పోల‌వ‌రంపై కేంద్ర ప్ర‌భుత్వ అల‌స‌త్వం సాక్షికి క‌నిపించ‌దా..?

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పోల‌వ‌రం ప్రాజెక్టు సంద‌ర్శించారు. కేంద్రం నుంచి స‌రైన స‌మ‌యంలో స‌హ‌కారం అంది ఉంటే, ఈ ఖ‌రీఫ్ సీజ‌న్ కే గ్రావిటీ ద్వారా నీరు ఇచ్చుండేవార‌మ‌నీ, కానీ ఇప్పుడా ప‌రిస్థితి లేద‌ని చెప్పారు. వ‌చ్చే ఏడాది నాటికే గ్రావిటీ ద్వారా నీరు అందించ‌గ‌ల‌మ‌ని చెప్పారు! అంతే… వైకాపా ప‌త్రిక సాక్షికి పూన‌కం వ‌చ్చేసింది. అదిగో అదిగో… మ‌రోసారి గ‌డువు పొడిగించారు ముఖ్య‌మంత్రి! ఆయ‌న మోస‌పూరిత గుణాన్ని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టుకున్నారు. ఈ ఏడాది జూన్ నెలాఖ‌రుకు నీళ్లిస్తామ‌ని ప్ర‌క‌టించి, ఇప్పుడు మాట మార్చేస్తున్నారు. ఇది మోసం ద‌గా కుట్ర వంచ‌న…. ఇలా వాపోతూ ఓ క‌థ‌నాన్ని ఇవాళ్టి సాక్షి ప‌త్రిక బ్యాన‌ర్ గా అచ్చేసింది. పోల‌వ‌రం ప‌నులు ఈమాత్ర‌మైన క‌నిపిస్తున్నాయంటే కార‌ణం… దివంగ‌త వైయ‌స్సార్ హ‌యాంలో జ‌రిగిన‌వే అని రాసింది. కేంద్రానికి చంద్ర‌బాబు స‌రైన లెక్క‌లు చూప‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే ప్రాజెక్టు ఆల‌స్య‌మైందంటూ భాజ‌పా నేత‌ల గ‌ళం వినిపించింది.

పోల‌వ‌రం జాతీయ ప్రాజెక్టు క‌దా… అలాంట‌ప్పుడు, ఆల‌స్యానికి కార‌ణం కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌ల వ‌ల్ల ఉంటుంది క‌దా అనే కోణ‌మే ఈ క‌థ‌నంలో లేదు. 2014లో ముంపు గ్రామాల‌ను ఏపీలో క‌ల‌ప‌డంలో చొర‌వ చూపిన కేంద్ర ప్ర‌భుత్వం… అక్క‌డి నుంచీ పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో కొర్రీలు పెడుతూ ఆల‌స్యం చేస్తూనే వ‌చ్చిన వైనం ఈ ప‌త్రిక‌కు అన‌వ‌స‌రం! ఐదేళ్ల‌పాటు వ‌రుస‌గా భాజ‌పా స‌ర్కారు ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ల‌లో పోల‌వ‌రం ప్రాజెక్టుకు కేంద్రం ఎన్ని వేల కోట్లు కేటాయించిందో సాక్షి ఎందుకు చెప్ప‌లేక‌పోయింది..? ఏపీకి స్పెష‌ల్ ప్యాకేజీ ప్ర‌క‌టించాక‌… పోల‌వ‌రం ఖ‌ర్చంతా త‌మ‌దే అని అరుణ్ జైట్లీ ప్ర‌క‌టించారు. మ‌రి, ఆ ప్ర‌క‌ట‌న‌కు కేంద్రం క‌ట్టుబ‌డి ఉందా లేదా అనేది సాక్షి ప‌రిగ‌ణ‌న‌లోకి ఎందుకు తీసుకోదు? డ‌యాఫ్ర‌మ్ వాల్‌, కాప‌ర్ డ్యామ్‌, హైడ్రో ప్రాజెక్టుపై కేంద్రం వేసిన కోర్రీలు, దాని వ‌ల్ల ప‌నుల నిర్మాణంలో జ‌రిగిన జ్యాపం సాక్షికి అక్క‌ర్లేదు. కాప‌ర్ డామ్‌, రాక్ ఫిల్ డామ్, రేడియేష‌న్ గేట్ల‌ డిజైన్ల‌ను ఇంత‌వ‌ర‌కూ కేంద్రం ఆమోదించ‌లేదు, అది ఎవ‌రి బాధ్య‌తో సాక్షి ఎందుకు ప్రస్థావించ‌దు? ప‌నులు వేగ‌వంతం చేయ‌డం కోసం నవ‌యుగ కంపెనీకి కొన్ని ప‌నుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం కేటాయించే ప్ర‌య‌త్నం చేస్తే… ఎంత డ్రామా జ‌రిగిందో అంద‌రికీ తెలుసు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.

తూచ్‌… ఇవేవీ సాక్షికి అవ‌స‌రం లేదు. పోల‌వ‌రం ప‌నులు ఆల‌స్య‌మ‌య్యాంటే కార‌ణం కేవ‌లం చంద్రబాబు నాయుడు వ‌ల్ల‌నే! అంతే, దీన్ని అడ్డం పెట్టుకుని, వాస్త‌వాల‌ను వ‌దిలేసి, వాటిని ప్ర‌జ‌లు ప‌ట్టించుకోరులే అనే ధీమాతో ముఖ్య‌మంత్రిపై విమ‌ర్శ‌లు చేయ‌డమే ఈ ప‌త్రిక బాధ్య‌త‌న్న‌మాట‌. స‌రే… బాధ్య‌త ‌గ‌ల ప్ర‌తిప‌క్ష పార్టీగా గ‌డ‌చిన ఐదేళ్లూ ప్ర‌జ‌ల ప‌క్షాన ఉన్న వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ, పోల‌వ‌రం పోల‌వ‌రం ప్రాజెక్టు వేగ‌వంతానికి చేసిన కృషి ఏంటో కూడా సాక్షి రాస్తే బాగుంటుంది. ఇదే విష‌య‌మై జ‌గ‌న్ ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లారో, కేంద్రంపై ఏ రీతిన ఒత్తిడి తెచ్చారో కూడా రాస్తే కొంత అర్థ‌వంతంగా ఉండేది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్ గూటికి శ్రీకాంతా చారి తల్లి… ఎమ్మెల్సీ ఖాయమా..?

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ , మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆమెను...

పవన్ కళ్యాణ్ వెంటే బన్నీ

జనసేనాని పవన్ కళ్యాణ్ కు హీరో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ఎంచుకున్న మార్గం తనకు గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు....

బ్ర‌హ్మానందం…. ఇదే చివ‌రి ఛాన్స్!

బ్ర‌హ్మానందం త‌న‌యుడు గౌత‌మ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏకంగా 20 ఏళ్ల‌య్యింది. 2004లో 'ప‌ల్ల‌కిలో పెళ్లి కూతురు' విడుద‌లైంది. అప్ప‌టి నుంచీ... బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మ‌ధ్య‌లో 'బ‌సంతి' కాస్త...

లోక్ సభ ఎన్నికలు : తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని సీట్లను సాధిస్తుంది..?

లోక్ సభ సీట్లపై ఎవరి లెక్కలు వారివే. 14సీట్లు సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటే,తాము డబుల్ డిజిట్ స్థానాలను దక్కిచుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.బీఆర్ఎస్ కూడా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close