గడ్కరీని కేశినేని నాని ఎందుకు కలిసినట్లు..? రాయబారానికేనా..?

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత.. తెలుగుదేశం పార్టీ నేతలు, శ్రేణులు పూర్తి నిరాశలో కూరుకుపోయారు. ఎవరితోనూ.. మాట్లాడే పరిస్థితి లేదు. కానీ విజయవాడ నుంచి ఎంపీగా గెలిచిన కేశినాని నాని మాత్రం.. హఠాత్తుగా..నాగపూర్‌లో ప్రత్యక్షమయ్యారు. నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఆ విషయాన్ని మీడియాకు కూడా తెలిపారు. గడ్కరీని అభినందించి.. విజయవాడ అభివృద్ధికి సహకరించాలని కోరామని చెప్పుకొచ్చారు.

నాగపూర్ వెళ్లి గడ్కరీని సన్మానించి వచ్చిన కేశినేని నాని..!

నిజానికి భారతీయ జనతా పార్టీని గెలిపించింది… భుజాలపై మోసింది..నరేంద్రమోడీ, అమిత్ షా. బీజేపీ గెలుపును అభినందిచాలనుకుంటే.. టీడీపీ ఎంపీ..నేరుగా వారి దగ్గరకే వెళ్లవచ్చు. కానీ… నితిన్ గడ్కరీ వద్దకు వెళ్లడమే ఆశ్చర్యకరం. వెళ్లి గెలుపునకు అభినందించి.. విజయవాడ అభివృద్ధికి సహకరించాలని.. ఆయన కోరినట్లు కేశినేని నాని చెప్పుకున్నా.. వ్యక్తిగతంగా.. వెళ్లే అవకాశం బాగా తక్కువేనన్న ప్రచారం ఉంది. పార్టీ తరపున.. ప్రత్యేకమైన వ్యూహంలో భాగంగానే… కేశినేని నాని.. గడ్కరీని కలిసి మద్దతు పలికినట్లు భావిస్తున్నారు.

గడ్కరీతో ముందు నుంచీ టీడీపీకి సత్సంబంధాలు..!

నిజానికి … తెలుగుదేశం పార్టీ బీజేపీతో సున్నం పెట్టుకున్న తర్వాత… ఆ పార్టీలోని కొంత మంది పాత మిత్రులతో.. సాన్నిహిత్యం కొనసాగించింది. మోడీ, అమిత్ షాలను మాత్రమే తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ పోలవరం ప్రాజెక్ట్‌కు అంతో ఇంతో సహకరించిన గడ్కరీతో మాత్రం సన్నిహిత సంబంధాలే కొనసాగించారు. గడ్కరీ ఎప్పుడు వచ్చినా… ప్రోటోకాల్ మర్చిపోలేదు సరి కదా.. పెద్ద ఎత్తున అతిధి మర్యాదలు చేశారు. అయ్యన్నపాత్రుడు లాంటి మంత్రులు.. ఓ రేంజ్‌లో పొగడ్తలు కురిపించారు కూడా. ఎన్డీఏకు… అంతో ఇంతో.. సీట్లు తేడా పడితే… గడ్కరీని ఆరెస్సెస్ ప్రధాని అభ్యర్థిగా తెర ముందుకు తెస్తే… మద్దతిచ్చేందుకు కూడా… టీడీపీ సిద్ధమయిందని అప్పట్లో ప్రచారం జరగింది.

సవాళ్లను ఎదుర్కోవడానికి ఢిల్లీ మద్దతు పొందే ప్రయత్నమా..?

అటు కేంద్రంలోనూ.. ఇటు రాష్ట్రంలోనూ.. తమనే టార్గెట్ చేసుకున్న పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో… చంద్రబాబుకు పార్టీని నడపడం కత్తిమీద సాము లాంటిదే. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో.. తమపై వేధింపులు వీలైనంతగా ఎదుర్కోవడానికి బీజేపీలో.. కొంత మంది మద్దతు … అవసరం అని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే నితిన్ గడ్కరీతో… పరిచయాలు పెంచుకుని… అంతో ఇంతో కేంద్రం మద్దతు పొందే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే కేశినేని నాని నాగపూర్ వెళ్లినట్లు .. ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close