలు సేకరించింది. తన విద్యా సంస్థలకు విదేశాల నుంచి డోనేషన్ లు వసూలు చేసి లెక్కలు చూపడం లేదు. విరాళాలు సేకరించడానికి సహకరించిన ఎన్నారైలు.. దీనిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మోహన్ బాబును సూటిగా ప్రశ్నించారు. అలాగే కుటుంబరావు కూడా అదే చెప్పారు. చర్చకు సిద్ధమని.. అటు ఎన్నారైలు.. ఇటు… కుటుంబరావు కూడా అంటున్నారు. మరి మోహన్ బాబు ఆధారాలతో బయటకు వస్తారా..?

రాజకీయం కోసం విద్యార్థులను రోడ్లపైకి తెస్తారా..?

కొద్ది రోజుల కిందట… ఏపీ ప్రైవేటు కాలేజీలన్ని ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ ఓ లేఖ రాశాయి. ఆ లేఖ సారాంశం.. పక్కాగా… ఫీజు రీఎంబర్స్‌ బకాయిలు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పడం. కానీ ఒక్క మోహన్ బాబు కాలేజీకే నిధులు రావడం లేదని ఎందుకంటున్నారు..?. క్లాసుల్లో ఉండాల్సిన విద్యార్థులను తీసుకుని రోడ్లపైకి రావడం దేని కోసం..? ఇప్పుడు ప్రభుత్వం ఈసీ పర్యవేక్షణలో పని చేస్తుంది. ఆ విషయంలో.. రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇరవై రోజుల్లో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి పోలింగ్ జరగబోతోంది. ఇలాంటి సమయంలో.. ఎవరైనా రాజకీయం కాదంటూ నిరసన ప్రదర్శన నిర్వహిస్తారా..? నోటి మాటల ద్వారా ఆరోపణలు చేసి.. షో చేసే ప్రయత్నం వెనుక రాజకీయం ఉండదా..?. సబ్జెక్ట్‌కు సంబంధం లేకుండా పోసాని తిట్టినట్లు తిడితే… విలువ ఉంటుందా..?

కొసమెరుపేమిటంటే.. ఒక్క ధర్నాతో మోహన్‌బాబు ముందు సమాధానం కోసం చాలా ప్రశ్నలు వచ్చి పడ్డాయి. ఇరవై ఐదు శాతం ఉచిత విద్య, విదేశీ విరాళాలు, డబ్బులు తీసుకుని రాలేదని చెప్పడంతో పాటు.. కొత్తగా… దాసరి పెద్ద కోడలు కూడా.. ఆరోపణలు చేస్తున్నారు. వీటన్నింటికీ మోహన్ బాబు సమాధానం ఇవ్వాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: ఎన్నిక‌ల‌కు ముందూ త‌గ్గేదే లే!

మే 13న ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. నెల రోజుల ముందు నుంచే ఈ ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్ టాలీవుడ్ ని తాకింది. ఆ ఎఫెక్ట్ వ‌సూళ్ల‌పై తీవ్రంగా క‌నిపిస్తోంది. వారానికి రెండు మూడు సినిమాలొస్తున్నా...

మారుతి సినిమాకి ‘భ‌లే’ బేరం!

ఈమ‌ధ్య ఓటీటీ రైట్స్ విష‌యంలో నిర్మాత‌లు తెగ బెంగ ప‌డిపోతున్నారు. ఓటీటీలు సినిమాల్ని కొన‌డం లేద‌ని, మ‌రీ గీచి గీచి బేరాలు ఆడుతున్నార‌ని వాపోతున్నారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం గ‌ప్ చుప్‌గా...

జైలు నుండే సీఎం రేవంత్ కు క్రిశాంక్ సవాల్

ఉస్మానియా వర్సిటీ పేరుతో సర్క్యూలర్‌ను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్ జైలు నుండే సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. తాను...

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పై వైసీపీ కంగారుతో ప్రజల్లో మరింత అనుమానాలు !

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం అవుతోంది. ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. దీన్ని ఆపాలని జగన్ రెడ్డి పోలీసుల్ని పురమాయిస్తున్నాయి. సీఐడీ కేసునూ పెట్టించగలిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close