బీజేపీకి జగన్, కేసీఆర్ అండ..! చివరికి నష్టం ఎవరికి ..?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయడానికి బీజేపీకి.. పరోక్షంగా మద్దతిచ్చారు కేసీఆర్. ఏపీలో టీడీపీ లేకుండా చేయడానికి… అదే పని చేస్తున్నారు జగన్. బెంగాల్‌లో.. ప్రత్యర్థుల్ని లేకుండా చేయడానికి బీజేపీకి సూదిమొనంత సందు ఇచ్చారు మమతా బెనర్జీ. కానీ… ఇప్పుడేమవుతుంది. అలా అవకాశం ఇచ్చిన వాళ్లనే బీజేపీ మింగేయబోతోంది. ఇది బెంగాల్‌లో జరుగుతోంది. తెలంగాణలో ప్రారంభమయింది. ఏపీలో ప్రారంభదశలో ఉంది.

బెంగాల్‌లో బీజేపీ ఎలా ఎదిగింది..! మమతే కారణం కాదా..?

బెంగాల్‌లో.. కమ్యూనిస్టులు దశాబ్దాల తరబడి పాలన సాగించారు. లెఫ్ట్ కంచుకోటను బద్దలు చేస్తూ.. మమతా బెనర్జీ… సుదీర్ఘ పోరాటంతో 2011లో అధికారపగ్గాలు చేపట్టారు. మమతా బెనర్జీ రాజకీయ పోరాటం.. ఓ విప్లవంలా సాగింది. అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత విపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడం ప్రారంభించారు. లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. అందు కోసం బీజేపీ పట్ల చూసీచూడనట్లు వ్యవహరించారు. తనే స్వయంగా సృష్టించిన పొలిటికల్ వాక్యూమ్‌లోకి.. బీజేపీ.. అత్యంత పకడ్బందీగా దూసుకొచ్చింది. ఆ రాష్ట్రంలో అత్యధికంగా 28శాతం మంది ముస్లింలు ఉన్నారు. మైనార్టీలపై మెజార్టీని ఉసిగొల్పే రాజకీయాలు చేసే బీజేపీకి అంత మంచి అవకాశాన్ని వదులుకుంటుందా..?. ప్రత్యర్థిగా బీజేపీ ఎదిగిందంటే.. దానికి కారణం… మమతా బెనర్జీనే. ఆమె ప్రత్యర్థిని లేకుండా చేయాలనుకున్నారు….కానీ అంత కంటే బలమైన ప్రత్యర్థిని తయారు చేసుకున్నారు. ఇది స్వయంకృతాపరాథం.

తెలంగాణలో బీజేపీ ఎదుగుదల వెనుక ఉన్నది కేసీఆర్ కాదా..?

తెలంగాణలో బీజేపీతో .. చాలా కాలం కేసీఆర్ సానుకూలంగా వ్యవహరించారు. కాంగ్రెస్‌ను తగ్గించడానికి .. బీజేపీకి ఎంతో కొంత చనువిస్తున్నామని.. టీఆర్ఎస్ అధినేత అనుకున్నారు కానీ.. ఆ పార్టీ తన పార్టీకే ఎసరు పెడుతుందని అసలు ఊహించలేకపోయారు. బీజేపీ నేతల ప్లాన్లు, ప్రణాళిక అంచనా వేయలేకపోయారు. కానీ ఇప్పటికే చేయిదాటిపోయింది. బీజేపీ.. తెలంగాణలో.. ఓ రేంజ్‌లోకి దూసుకొచ్చింది. తెలంగాణలో ముస్లింల సంఖ్య అటూ ఇటూగా.. 20 శాతం వరకూ ఉంటుంది. ఇలాంటి అవకాశాన్ని బీజేపీ ఎప్పటికీ వదులుకోదు. కేంద్రంలో కానీ.. మరెక్కడైనా కానీ.. బీజేపీకి టీఆర్ఎస్ అవసరం లేదు. త్వరలో.. ముస్లింల రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చి… పరిస్థితిని మరో రేంజ్‌కు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు… కేసీఆర్‌కు కాంగ్రెస్ ప్రమాదకరంగా కనిపించడం లేదు. కానీ.. బీజేపీ మాత్రం కచ్చితంగా ప్రమాదకరంగా మారుతోంది.

ఏపీలో జగన్ అదే తప్పు చేస్తున్నారు..!

తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయడానికి బీజేపీకి వైసీపీ శక్తివంచన లేకుండా సహకారం అందిస్తోంది. అది పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే.. జగన్‌కు ఎవరు పోటీ అవుతారు..? బీజేపీ పోటీ అవుతోంది. చంద్రబాబునాయుడ్ని ఎదుర్కోవడం.. జగన్‌కు సులభం. కానీ బీజేపీని ఎదుర్కోవడం అంత సులభం కాదు. ఎందుకంటే.. బీజేపీ వస్తే… హోలీ బైబిల్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి… ఆ వివాదం తెరపైకి వస్తుంది. దానికి జగన్మోహన్ రెడ్డి వద్ద సమాధానం ఉండదు. రాబోయే కాలంలో ఇదే జరుగుతుంది. ఈ మధ్య ఆరెస్సెస్ కార్యకర్తలు ఓ వీడియో సర్క్యూలేట్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఏముందంటే… కడప జిల్లాలో ఓ స్కూల్ పిల్లలు.. తమను కంపల్సరీగా బైబిల్ చదవమన్నారు. ఆ వీడియోను సర్క్యూలేట్ చేస్తున్నారు. ఇప్పుడే ఇలాంటివి ప్రారంభమయ్యాయంటే.. ముందు ముందు ఇంకా చాలా ఉంటాయి. ఎవరైనా.. కానీ తమ రాజకీయ అవసరాల కోసం బీజేపీని పెంచితే … బీజేపీని ఉపయోగించుకుని… తెలంగాణలో కాంగ్రెస్… ఏపీలో టీడీపీని బలహీనం చేస్తే.. వాళ్ల కంటే బలమైన ప్రత్యర్థిగా బీజేపీ వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close