సుభాష్ : జగన్‌ గెలిచే ఎంపీ సీట్లు టీఆర్ఎస్ ఖాతాలో..! కేటీఆర్ రోజూ చెబుతోంది ఇదే..!

మహబూబాబాద్, జగన్ అన్న మాటలు రెండు పక్క పక్కనే వస్తే.. రాళ్లతో జగన్‌ను టీఆర్ఎస్ కార్యకర్తలు తరిమికొట్టిన ఘటనే గుర్తుకు వస్తుంది. అలాంటి చరిత్ర ఉన్న నియోజకవర్గంలో… తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. టీఆర్ఎస్ కోసం ప్రచారం చేస్తూ.. జగన్‌ గురించి చెప్పారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గెలుస్తాడని.. ఆయన ఎంపీ సీట్లన్నీ.. కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్‌లోకి వస్తాయని… వాటితో తాము చక్రం తిప్పుతామని.. చెప్పుకొస్తున్నారు.

తెలంగాణలో జగన్ అడుగే పెట్టకూడదు.. ఏపీలో మాత్రం అధికారంలోకి రావాలా..?

తమ రాష్ట్రంలో.. అడుగు పెట్టడానికి…కనీసం ఓదార్పు చేయడానికి కూడా.. అంగీకరించని… పార్టీ తరపున కేటీఆర్ ఇప్పుడు.. జగన్మోహన్ రెడ్డి గెలుపు గురించి.. అందరికీ చెబుతున్నారు. టీఆర్ఎస్ రాళ్ల దాడులకు.. ఓదార్పు యాత్రను రద్దు చేసుకుని.. వెనక్కి వచ్చేసిన జగన్మోహన్ రెడ్డి కూడా… అదే టీఆర్ఎస్ నేతలు చెబుతున్న దాన్నే ఏపీలో చెబుతూండటం. టీఆర్ఎస్‌తో కలిస్తే తప్పేమిటని.. జగన్మోహన్ రెడ్డి.. ఓ ఎన్నికల ప్రచారసభలో .. ప్రజలను ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతల ప్రకటనలు చాలా రోజుల నుంచి.. జగన్మోహన్ రెడ్డి మీదే ఉన్నాయి. తెలంగాణలో ఉన్నది పదిహేడు సీట్లు. అందులో ఒకటి… గెలుచుకోవడం… అసాధ్యం. కాబట్టి.. అక్కడ గెలిచేవార్ని మిత్రపక్షంగా ప్రకటించుకున్నారు. ఇక పదహారు పార్లమెంట్ స్థానాలున్నాయి. 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో పదహారు సీట్లు చూపించే ప్రభావం ఎంత ఉంటుంది..?. అందుకే.. టీఆర్ఎస్ నేతలు ఈ సంఖ్యను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఇతర రాష్ట్రాల్లోని పార్టీలన్నీ.. ఢక్కామొక్కీలు తిన్న నేతల ఆధ్వర్యంలోనే ఉన్నాయి. దేవేగౌడ, స్టాలిన్ ,మమతా బెనర్జీ, పవార్,అఖిలేష్ .. ఇలా అందరూ… ఎవరి రాజకీయాలు వారు చేసుకుంటారు. ఎవరైనా.. తమ వెనుక రావాలని కోరుకునేవారు తప్ప.. తమకంటే తక్కువ రేంజ్ ఉన్న పార్టీల వెనుక నడిచేందుకు కనీసం ఆలోచన కూడా చేయరు. ఇలాంటి సమయంలో.. టీఆర్ఎస్‌కు… తన బలం రెట్టింపుగా చెప్పుకోవడానికి దొరికిన ఒకే ఒక్క ఆప్షన్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ….

వైసీపీ తరపున ఏ ఒక్క ఎంపీ గెలిచినా టీఆర్ఎస్ ఖాతాలోకేనా..?

జగన్మోహన్ రెడ్డి టీఆర్ఎస్‌కు దగ్గరయ్యారు. ఢిల్లీ లాబీయింగ్‌లు పని చేశాయో.. హైదరాబాద్‌ భేటీలు వర్కవుట్ అయ్యాయో కానీ… ఏపీలో టీడీపీని ఎదుర్కోవడానికి తానే రంగంలోకి దిగుతానని కేసీఆర్ ప్రకటించారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి.. జగన్‌కు ఆనందం కలిగించారు. జగన్ గెలుస్తారని.. 2014 ఎన్నికలకు ముందు చెప్పినట్లే.. చెప్పడం ప్రారంభించారు. అయితే నేరుగా వచ్చి ప్రచారం చేస్తే.. పరిస్థితి తేడా అవుతుందని.. వైసీపీకి తన వైపు ఎలాంటి సాయం కావాలో… అన్ని రకాల సాయం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఆ ఇన్వాల్వ్ మెంట్.. వైసీపీ వ్యవహారాల్లో కూడా ఉందని కొన్ని ఘటనలు నిరూపించాయి. డేటా చోరీ కేసు, వైఎస్ షర్మిల చేసిన ఫిర్యాదు అంశాల్లో పోలీసులను ఉపయోగించుకోవడం, అలాగే.. టీడీపీ అభ్యర్థులు కొందర్నీ.. వైసీపీలోపంపి ప్రచారం చేయించడం లాంటివి.. బహిరంగంగానే జరిగాయి. ఎలా చూసినా.. ఇప్పుడు… వైసీపీ, టీఆర్ఎస్ పార్టనర్స్. ఇందులో దాపరికం లేదు. కేటీఆర్, జగన్ ఇద్దరూ నేరుగానే చెబుతున్నారు. అంటే.. ఏపీలో గెలిచే వైసీపీ ఎంపీలను… టీఆర్ఎస్ తన బలంగా చూపించుకుని.. ఢిల్లీలో చక్రం తిప్పాలనుకుంటోంది.

కేటీఆర్ మాటలను.. జగన్ ఎందుకు ఖండించలేకపోతున్నారు..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్క ప్రకారం చూసుకుంటే.. ఉన్న 42 సీట్లు. దేశం మొత్తం ఉన్న సీట్లతో పోల్చుకుంటే.. 8 శాతంలోపే ఉంటాయి..!. వీటిలో తెలంగాణ వాటా 17. ఏపీ ఎంపీ సీట్లను అడ్డం పెట్టుకుని.. చక్రం తిప్పాలనుకుంటుంటున్నారు. దీని వల్ల… టీఆర్ఎస్‌కు లాభం చేకూరుతోంది. మరి వైసీపీకి అని ఆలోచిస్తే చెప్పలేని పరిస్థితి. అలా అని.. జగన్మోహన్ రెడ్డి టీఆర్ఎస్‌తో దోస్తీని ఖండించే ప రిస్థితి లేదు. ఖండించలేని స్థితిలో జగన్ ఉండటంతో… ఏపీ ప్రజల్లో ఎలాంటి సెంటిమెంట్ పెరిగినప్పటికీ… తమ సీట్లు తమకు ముఖ్యం అన్నట్లుగా.. టీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు రాజకీయవర్గాల్లో వస్తున్నాయి. ఏది ఏమైనా.. వైసీపీ, టీఆర్ఎస్ పార్టనర్లు అనే విషయాన్ని విడివిడిగా అయినా కేటీఆర్, జగన్… అంగీకరించినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close