క‌థ‌ల వేట‌లో ద‌ర్శ‌కేంద్రుడు

‘న‌మో వేంక‌టేశ’.. రాఘ‌వేంద్ర‌రావు ఆఖ‌రి చిత్రం. ఆ త‌ర‌వాత ఆయ‌న మెగాఫోన్ ప‌ట్ట‌లేదు. సినిమాల‌పై అంత‌గా ఆస‌క్తీ చూపించ‌లేదు. కాక‌పోతే.. ఇప్పుడు మ‌ళ్లీ ఓ సినిమా చేయ‌డానికి ఆయ‌న ఉత్సాహం చూపిస్తున్న‌ట్టు టాక్‌. ఆయ‌న కామ్‌గా ఉన్నా.. కీర‌వాణి, స‌త్యానంద్‌లాంటి మిత్రులు రాఘ‌వేంద్ర‌రావుతో ఓ హిట్టు సినిమా తీయించాల‌న్న కృత నిశ్చ‌యంతో ఉన్నారు. అందుకే ద‌ర్శ‌కేంద్రుడు కూడా మ‌న‌సుని సినిమాల‌వైపు ల‌గ్నం చేసే ప‌నిలో ఉన్నారు. ప్ర‌స్తుతం ద‌ర్శ‌కేంద్రుడు క‌థ‌ల వేట‌లో ఉన్నారు. యువ ర‌చ‌యిత‌ల ద‌గ్గ‌ర‌నుంచి సీనియ‌ర్ రైట‌ర్ల వ‌ర‌కూ ఆయ‌న‌కు క‌థ‌లు వినిపిస్తున్నారు. ఇటీవ‌లే బివిఎస్ఎన్ ర‌వి ద‌ర్శ‌కేంద్రుడికి ఓ క‌థ చెప్పారు. ఆల్రెడీ రాఘ‌వేంద్ర రావు ద‌గ్గ‌ర ‘పెళ్లి సంద‌డి’ టైపులో ఓ క‌థ ఉంది. ద‌ర్శ‌కేంద్రుడి మార్క్ నూటిని నూరుపాళ్లూ ఆవిష్క‌రించే సినిమా అది. అలాంటి సినిమాతో త‌న కెరీర్‌కి శుభం కార్డు ప‌డాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. దానికి మించి ఏమైనా క‌థ దొరుకుతుందా? అనే ఆశ‌తో ఎదురుచూస్తున్నారు. పూర్తిగా కొత్త న‌టీన‌టుల‌తో ఈ సినిమాతెర‌కెక్కించాల‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న‌. క‌థ ఓకే అవ్వ‌గానే.. ఈ సినిమా ప‌ట్టాలెక్కేస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close