వివేకా హత్య కేసులో కొత్త సిట్..! కొలిక్కి తెస్తారా..?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మళ్లీ కదలిక వచ్చింది. పోలీసులు మళ్లీ కొత్త గా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. హత్య జరిగినప్పుడు.. ప్రభుత్వం ఓ సిట్‌ను నియమించింది. పది వరకూ ప్రత్యేక బృందాలతో… అణువు అణువూ గాలించి… దర్యాప్తు చేశారు. అయితే.. కేసులో ఉన్న సంక్లిష్టతలు…. సీబీఐకి ఇవ్వాలన్న జగన్ కుటుంబసభ్యుల పిటిషన్ల మేరకు… ఆ తర్వాత విచారణ మందగించింది. చివరికి హైకోర్టు.. మీడియాకు వివరాలు చెప్పవద్దని పోలీసులకు ఆదేశించడంతో.. ఆ కేసు అంతటితో ఆగిపోయింది. ఈ లోపు ఎన్నికలు వచ్చాయి. వైసీపీ గెలిచింది. జగన్ సీఎం అయ్యారు. 

ఏపీ పోలీసులపై నమ్మకం లేనే లేదని.. ప్రకటించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి… సీబీఐ విచారణ కోసం హైకోర్టుకు వెళ్లారు. ఇప్పుడు.. నిర్ణయాధికారం.. తన చేతుల్లోనే ఉంది. సీబీఐకి కేసును సిఫార్సు చేస్తే.. వెంటనే.. సీబీఐ అధికారులు రంగంలోకి దిగి.. తన బాబాయ్ అయిన… వివేకానందరెడ్డి హత్య కేసును చేదిస్తారు. ఇప్పుడు.. తన చేతుల్లోనే పోలీసులు ఉంటారు కాబట్టి.. వారిపై నమ్మకం ఉంటే.. చేయగలిగినదంతా .. చేయవచ్చు. అందుకే.. ఇప్పుడు.. కొత్తగా సిట్‌ను నియమించినట్లు తెలుస్తోంది. ఈ సిట్‌కు కడప జిల్లా ఎస్పీగా ఉన్న అభిషేక్ మహంతినే నేతృత్వం వహిస్తారు. 

వివేకా హత్య కేసులో పోలీసులు అవసరమైన ప్రాధమిక సాక్ష్యాధారాలన్నీ సేకరించారు. మర్డర్ జరిగిన ప్రదేశంలో… సాక్ష్యాలను తుడిచిపెట్టినట్లు.. స్పష్టంగా ఉండటంతో.. దానికి కారణంగా.. ముగ్గుర్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారిని విచారిస్తే… కేసు చిక్కుముడి మొత్తం విడిపోతుంది కానీ.. కొన్ని రాజకీయ ఒత్తిళ్ల వల్ల పోలీసులు అలాంటి ప్రయత్నాలు చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ హత్య కేసులో.. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి.. నేరుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపైనే విమర్శలు చేశారు. కాబట్టి.. ఇప్పుడు.. ముఖ్యమంత్రి పొజిషన్‌లో ఉన్నందున.. తన అనుమానాలను నివృతి చేసుకోవడానికి అవసరమైన సందర్భం వచ్చినట్లే భావించారు. మరి ఈ సిట్… వివేకా హత్య కేసును కొలిక్కి తెస్తుందా.. లేక… కోల్డ్ స్టోరేజీలో పడేస్తుందా.. అన్నది వేచి చూడాలి..! 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో పవన్‌పై పుకార్ల కుట్రలు !

పవన్ కల్యాణ్ గెలిస్తే అసెంబ్లీలో అడుగుపెడితే తాము చూస్తూ బతకలేమని చస్తూ బతకాలని అనుకుంటున్నారేమో కానీ వైసీపీ నేతలు ప్రతి అడ్డమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు. రాత్రికి రాత్రి పిఠాపురం వర్మ వైసీపీలోకి...

ఆర్కే పలుకు : జగన్‌ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కూ ఉంది !

జగన్ ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కు ఉందా ?. ముందు తెలంగాణలో పార్లమెంట్ సీట్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాత్రం రేవంత్ కు ఉంది. అందుకే ఆయన కిందా మీదా పడుతున్నారు....

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close