హైకోర్టు తీర్పుతో ఏపీ సర్కార్ దారిలోకి..! ఇంటలిజెన్స్ చీఫ్ బదిలీ..!

ఇంటలిజెన్స్ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ముగ్గురు సభ్యులతో కొత్త ప్యానల్‌ను ఎన్నికల కమిషన్‌కు పంపాలని నిర్ణయించారు. అంతకు ముందు హైకోర్టు ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకోబోమని ప్రకటించింది. బదిలీపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో.. బదిలీ నిర్ణయం తీసుకుంది. తాత్కలికంగా ఇంటెలిజెన్స్‌ ఆఫీస్‌లో సీనియర్‌ అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. డీజీపీ ఆఫీస్‌లో వెంటనే రిపోర్ట్‌ చేయాలని ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం కోరింది. ఎన్నికలకు సంబంధించిన విధులు ఇక ఏబీ వెంకటేశ్వరరావు నిర్వహించారు. దీనికి సంబంధించి జీవో నెం. 750ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో కీలక పోలీసు అధికారుల్ని బదిలీ చేయించాలని.. చాలా రోజులుగా.. వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. పదే పదే పోలీసులపై ఆరోపణలు చేస్తూ ఈసీకి ఫిర్యాదు చేశారు. చివరికి కడప, శ్రీకాకుళం ఎస్పీలతో పాటు.. ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేయించగలిగారు. అయితే.. ఎన్నికల సంఘం వీరిని ఎందుకు బదిలీ చేసిందో కారణాలు చెప్పకపోవడం వివాదాస్పదమయింది. వైసీపీ ఫిర్యాదు చేస్తే ఈసీ అధికారులు దానిపై కనీస పరిశీలన చేయకుండా చర్యలు తీసుకోవడం ఏమిటన్న చర్చ జరిగింది. ఇదంతా రాజకీయ కుట్ర అని భావించిన టీడీపీ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. అయితే.. ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకోలేమని.. హైకోర్టు స్పష్టం చేసింది.

మామూలుగా అయితే.. ఈసీ ఉత్తర్వుల విషయంలో .. కోర్టు నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని.. ప్రభుత్వం కూడా అనుకోలేదు. అందుకే..ఇంటలిజెన్స్ డీజీకి ఎన్నికల విధుల నుంచి మినహాయింపునిస్తూ ప్రత్యేకమైన జీవో తెచ్చింది. అయితే.. పోలీసు వ్యవస్థలో… ఇంటలిజెన్స్ కూడా భాగమని.. ఈసీ వాదించింది. ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుంచి.. యంత్రాంగంపై.. ఈసీకి సర్వ హక్కులు ఉంటాయని వాదించారు. బదిలీకి కారణాలు చెప్పాల్సిన పని లేదని.. సీఈవో మీడియాకు చెప్పారు. దాంతో.. ఈసీ కావాలనే బదిలీలు చేసందని క్లారిటీ వచ్చింది కానీ.. ఏపీ ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితికి వెళ్లిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close