“రివ్యూ” లేకుండానే పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు..!

వీవీ ప్యాట్ల స్లిప్పులను యాభై శాతం లెక్కించేలా.. సుప్రీంకోర్టులో ఘనమైన వాదనలు వినిపిస్తామని హడావుడి చేసిన … 21 విపక్ష పార్టీలకు.. ఒకే ఒక్క నిమిషంలో షాక్ తగిలిగింది. రివ్యూ పిటిషన్‌పై విచారణకు అంగీకరించి.. సమయం కేటాయించిన సుప్రీంకోర్టు.. ఈ రోజు.. ఆ పిటిషన్‌పై విచారణ ప్రారంభించి… కేవలం ఒక్కటంటే.. ఒక్క నిమిషంలోనే విచారణ ముగించి.. నిర్ణయం ప్రకటించేసింది. తామిచ్చిన తీర్పును సవరించేందుకు ఆసక్తిగా లేమని.. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో విపక్ష పార్టీలు ఊసురుమన్నారు. ఈ కేసు విచారణ కోసమే.. ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా.. సుప్రీంకోర్టు నిర్ణయం శరాఘాతంలా మారింది.

నిజానికి ఈవీఎంలలో పారదర్శక లేదన్న కారణంగా.. విపక్ష పార్టీలు పోరాటం చేయడంతో.. వీవీ ప్యాట్ మిషన్లను.. ఈవీఎంలకు అనుసంధానం చేశారు. అయితే.. వాటిలో స్లిప్పులను లెక్కించడం లేదు. దాంతో.. ఈవీఎంలు ట్యాంపర్ చేసినా తెలియడం లేదని చెబుతూ.. విపక్ష పార్టీలు.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే… బ్యాలెట్లతో ఎన్నికలు నిర్వహించాలని లేకపోతే.. యాభై శాతం వీవీ ప్యాట్లు లెక్కించాలని కోరాయి. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు వాదనలు విన్న తర్వాత నియోజకవర్గానికి ఐదు వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈవీఎంలపై అనేక అనుమానాలు పెరుగుతున్నందున… వాటిని పెంచాలని.. రివ్యూ పిటిషన్ వేశారు. రివ్యూ చేయడానికి అంగీకరించిన సుప్రీంకోర్టు చివరికి.. ఒక్క నిమిషంలో.. రివ్యూను ముగించి… తీర్పు మార్చాల్సిన అవసరం లేదని తేల్చింది.

అంతకు ముందు… కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. 50 శాతం వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలని లేఖలో బాబు పేర్కొన్నారు. వీవీ ప్యాట్, ఈవీఎంలోని ఓట్ల మధ్య బేధం వస్తే వీవీ ప్యాట్‌ స్లిప్పుల సంఖ్యనే పరిగణనలోకి తీసుకుంటామని ఈసీ చెబుతోందని అంటే… ట్యాంపరింగ్‌ చేసే అవకాశముందని అంగీకరించడమేనన్నారు. 2శాతం వీవీ ప్యాట్‌ స్లిప్పులను మాత్రమే లెక్కించడం ద్వారా మిగిలిన 98 శాతంలో జరిగే ట్యాంపరింగ్‌ను ఎలా నిరోధిస్తారని లేఖలో ప్రశ్నించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close