మీడియా చేసినంత దుర్మార్గం మా జీవితాల్లో ఎవరు చేయలేదు: నాగబాబు

సాధారణంగా రాష్ట్రంలో ఏదైనా హాట్ టాపిక్ ఉంటే దాని గురించి మీడియా చూపిస్తుంది, చర్చిస్తుంది. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మీడియానే హాట్ టాపిక్ అయ్యింది. ఒకవైపు టీవీ9 నుండి సీఈఓ రవిప్రకాష్ ని ఉద్వాసన పలకడం గురించి రాష్ట్రంలో వాడివేడిగా చర్చింపబడుతూ ఉండగానే, మీడియా పై సంచలన వ్యాఖ్యలు చేశారు మెగా బ్రదర్ నాగబాబు. ఒక ప్రైవేటు ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ, తమ కుటుంబానికి మీడియా చేసినంత అన్యాయం, దుర్మార్గం మరెవరూ చేయలేదు అని వాపోయారు.

ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు హీరోలా ఉన్న చిరంజీవిని పార్టీ పెట్టగానే జీరో అయ్యేలా ఒక వర్గం మీడియా చేసిందా అని రిపోర్టర్ ప్రశ్నించిన ప్రశ్నకు సమాధానమిస్తూ నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో రెండు రాజకీయ పార్టీలు అయిన కాంగ్రెస్ మరియు తెలుగుదేశం పార్టీలు తమకు వత్తాసు పలికే మీడియా చానళ్ల సహాయంతో చిరంజీవిపై చాలా దుర్మార్గంగా వ్యవహరించారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న సాక్షి కంటే కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉన్న కొన్ని మీడియా సంస్థలు మరీ దారుణంగా ప్రవర్తించాయని అన్నారు. చిరంజీవి రాజకీయాల్లో సక్సెస్ అయితే, తమ పొలిటికల్ కెరీర్ కి ఫుల్ స్టాప్ పడుతుందన్న ఉద్దేశంతో చాలా వ్యూహాత్మకంగా గా చిరంజీవిని సమర్థిస్తున్నట్లు గానే నటిస్తూ, చివరికి వచ్చేసరికి చిరంజీవి వ్యక్తిత్వాన్ని హననం చేసే లాగా, అనేక కథనాలు వండి వార్చారు అని నాగ బాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడైనా కాస్త సోషల్ మీడియా ఉండడం వల్ల తమ మీద జరిగే మీడియా దాడులను ఎదుర్కోగలుగుతున్నామని, కానీ అప్పట్లో ఎటువంటి మీడియా అండ లేకపోవడంతో మీడియా చేసిన దురాగతానికి ( ఎమోషనల్ అత్యాచారం) తాము ఇబ్బంది పడాల్సి వచ్చిందని నాగబాబు వ్యాఖ్యానించారు.

ఏది ఏమైనా ప్రజారాజ్యం పార్టీ గురించి ఎప్పుడు ఎక్కడ చర్చ జరిగినా, మిగతా కారణాలతో పాటు ఆ పార్టీ విషయంలో ఒక వర్గం మీడియా ప్రదర్శించిన వైఖరి కూడా చర్చలోకి రావడం పరిపాటిగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close