మళ్లీ తెరపైకి “ఒకే దేశం.. ఒకే ఎన్నికలు”..! 19న భేటీ..!?

రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. గతంలో.. వెనక్కి పెట్టిన.. తమ లక్ష్యాలను… మందుకు తీసుకు వచ్చారు. ఇందులో మొదటిది.. “ఒకే దేశం – ఒకే ఎన్నికలు”. లోక్‌సభతో పాటు.. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలని… ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. భావిస్తున్నారు. ప్రతీ ఏడాది… నాలుగైదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇండియాలో ఉన్న 29 రాష్ట్రాల ఎన్నికలు.. ఒక్కో ఏడాదిలో జరుగుతున్నాయి. దాని వల్ల… అత్యధిక కాలం ఎన్నికలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి రాజకీయ పార్టీలకు వస్తుందని… దీని వల్ల అభివృద్ది కుంటుపడుతుందని భావిస్తున్నారు. అందుకే.. ఒకే దేశం “ఒకే దేశం – ఒకే ఎన్నికలు” ప్రతిపాదన తీసుకొచ్చారు. అప్పట్లో..ఎన్డీఏ పక్షాలు ఆమోదం తెలిపాయి. విపక్షాలు వ్యతిరేకించాయి. ఇప్పుడు మళ్లీ అభిప్రాయసేకరణకు కేంద్రం సిద్ధమయింది.

కేంద్ర ప్రభుత్వం ఈ నెల పందొమ్మిదో తేదీన..ఓ ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసింది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపింది. టీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ లకు కూడా.. ఆహ్వానం అందింది. పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం ఉన్న పార్టీలన్నింటికీ.. ఈ ఆహ్వానాలు వెళ్లాయి. అయిదు లక్ష్యాల సాధనకోసం అన్ని పార్టీల అధ్యక్షులతో నిర్వహించే ఈ సమావేశానికి రావాలని ఆహ్వానించారు. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కూడా హాజరుకానున్నారు. ఐదు లక్ష్యాలు అని చెప్పినప్పటికీ.. అసలు .. ఒకే దేశం.. ఒకే ఎన్నికలు.. అనే కాన్సెప్ట్‌పై అభిప్రాయసేకరణ కోసమేనని నమ్ముతున్నారు.

ప్రస్తుతం ఈ ప్రతిపాదనను.. అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించడం ఖాయంగా కనిపిస్తోంది. ఓడిపోయిన పార్టీలు.. ముందస్తుగా ఎన్నికలు రావాలని కోరుకుంటాయి. ఇప్పుడు తిరుగులేని అధికారం అనుభవిస్తున్న బీజేపీనే.. ముందస్తు ఎన్నికలకు వస్తే.. రాజీయ పార్టీలన్నీ రెడీగా ఉంటాయి. గతంలో టీడీపీ ఎన్డీఏలో ఉన్నప్పుడు.. అంగీకరించింది. కానీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత వ్యతిరేకించింది. ఇప్పుడు మాత్రం.. ముందస్తు ఎన్నికలు వస్తే… మరో మాట లేకుండా అంగీకరించడం సాధ్యమే. ఇప్పటికే.. కేంద్రం… ” ఒకే దేశం – ఒకే ఎన్నికలు” కోసం… అనేక రకాలుగా కసరత్తు చేసింది. అమలు చేయడమే మిగిలింది. మరోఏడాదిలో.. రాజ్యసభలోనూ.. బీజేపీకి సంపూర్ణ మెజార్టీ వస్తుంది కాబట్టి… ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సులువే. అందుకే.. “ఒకే దేశం – ఒకే ఎన్నికలు” లక్ష్యంగా ముందే జరిగితే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోమటిరెడ్డికి హైకమాండ్ వద్ద రిమార్క్స్

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని రేవంత్ రెడ్డి ఉబ్బేస్తున్నారు కానీ ఆయన పనితీరుపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. చెప్పిన పని చేయకుండా నల్లగొండ పార్లమెంట్ పరిధిలో...

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని ప్రచారం… షెడ్యూల్ ఇదే

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ప్రధాని మోడీ. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రే హైదరాబాద్ చేరుకున్న మోడీ రాజ్ భవన్ లో బస చేశారు....

నిర్లక్ష్యమే ముంచింది…కాళేశ్వరంపై నిపుణుల మధ్యంతర నివేదిక

కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికను అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రభుత్వానికి సూచించింది.వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని...

పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ – విప్లవమే !

ఐదేళ్ల పాలనలో తాను చాలా విప్లవాలు తెచ్చానని జగన్ రెడ్డి చెబుతూ ఉంటారు. విప్లవం అంటే ఆ రేంజ్ అనుకుంటున్నారో కానీ ఆయన కానీ ఆయన రచయితలు కానీ ఆ పదాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close