బీజేపీ కాకపోతే.. ఐటీ దాడులే..! కర్ణాటకలో సీన్ రిపీట్..!

రాజకీయ ప్రత్యర్థులపైనే రాజ్యాంగ సంస్థలను వాడుకుంటూ.. చేస్తున్న రాజకీయం… ఇతర పార్టీల్లో తీవ్ర ఆగ్రహానికి కారణం అవుతోంది. ఏపీలో టీడీపీ అభ్యర్థులపై ఇప్పటికే గురి పెట్టిన ఐటీ అధికారులు.. కర్ణాటకలో… జేడీఎస్ నేతలపై అవే తరహాలో దాడులు ప్రారంభించారు. కర్నాటక మంత్రితో పాటు జేడీఎస్‌ నేతల ఇళ్లల్లో ఏక కాలంలో దాడులు చేయడంపై కాంగ్రెస్‌, జేడీఎస్‌లు మండిపడ్డాయి. కేంద్రం తీరును నిరసిస్తూ… బెంగళూరులోని ఐటీ ఆఫీసు ముందు సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఆందోళనకు దిగారు. హసన్‌, మాండ్యా జిల్లాలోని దాదాపు 300 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. జేడీఎస్‌కు చెందిన వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లతో పాటు ప్రముఖుల ఇళ్లలపై దాడులు చేశారు.

కర్నాటక మంత్రి సీఎస్‌. పుట్టారాజుతో పాటు అతని మేనల్లుడి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. రాష్ట్ర పోలీసులకు సమాచారం లేకుండా.. సీఆర్పీఎఫ్‌ దళాలతో.. దాడులకు దిగడం.. చర్చనీయాంశం అయింది. హసన్‌, మాండ్యాలో మంత్రి రేవణ్ణ, సీఎం కుమారస్వామి కుమారులు పోటీ చేస్తున్నారు. మాండ్యా పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి నిఖిల్‌ కుమారస్వామి పోటీ చేస్తుండగా… హసన్‌లో రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్‌ రేవణ్ణ బరిలోకి దిగారు. సోదాలపై తీవ్రంగా స్పందించింది కుమారస్వామి సర్కార్‌. ముఖ్యంగా కర్నాటక-గోవా ఐటీ డైరెక్టర్‌ బాలక్రిష్ణపై మండిపడ్డారు. బెంగళూరులోని ఐటీ ఆఫీసు ముందు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో సీఎం కుమారస్వామితో పాటు డిప్యూటీ సీఎం పరమేశ్వర, సిద్ధరామయ్యలు కూడా పాల్గొన్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం స్వతంత్ర సంస్థలతో ఇబ్బందులు పెట్టాలని చూస్తే… సీబీఐ విషయంలో మమత వ్యవహరించిన దారిలో వెళ్తామంటూ హెచ్చరించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ.. ఇదే విధంగా ఐటీ అధికారులు దాడులు చేశారు. ఒక్కరంటే.. ఒక్క బీజేపీ అభ్యర్థి జోలికి వెళ్లలేదు. కానీ.. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య బస చేసిన హోటల్ గదిని కూడా వదిలి పెట్టలేదు. అంతగా.. ఐటీ అధికారులు దాడులు చేశారు. ఇప్పుడు.. ఏపీలోనూ అదే చేస్తున్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ .. చివరికి ఈసీని కూడా బీజేపీ వాడేసుకుంటోందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెగా ఫ్యామిలీలో రచ్చ…అల్లు అర్జున్ పై నాగబాబు సీరియస్..!?

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారం చేయడంపై ఇంకా తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే ఆయన పర్యటన...

వ‌ర‌ల్డ్ క‌ప్ ముందు ఇది అవ‌స‌ర‌మా అధ్య‌క్షా..?!

ఏ ఆటైనా మైదానంలో జ‌ట్టు స‌భ్యులంతా స‌మ‌ష్టిగా ఆడితేనే అందం, విజ‌యం. ఒక‌రిపై మ‌రొక‌రు క‌స్సుబుస్సులాడుతుంటే, క‌య్యానికి కాలుదువ్వుతుంటే, అస‌లు జ‌ట్టు స‌భ్యుల మ‌ధ్య స‌యోధ్య లేక‌పోతే - ప్ర‌త్య‌ర్థుల‌పై ఎలా త‌ల‌ప‌డ‌తారు?...

విజ‌య్ స‌ర‌స‌న సాయి ప‌ల్ల‌వి?

టాలీవుడ్ లో ఓ కొత్త కాంబోకి తెర లేవ‌నుందా? విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సాయి ప‌ల్ల‌వి క‌లిసి న‌టించ‌బోతున్నారా? ఆ అవ‌కాశాలు ఉన్నట్టే క‌నిపిస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా దిల్ రాజు బ్యాన‌ర్‌లో...

విశ్వసనీయత కోల్పోతున్న కేసీఆర్…?

అనేక ఆటుపోట్లను ఎదుర్కొని రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తెలంగాణలో బీఆర్ఎస్ ను తిరుగులేని శక్తిగా నిలిపిన కేసీఆర్ ప్రస్తుతం రాజకీయాల్లో విశ్వసనీయత కోల్పోతున్నారా..?ఇందుకు కారణం ఆయన వరుసగా చేస్తోన్న వ్యాఖ్యలేనా..? అంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close