టిక్‌టాక్ తో కామెడీ పండించ‌నున్న మారుతి

మారుతి సినిమాలో హీరోలు విచిత్రంగా క‌నిపిస్తుంటారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ లో నానికి మ‌తిమ‌రుపు. మ‌హానుభావుడులో శ‌ర్వానంద్‌కి అతి శుభ్ర‌త‌. అయితే ఈసారి హీరోయిన్ క్యారెక్ట‌ర్‌ని వెరైటీగా చూపించాల‌ని ఫిక్స‌య్యాడు మారుతి. సాయిధ‌ర‌మ్ తేజ్ తో మారుతి ఓ సినిమాని తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం కోసం `ప్ర‌తి రోజూ పండ‌గే`, `భోగి` లాంటి పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. ఈ నెలాఖ‌రున షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో నాయిక పాత్ర‌కూ ప్రాధాన్యం ఉంది. కథానాయిక‌ని కేవ‌లం గ్లామ‌ర్ కోసం వాడుకోకుండా, ఆ పాత్ర‌తో కావ‌ల్సినంత వినోదం పండించ‌డానికి ఫిక్స‌య్యాడు మారుతి. ఇటీవ‌ల టిక్ టాక్ చాలా పాపుల‌ర్ అయిపోయింది. టిక్ టాక్ వీడియోల‌తో సోష‌ల్ మీడియా వెర్రెత్తిపోతోంది. ఈ సినిమాలో క‌థానాయిక‌కీ హాబీ కూడా అదేన‌ట‌. ఆ టిక్ టాక్ చుట్టూనే మారుతి వినోదం పండించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. క‌థానాయిక‌లుగా నిధి అగ‌ర్వాల్‌, రుక్సార్ పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. వీళ్ల‌లో ఎవ‌రు ఫిక్స‌వుతారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ నేతలు కోరుకున్న డోస్ ఇచ్చేసిన మోదీ

చిలుకలూరిపేట సభలో ప్రధాని మోదీ తమను పెద్దగా విమర్శించలేదని .. ఆయనకు తమపై ప్రేమ ఉందని.. తమ నేతను జైలుకు పంపబోని గట్టిగా ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలకు.. ప్రధాని మోదీ...

సెన్సార్ అయ్యింది..కానీ స‌ర్టిఫికెట్ లేదు!

'ప్ర‌తినిధి 2' విచిత్ర‌మైన స‌మ‌స్య‌లో ప‌డింది. నిజానికి గ‌త వార‌మే విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. కానీ.. సెన్సార్ ఆఫీస‌ర్ సెల‌వులో ఊరు వెళ్ల‌డం వ‌ల్ల, సెన్సార్ జ‌ర‌క్క‌, ఆగిపోయింది. ఇప్పుడు సెన్సార్...

కాంగ్రెస్ లోకి వెంకీ మామ‌!

ప‌ర్ ఫెక్ట్ టైమింగ్, క‌థ‌లో ఇమిడిపోయే త‌త్వం, క్యారెక్ట‌ర్ లో జీవించే న‌ట‌న‌... వెంక‌టేష్ అన‌గానే ఇవ‌న్నీ గుర్తుకొస్తాయి. ఏ పార్టీకి అనుబంధంగా ఉండ‌కుండా, కేవ‌లం సినిమాలే లోకంగా ఉండే వెంక‌టేష్ కాంగ్రెస్...

అలాగైతే రాజ‌మౌళితోనే సినిమాలు చేసేవాడ్ని!

నారా రోహిత్ కెరీర్ చాలా డీసెంట్ గా మొద‌లైంది. 'బాణం', 'సోలో', 'ప్ర‌తినిధి' లాంటి మంచి సినిమాల్ని అందించారాయన‌. రోహిత్ ఓ క‌థ ఎంచుకొన్నాడంటే అందులో విష‌యం ఉండే ఉంటుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగించాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close