ఓ వైపు కరువు.. మరో వైపు తుపాను..! ఏపీకి ఇప్పుడు దిక్కెవరు..?

కోడ్ రాజకీయంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బందులు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ పేరుతో… ప్రభుత్వ అధికారులెవరికీ ఆదేశాలు జారీ చేయడానికి ముఖ్యమంత్రికి అధికారం లేదని… సీఈవో ద్వివేదీ … స్పష్టం చేశారు. చివరికి ఇంటలిజెన్స్ బాస్‌ని కూడా.. సీఎంకు రిపోర్ట్ చేయవద్దని చెప్పారు. దీంతో.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు కానీ.. ఆయన అసలు ఏ పనీ చేయకూడదని.. సీఈవో రూలింగ్ ఇచ్చినట్లయింది. మరో వైపు.. ఏపీలో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఓ వైపు ఎండలు మండి పోతూంటే… మరో వైపు తుపాను ముంచుకొస్తోంది. ఎండల కారణంగా.. గ్రామాల్లో మంచినీటి ఎద్దడి ఏర్పడింది. ప్రభుత్వం వైపు నుంచి సరైన చర్యలు లేవు. దిశానిర్దేశం చేసే అధికారులు లేకపోవడం.. సీఎస్ కేవలం రాజకీయ పరమైన అంశాలపై మాత్రమే సమీక్షలు చేసి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూండటంతో.. పరిస్థితి దిగజారిపోయింది.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ఐఏఎస్ అధికారులను కూడగట్టే ప్రయత్నాలు చేస్తూండటంతో.. చాలా మంది అధికారులు…ఈ తలనొప్పి మాకెందుకంటూ.. సెలవులు పెట్టి వెళ్లిపోయారు. ఈ సమయంలో.. ఏపీలో ప్రభుత్వం లేకుండా పోయినట్లయింది. ముంచుకొస్తున్న కరువు, తరుముకొస్తున్న తుపానుపై చర్యల విషయంలో ఎంత ఆలస్యం చేస్తే ప్రజలు అంత నష్టపోతారు. ఇప్పటికే తుపాను ఫణి ప్రభావం కోస్తాపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తరుణంలో.. రాష్ట్ర ప్రభుత్వయంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై దిశానిర్దేశం చేసే అధికారులు కరవయ్యారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో.. ముఖ్యమంత్రి సమీక్షలు చేయవచ్చని… నిబంధనలు చెబుతున్నప్పటికీ.. ఆ ప్రకృతి వైపరీత్యాలంటే ఏమిటో.. ఈసీ చెప్పాల్సి ఉంది.

ఏపీలో పరిస్థితుల్ని వివరిస్తూ.. సీఈసీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. ఈసీ అధికార విధులు నిర్వహించకుండా కట్టడి చేయడంతో… చంద్రబాబు వేసవి విడిది కోసం.. హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లిపోయారు. ఇప్పటికే.. కరువు, నీటి ఎద్దడి విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. ప్రజల బాధలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు తుపానును ఎదుర్కొనేందుకు అధికారులు ముందుకు రాకపోతే.. మాత్రం ప్రజల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఓ వైపు… ఎన్నికలు ముగిసినా.. కోడ్ పేరుతో ప్రభుత్వాన్ని పని చేయనివ్వకపోవడం.. తాము కూడా చేయకపోతే.. ప్రజలు తిరగబడే ప్రమాదం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close