ఈ కాంబినేషన్ ఊహించగలరా?

కొన్ని కాంబినేషన్లు సంచలనంగా వుంటాయి. కొన్ని కాంబినేషన్ లు ఉత్సాహంగా వుంటాయి. కొన్ని కాంబినేషన్లు వింటే..నిజమేనా? అన్న క్వశ్చను ఎదురవుతుంది. అలాంటి కాంబినేషన్ గురించి ఆలోచనలు విత్తనం దశలో వున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

బాలకృష్ణ-దిల్ రాజు. అదీ కాంబినేషన్. ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు తీసి, మంచి నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్నారు దిల్ రాజు. దాదాపు అందరు హీరోలతో సినిమాలు తీసారు. కొద్దిమంది మిగిలారు. వాళ్లలో బాలయ్య ఒకరు. బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోను ఇంకా టచ్ చేయలేదు.

ఈ మధ్యనే బాలకృష్ణ తో సినిమా అన్న ఆలోచన దిల్ రాజు మదిలో మొలకెత్తినట్లు తెలుస్తోంది. ఓ సినిమా ఆయనతో కూడా చేస్తే ఎలా వుంటుంది అన్న ఆలోచన. అదే సమయంలో ఓ దర్శకుడు తెచ్చిన కథ సరిగ్గా బాలయ్యకు సూటబుల్ గా వుండడం అన్నది యాదృచ్ఛికం.

కానీ ఇంకా ఈ వ్యవహారం అంతకు మించి అడుగు ముందుకు పడలేదు. కానీ అబ్బురం, ఆశ్చర్యం, సాధ్యంకాని వ్యవహారం కాదు. దిల్ రాజు మనసులో ఆలోచన రావాలే కానీ, ఆయన దాన్ని వదిలి పెట్టరు. అందువల్ల 2019 కాకుంటే 2020లోనైనా ఆ కాంబినేషన్ మనం చూస్తాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నిరాసక్తంగా జగన్ ప్రచారం – ఆశలు వదిలేసుకున్నట్లే !

ఏపీ సీఎం జగన్ ప్రచారానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రెండు, మూడు రోజులకో సారి తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమవుతున్నారు. ప్రచార సభల్ని పరిమితం చేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్...

ఒంగోలు లోక్‌సభ రివ్యూ : డబ్బుతొ గెలిచేస్తానని చెవిరెడ్డి లెక్కలు

ఒంగోలు ఎంపీ సీటు హాట్ కేకులా మారింది. ఆగర్భ శ్రీమంతుడైన మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తూండగా.. ఎన్నికల అఫిడవిట్‌లోనూ పెద్దగా ఆస్తులు,. ఆదాయం చూపించలేని చెవిరెడ్డి భాస్కర్...

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ను ఓడిస్తే రేవంత్ ను ఓడించినట్లే !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో విపక్షాల రాజకీయం రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. ఆయనను దెబ్బకొట్టాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. సొంత నియోజకవర్గం అయిన మహబూబ్ నగర్ లోక్ సభలో ఓడిస్తే ఆయనకు...

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఊబిలో కూరుకుపోయిన వైసీపీ !

ఏపీ ఎన్నికలకు ఎజెండా సెట్ అయిపోయింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా విపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ఈ అంశంపై మొదట్లో పెద్దగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close