ఢిల్లీ టూర్ క్యాన్సిల్..! నిజంగానే మోడీతో కేసీఆర్‌కు చెడిందా..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పధ్నాలుగో తేదీన ఢిల్లీ వెళ్తారని.. పదిహేనో తేదీన.. నీతిఅయోగ్ సమావేశానికి హాజరవుతారని కొద్దిరోజులుగా ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ అలాంటి కార్యక్రమం ఏమీ పెట్టుకోలేదని.. నీతి అయోగ్ సమావేశానికి వెళ్లడం లేదని తాజాగా స్పష్టమయింది. సహజంగా.. నీతి అయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రులందరూ హాజరవుతారు. రాజకీయంగా… తీవ్ర విబేధాలున్నా…. తమ రాష్ట్ర ప్రయోజనాల కోసమైనా.. ముఖ్యమంత్రులు వెళతారు. అయితే.. బెంగాల‌్ సీఎం మమతా బెనర్జీ మాత్రం… మోడీతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేకపోవడంతో.. ఆమె క్యాన్సిల్ చేసుకున్నారు. మిగతా అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరయ్యే అవకాశం ఉంది. కానీ.. కేసీఆర్ మాత్రం.. చివరి క్షణంలో డుమ్మాకొట్టారు. దీని కోసం ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లుగా కార్యక్రమాలు నడుస్తున్నాయి.

మోడీతో కేసీఆర్ దూరం.. దూరం..!

ఇరవై ఒకటో తేదీన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి… మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించేందుకు కేసీఆర్ ముంబై వెళ్లారు. అక్కడ ఆ పని చూసుకుని హైదరాబాద్ వచ్చేస్తున్నారు. కానీ ఢిల్లీకి మాత్రం వెళ్లడం లేదు. నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ తరపున ప్రతినిధులు వెళ్తారు కానీ.. తాను మాత్రం వెళ్లడం లేదు. రెండో సారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత కేసీఆర్.. నరేంద్రమోడీని కనీసం ప్రశంసించను కూడా ప్రశంసించలేదు. ఆయన ప్రమాణస్వీకారానికి కూడా వెళ్లలేదు. జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వచ్చి.. ఫ్లైట్ ల్యాండింగ్ కు అనుమతి దొరకలేదని హైదరాబాద్ వెళ్లిపోయారు. అప్పడే పలువురు విశ్లేషకులు.. మోడీతో కేసీఆర్ సంబంధాలు అంత గొప్పగా లేవని అంచనా వేశారు.

రాజకీయ కోణంలోనే ఢిల్లీ పర్యటన రద్దు..!

ఇప్పుడు మోడీ అధ్యక్షతన జరిగే.. నీతి ఆయోగ్ సమావేశానికి కూడా.. కేసీఆర్ డుమ్మా కొడుతున్నారు. తెలంగాణలో ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నాయని.. తెలంగాణ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి సంబంధించి కీలకమైన రివ్యూలు ఉన్నాయని.. అందుకే ఢిల్లీకి వెళ్లడం లేదని చెబుతున్నారు. కానీ.. నీతి ఆయోగ్ సమావేశం కంటే.. ఇవి కీలకమైనవి కావని.. కొందరు చెబుతున్నారు. కేవలం రాజకీయ కారణాలతోనే… కేసీఆర్.. ఢిల్లీ పర్యటనను.. చివరి క్షణంలో రద్దు చేసుకున్నారని అంటున్నారు.

మోడీ – కేసీఆర్‌ల మధ్య ఎక్కడ చెడింది..?

నిజానికి నీతిఆయోగ్ పై.. బీజేపీయేతర రాష్ట్రాలన్నీ చాలా కాలంగా.. అసంతృప్తితో ఉన్నాయి. ఎందుకంటే… ప్లానింగ్ కమిషన్ స్థానంలో తెచ్చిన నీతిఆయోగ్‌కు.. ఎలాంటి ఆర్థిక అధికారాలు లేవు. నేరుగా… ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. అన్ని వ్యవస్థల్లాగే.. బీజేపీ.. నీతిఆయోగ్‌ను.. ఓ ఉపయోగం లేని వ్యవస్థగా మార్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. తమ వద్దకు వచ్చే ప్రతిపాదనలు పరిశీలించి.. నిధులు మంజూరు చేయమని.. సూచనలు మాత్రం కేంద్రానికి పంపుతుంది. మంజూరు చేయాలో లేదో.. కేంద్రం ఇష్టం. తెలంగాణకు సంబంధించి మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని నీతిఆయోగ్ గతంలో సిఫార్సు చేసింది. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్న అసంతృప్తి కేసీఆర్ లో ఉంది. అలాంటి మీటింగ్ కు వెళ్లినా .. వెళ్లకపోయినా ఒకటేనన్న భావనలో ఆయన ఉన్నట్లు తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

మోనిఫెస్టో మోసాలు : కొత్తది సరే పాతదాంట్లో ఎగ్గొట్టిన వాటికి సమాధానం చెప్పాలి కదా !

వైసీపీ చీఫ్ జగన్ కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు. పాత దాంట్లో అమలు చేయనివి తీసేసి కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టే ప్రయత్నం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close