హ..హ్హ.. విజయ్ సాయి సెల్ఫ్ గోల్, సోషల్ మీడియాలో వైరల్

ట్విట్టర్లో ఈ మధ్య చాలా చురుగ్గా ఉన్న విజయసాయిరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరొకసారి సెల్ఫ్ గోల్ కావడంతో ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ మధ్య కాలంలో పలు ఛానళ్ళలోనూ సోషల్ మీడియాలోనూ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టిందని ఒకవేళ వైఎస్ఆర్సిపి గెలిస్తే డబ్బు ఖర్చు పెట్టడం కూడా ఒక ప్రధాన కారణం అవుతుందని విశ్లేషణలు వచ్చాయి. అయితే ఈ వ్యాఖ్యలను ఖండించడానికి కోసం విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. కానీ ఇప్పుడు ఆ ట్వీట్ లే సెల్ఫ్ గోల్ గా మారాయి.

విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ, “ఓటమికి కుంటి సాకులు వెతకడంలో తుప్పు కంటే కుల మీడియా జోరు ప్రదర్శిస్తోంది. వైఎస్పార్ కాంగ్రెస్ డబ్బు పంపిణీలో సక్సెస్ అయిందని చెత్త రాతలు మొదలు పెట్టింది. డబ్బు పంచలేక బాబు ఓడిపోతున్నారని వివరణ ఇచ్చే ప్రయత్నం. అసలు డబ్బులు వెదజెల్లే సంస్కృతికి శ్రీకారం చుట్టిందే మీ జాతి రత్నం. ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమం దేశంలో మొదలు పెట్టిందే చంద్రబాబు దివాకర్ రెడ్డి గారూ. వెన్నుపోటు తర్వాత 1996 లోక్ సభ ఎన్నికల్లో రూ.500 నోట్లు వెదజల్లిన చరిత్ర బాబుది. ప్రస్తుత ఎన్నికల్లో మీ పార్టీ పెట్టిన ఖర్చు రూ.20 వేల కోట్ల పైనే. అయినా ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు” అని రాసుకొచ్చారు.

అయితే విజయసాయిరెడ్డి వ్యాఖ్యానిస్తూ, 1996 లోక్సభ ఎన్నికలలో చంద్రబాబు 500 రూపాయల నోట్లు పంచి పెట్టాడు అని వ్యాఖ్యానించడం సెల్ఫ్ గోల్ కి కారణం అయ్యింది. నిజానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 రూపాయల నోట్ ని భారత దేశం లో ప్రవేశపెట్టిందే 1997లో. మరి 1997లో చలామణిలోకి వచ్చిన 500 రూపాయల నోటు ని 1996 లోనే చంద్రబాబు ఎలా పంచాడో విజయసాయిరెడ్డి కే తెలియాలి. అయితే నెటిజన్లు మాత్రం ఈ పాయింట్ ని ఆధారంగా చేసుకొని, విజయ్ సాయి రెడ్డి ని ఒక ఆట ఆడుకుంటున్నారు.

అసలు ఈ మాత్రం అవగాహన లేకుండా ఈయన ఎంపీ ఎలా అయ్యాడు అని ఒకరంటే, 1997లో చలామణిలోకి వచ్చిన 500 నోట్ ని 1996 లోనే పంచాడని చెబుతున్నాడు అంటే ఈయన బుర్ర ఏ రేంజ్ లో ఉందో, అసలు ఇంత బుర్ర తక్కువ చదువులతో ఈయన ఆడిటర్ ఎలా అయ్యాడో అంటూ మరొకరు విరుచుకుపడ్డారు. అయినా ఇలా దొంగ లెక్కలు చెప్పడం విజయసాయిరెడ్డికి అలవాటే అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. మొన్నటికి మొన్న జనసేన పార్టీ పోటీ చేసింది కేవలం 65 స్థానాలే అని వ్యాఖ్యానించి, నెటిజన్లతో చివాట్లు తిని, ఆ తర్వాత దాన్ని కవర్ చేసుకోవడానికి పుంఖానుపుంఖాలుగా ట్వీట్లు పెట్టి జెడి లక్ష్మీనారాయణ తో కూడా క్లాస్ పీకించుకున్న విషయం తెలిసిందే. ఇటువంటి దొంగ లెక్కలు వల్లే అప్పట్లో జగన్తో పాటు ఆయన కూడా జైలు కి వెళ్ళవలసి వచ్చిందని నెటిజన్లు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా- జగన్ అన్న పై అభిమానం ఉన్న వాళ్లు కూడా విజయసాయిరెడ్డి ట్వీట్లు చూస్తే ఓటు వేయాలని అనుకున్న వాళ్లు కూడా వేయరు అని మరొకరు వ్యాఖ్యానించారు.

నెటిజన్ల వ్యాఖ్యలను పక్కన పెట్టినా కూడా, విజయ్ సాయి రెడ్డి వ్యవహార శైలిని బట్టి చూస్తుంటే, ఎటువంటి ఆధారాలు లేకుండా అవతల పార్టీల మీద రాళ్లు వేయడానికి అలవాటు పడిపోయాడు అని, ఈ క్రమంలో తాను చెబుతున్న డేటా కరెక్ట్ గా ఉందో లేదో చూస్కునే అలవాటు కూడా ఆయనకు లేదని అర్థమవుతుంది. ఇప్పటికైనా తన శైలిని సరి దిద్దుకుంటాడా, లేకపోతే ఇలాగే తలా తోకా లేని ట్వీట్లు వేస్తూ, తన క్రెడిబిలిటీ మొత్తం పోగొట్టుకుంటాడా అనేది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close