బ‌డ్జెట్ చిక్కుల్లో ‘డిస్కో రాజా’

ర‌వితేజ – వి.ఐ ఆనంద్‌లో ‘డిస్కోరాజా’ రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సింది. కానీ బ‌డ్జెట్ స‌మ‌స్య‌ల వ‌ల్ల ఓ అడుగు ముందుకేస్తే… నాలుగు అడుగులు వెన‌క్కి వేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఆనంద్ వేసిన బ‌డ్జెట్‌కీ, ర‌వితేజ మార్కెట్‌కీ అస్స‌లు పొంత‌న లేక‌పోవ‌డం ‘డిస్కోరాజా’ ప్ర‌ధాన స‌మ‌స్య‌. బ‌డ్జెట్ త‌గ్గించ‌డానికి విఐ ఆనంద్ చాలా ర‌కాల ప్ర‌య‌త్నాలు చేశాడు. స్టార్ హీరోయిన్ల‌ని ప‌క్క‌న పెట్టి కొత్త హీరోయిన్ల‌ని తీసుకొచ్చాడు. సెట్లు వేసే అవ‌స‌రం ఉన్నా – అవుడ్డోర్ షూటింగ్‌కి ఒప్పుకున్నాడు. ఇన్ని చేసినా బ‌డ్జెట్ కంట్రోల్‌లో్ రావ‌డం లేదు. దాంతో.. ఈ సినిమాని తాత్కాలికంగా ప‌క్క‌న పెట్టిన‌ట్టు స‌మాచారం. పాట‌ల్ని కుదిస్తే క‌నీసం కోటి రూపాయ‌లైనా బ‌డ్జెట్ కంట్రోల్‌లోకి వ‌స్తుంద‌ని ఆనంద్ భావిస్తున్నాడ‌ట‌. అయితే ర‌వితేజ సినిమాల్లో పాట‌లు లేక‌పోతే ఎలా? అన్న‌ది నిర్మాత భ‌యం. క‌థ డిమాండ్ చేసినంత ఖ‌ర్చు పెట్ట‌క‌పోతే క్వాలిటీ రాద‌న్న‌ది ద‌ర్శ‌కుడి అనుమానం. ఇలాంటి స‌మ‌యంలో హీరోలు, సాంకేతిక నిపుణులు పారితోషికాలు త‌గ్గించుకోవ‌డం ఒక్క‌టే మార్గం. కానీ ర‌వితేజ అందుకు ఏమాత్రం అంగీక‌రించ‌డం లేద‌ని తెలుస్తోంది. మ‌రి డిస్కో రాజాకి ఈ క‌ష్టాలెప్పుడు తీర‌తాయో.. ఏమో..??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ వెదుకులాట!

బీఆర్ఎస్ ను చుట్టుముడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. లోక్ సభ ఎన్నికలతో కిందా మీదా పడుతున్న సమయంలోనే మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావం చూపేలా మరో ఉపఎన్నిక వచ్చి పడింది....

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో అనుప‌మ‌

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌న జోరు చూపిస్తోంది. టిల్లు స్క్వేర్‌తో హిట్టు కొట్టాక‌, ఆ ఉత్సాహం మ‌రింత‌గా పెరిగిపోయింది. వ‌రుస‌గా కొత్త సినిమాల‌పై సంత‌కాలు పెడుతోంది. తాజాగా బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో జోడీ క‌ట్ట‌డానికి...

22మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోకి హరీష్..!?

బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హారీష్ రావు కాంగ్రెస్ లో చేరనున్నారా..? 20-22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతుండగా..ఆ ఎమ్మెల్యేల వెనక బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు...

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close