వినాయ‌క్ ‘రివెంజ్‌’ తీర్చుకుంటున్నాడా?

త‌మిళంలో కొంత‌మంది ద‌ర్శ‌కులు న‌టులుగానూ స‌క్సెస్ అయ్యారు. స‌ముద్ర‌ఖ‌నిలాంటివాళ్లు అందుకు పెద్ద ఉదాహ‌ర‌ణ‌. స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం కూడా మానేసి.. న‌ట‌న‌పై దృష్టి కేంద్రీక‌రించేంత పెద్ద న‌టుడైపోయాయి. తెలుగులో అలాంటి వాళ్లు చాలా త‌క్కువ‌. పూరి, శ్రీ‌కాంత్ అడ్డాల‌, శేఖ‌ర్ క‌మ్ముల‌లాంటి వాళ్లు అప్పుడ‌ప్పుడూ… త‌మ సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌ల ద్వారా మెరుస్తుంటారు. అలాంటిది ఇప్పుడు వినాయ‌క్ హీరో అయిపోతున్నాడు. దిల్‌రాజు బ్యాన‌ర్‌లో వినాయ‌క్ హీరోగా ఓ సినిమా రూపొందుతుతోంది.

అయితే ఇది క‌మ‌ర్షియ‌ల్ ఫార్మెట్‌లో ఉండే క‌థ కాదు. పాట‌లు, ఫైటింగులు ఏమీ క‌నిపించ‌వు. ఓ మైండ్ గేమ్‌తో సాగే రివెంజ్ డ్రామా అని తెలుస్తోంది. క‌థానాయ‌కుడి పాత్ర‌కు ఎలాంటి ఇమేజీ ఉండ‌కూడ‌దు. అంతేకాదు.. వ‌య‌సు పైబ‌డిన‌వాడిలానూ క‌నిపించాలి. అందుకే వినాయ‌క్‌ని ఎంచుకున్నార‌ని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం వినాయ‌క్ బ‌రువు త‌గ్గాల‌ని నిర్ణ‌యించుకున్నారట. అందుకు సంబంధించిన క‌స‌ర‌త్తులు సాగుతున్నాయి. వినాయ‌క్ బ‌రువు త‌గ్గాకే ఈ ప్రాజెక్టు మొద‌ల‌వ్వ‌బోతోంద‌ని తెలుస్తోంది. `ఠాగూర్‌`లో ఓ చిన్న పాత్ర‌లో వినాయ‌క్ కనిపించ‌డం గుర్తుండే ఉంటుంది. న‌టుడిగా వినాయ‌క్ అవ‌తార్తం ఎత్త‌డం యాదృచ్చికంగా జ‌రిగింది. ఆ పాత్ర వేయాల్సిన న‌టుడు స‌రైన స‌మ‌యానికి రాక‌పోవ‌డంతో.. చిరంజీవి స‌ల‌హాతో ఆప‌ధ‌ర్మ న‌టుడిగా అవ‌తారం ఎత్తాడు వినాయ‌క్‌. మ‌రి `హీరో`గా ఏ మేర మెప్పిస్తాడో చూడాలి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close