ఉత్తమ్‌కు మరో సవాల్ ఎదుర్కోక తప్పదు..!

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి.. మరో సవాల్ ఎదురు రావడం ఖాయమైపోయింది. తాను నల్లగొండ నుంచి ఎంపీగా విజయం సాధించడంతో… హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అక్కడ్నుంచి… కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడం.. అంత తేలిక కాదు. ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఎంపీగా పోటీ చేయడం అసలు ఇష్టం లేదు. రాహుల్ గాంధీ చెప్పి పంపించడంతో.. తప్పనిసరిగా పోటీ చేయాల్సి వచ్చింది. గెలుస్తానని ఆయన అనుకోలేదు. కానీ.. ప్రజలు కాంగ్రెస్ వైపు మళ్లారు. అసెంబ్లీ ఎన్నికల్లో మూడు, నాలుగు వేల ఓట్ల తేడాతో బయటపడిన ఆయనకు పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం హుజూర్ నగర్ ప్రజలు పట్టం కట్టారు. దాదాపుగా పదిహేను వేల ఓట్ల మెజార్టీ ఇచ్చారు.

మరో ఆరు నెలల్లో ఉపఎన్నికలు రావడం ఖాయమవుతోంది. అక్కడ ఆయన తన భార్య ఉత్తమ్ పద్మావతికి టిక్కెట్ ఇప్పించుకోవడం ఖాయమే. పద్మావతి.. గత ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. అంతకు ముందు ఆమె కోదాడకు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇప్పుడు అనూహ్యంగా మరోసారి… ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లభించబోతోంది. అయితే.. అధికార పార్టీని ఎదుర్కొని.. అక్కడ విజయం సాధించడం అంత సులువు కాదు. గత ఎన్నికల్లో శానంపూడి సైదిరెడ్డి అనే ఎన్నారై.. ఉత్తమ్‌కు గట్టి పోటీ ఇచ్చారు. మూడు వేల ఓట్ల తేడాతోనే విజయం సాధించారు. హుజూర్ నగర్‌కు ఉపఎన్నిక రావడం … సైదిరెడ్డికి కూడా ఆనందాన్నిస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి.. ఆయన వచ్చే ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించారు. అనూహ్యంగా ఏడాదిలోపే.. పోటీకి అవకాశం వస్తోంది.

పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరపరాజయం తప్పదు కాబట్టి.. ఆ తర్వాత.. ఉత్తమ్‌ను పీసీసీ చీఫ్‌గా తొలగిస్తారని ప్రచారం జరిగింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో మూడు సీట్లు రావడం.. టీ పీసీసీకి ఘన విజయంగా మారింది. ఇప్పుడు కూడా పీసీసీ మార్పు గురించి ఆలోచిస్తున్నారు కానీ… అంత వేగంగా కాదు.. కొంత నెమ్మది అయ్యే అవకాశాలు ఉన్నాయి. బహుశా.. హుజూర్ నగర్ ఉపఎన్నిక తర్వాత.. ఆ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి.. ఆరునెలలకో సవాల్ ఎదురొస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close