నయీం ఆస్తులు రూ. 2వేల కోట్లు..! బాధితులకు పంపిణీ ఉంటుందా..?

ఎన్‌కౌంటర్‌లో హతం అయిన గ్యాంగ్‌స్టర్ నయీం ఆస్తులు రూ. రెండు వేల కోట్లు అని.. దాదాపుగా రెండేళ్ల తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం అంచనా వేసింది. ఎన్‌కౌంటర్‌ తర్వాత నయీం ఇంట్లో రూ.2.08 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఆస్తులు మొత్తం భూములు, ఇళ్లు, ఇళ్లస్థలాలు, ఫ్లాట్ల రూపంలోనే ఉన్నాయి. ఇవన్నీ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 1,019 ఎకరాల వ్యవసాయ భూములు, 29 భవనాలు, రెండు కిలోల బంగారం ఆస్తుల జాబితాలో ఉన్నాయి. మొత్తంగా 251 కేసులు నమోదయ్యాయి. 119 కేసుల్లో దర్యాప్తు పూర్తయింది. మరో రెండు నెలల్లో నయీం కేసుకు ముగింపు పలకాలని సిట్ భావిస్తోంది.

నయీం కేసు విచారణ మొదటి నుంచి… అనేక విమర్శలకు కారణం అవుతోంది. పెద్ద ఎత్తున భూఆక్రమణలకు పాల్పడటమే కాదు.. ప్రైవేటు వ్యక్తులను బెదిరించి… ఆస్తులను లాక్కున్నారని .. పోలీసులు నిర్ధారించారు. అయినప్పటికీ.. రెండేళ్ల పాటు.. సైలెంట్ గా ఉన్నారు. అసలు నయీం అనే వ్యక్తి… పోలీసులు తయారు చేసిన వ్యవస్థ అన్న ఆరోపణలు ఉన్నాయి. మాజీ నక్సలైట్ అయిన నయీం …. సహకారంతో.. పోలీసులు అనేక ఎన్ కౌంటర్లు చేశారని.. ఆ తర్వాత… నయీం చేసే సెటిల్మెంట్లకు పోలీసులు సహకరించారన్న ప్రచారం ఉంది. ఈ పరిస్థిని సానుకూలం చేసుకుని.. నయీం చెలరేగిపోయాడని చెబుతున్నారు.

మొత్తంగా 250 మందికిపైగా బాధితులు నయీం తమ ఆస్తుల్ని లాక్కున్నట్లు ఫిర్యాదు చేశారు. ఆస్తులు మొత్తం నయీం బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్‌ అయినట్లు సిట్‌ గుర్తించింది. ఈ రిజిస్ట్రేషన్లలో నయీంకు సహకరించిన అధికారులను కూడా గుర్తించింది. కేసు విచారణ అనంతరం భూముల్ని స్వాధీనం చేసుకోవడమా లేక బాధితులకు తిరిగి ఇవ్వడమా అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఆస్తులు కోల్పోయిన అనేక మంది… పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close