ఇంటలిజెన్స్ డీజీ బదిలీ రద్దు చేసిన ఏపీ సర్కార్..! ఈసీతో తేల్చుకునేందుకే రెడీ..!

ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ… కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని తిప్పికొట్టేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ కోరిక మేరకు.. కేవలం ఆ పార్టీకి లబ్ది చేకూర్చేందుకే.. ఎలాంటి ఆరోపణలు లేకపోయినా… వివరణ కూడా అడగకుండా బదిలీ చేశారని.. టీడీపీ నిర్ణయానికి వచ్చింది. అందుకే.. ముందుగా.. ఈ అంశంపై.. హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న వారిపై మాత్రం.. ఈసీకి అధారిటీ ఉంటుందని… ఎన్నికల్లో విధుల్లో లేని వారిని బదిలీ చేసే హక్కు ఈసీకి ఉండదని.. టీడీపీ పిటిషన్ లో పేర్కొంది. ధర్మాసనం ముందు అదే వాదించింది. దీంతో ఎన్నికల విధుల్లో ఇంటెలిజెన్స్‌ డీజీ లేరన్న అధికారిక పత్రాలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో ఈ బదిలీలపై సమగ్ర వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఈసీని ఆదేశించింది. గురువారం మరోసారి ఈ కేసు విచారణ చేపట్టనున్నారు.

మరో వైపు.. ఈసీ అధికారాలను కేవలం ఎన్నికల విధులు నిర్వహించే అధికారుల వరకే పరిమితం చేసేందుకు ప్రభుత్వం… ఓ జీవో తీసుకొచ్చింది. దాని ప్రకారం… కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకూ ఎన్నికల విధుల్లో పాల్గొనేవారందరూ.. ఈసీ పరిధిలోకి వస్తారు. కానీ ఇందులో.. ఇంటలిజెన్స్ డీజీని మినహాయించారు. అంటే.. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం.. ఇంటలిజెన్స్ డీజీని బదిలీ చేసే అధికారం.. ఈసీకి ఉండదు. ఈ జీవో విడుదల చేసిన కొద్ది సేపటికే.. ఏపీ ప్రభుత్వం… ఏపీ ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం ఇంటెలిజెన్స్‌ డీజీ ఈసీ పరిధిలోకి రానందున.. బదిలీ ఉత్తర్వులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కడప, శ్రీకాకుళం ఎస్పీలను మాత్రమే బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై ఇంప్లీడ్ అవుతామని వైసీపీ పిటిషన్ వేసింది. దానిపై.. వాదనలు తర్వాత వింటామని ధర్మాసనం తెలిపింది.

మొత్తానికి ఈసీ బదిలీలు వివాదాస్పదం అయ్యాయి. కేవలం వైసీపీ నేతలు… తమ కోరికల చిట్టాను ఫిర్యాదుల రూపంలో ఇచ్చిన ఇరవై నాలుగు గంటలు గడవక ముందే.. బదిలీ చేయడం… ఎప్పుడూ జరగలేదు. లెక్క ప్రకారం…ఇలాంటి ఫిర్యాదులొచ్చినప్పుడు సంబంధిత రాష్ట్ర సీఈవో నుంచి నివేదిక తెప్పించుకుంటారు. ఇక్కడ అలాంటిదేమీ లేదు. ఇరవై నాలుగు గంటల్లోనే… ఆదేశాలిచ్చారు. దాంతో.. ఈసీ తీరు అనుమానాస్పదంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ చివరి ప్రయత్నాలు : ఫేక్ ఎడిట్లు, మార్ఫింగ్‌లు, దొంగ నోట్లు, దాడులు

ఎన్నికల్లో గెలవాలంటే ఎవరైనా ప్రజలతో ఓట్లేయించుకోవడానికి చివరి క్షణం వరకూ ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. కానీ వైసీపీ డీఎన్‌ఎలో ప్రజల్ని పరిగణనలోకి తీసుకోవడం అనేదే ఉండదు. గెలవాలంటే తమకు వేరే...

కాంగ్రెస్ గూటికి శ్రీకాంతా చారి తల్లి… ఎమ్మెల్సీ ఖాయమా..?

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ , మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆమెను...

పవన్ కళ్యాణ్ వెంటే బన్నీ

జనసేనాని పవన్ కళ్యాణ్ కు హీరో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ఎంచుకున్న మార్గం తనకు గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు....

బ్ర‌హ్మానందం…. ఇదే చివ‌రి ఛాన్స్!

బ్ర‌హ్మానందం త‌న‌యుడు గౌత‌మ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏకంగా 20 ఏళ్ల‌య్యింది. 2004లో 'ప‌ల్ల‌కిలో పెళ్లి కూతురు' విడుద‌లైంది. అప్ప‌టి నుంచీ... బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మ‌ధ్య‌లో 'బ‌సంతి' కాస్త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close