‘క‌ల్కి’.. గ్లామ‌రుంది.. మ‌రి భామ‌లేరీ..?

రాజ‌శేఖ‌ర్ `క‌ల్కి`పై చాలా ఆశ‌లే ఉన్నాయి. అటు ప‌రిశ్ర‌మ‌, ఇటు వ్యాపార వ‌ర్గాలూ ఈ సినిమాపై అంచ‌నాలు పెంచుకున్నాయి. దానికి త‌గ్గ‌ట్టుగానే బిజినెస్ పూర్త‌యింది. ఇదో థ్రిల్ల‌ర్‌. ఓ హ‌త్య చుట్టూ తిరిగే క‌థ‌. హంత‌కుడ్ని ప‌ట్టుకోవ‌డం అనేది క‌థానాయ‌కుడి టార్గెట్‌. అయితే ఈ సినిమాలో గ్లామ‌ర్‌కి కొద‌వ లేదు. ఆదాశ‌ర్మ‌, నందిత శ్వేత క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. స్కార్లెట్‌తో ఓ దుమ్ము రేపే ఐటెమ్ సాంగ్ ఒక‌టి డిజైన్ చేశారు. క‌మ‌ర్షియ‌ట్ ట‌చ్ ఎక్క‌డా మిస్ అవ్వ‌లేదు. అయితే ప్ర‌చార చిత్రాల్లోగానీ, ప్ర‌మోష‌న్ల‌లో గానీ ఈ భామ‌లెవ‌రూ క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కూ క‌ల్కికి సంబంధించిన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, హానెస్ట్ ట్రైల‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వాటిలో యాక్ష‌న్ మూమెంట్స్ ఎక్కువ‌. క‌థానాయిక‌ల్ని అస్స‌లు చూపించ‌నే లేదు. నందిత శ్వేత అయితే ఎక్క‌డుందో వెదుక్కోవాల్సిన ప‌రిస్థితి. అస‌లు ఈ క‌థ‌లో క‌థానాయిక‌ల‌కు చోటుందా? వాళ్ల పాత్ర‌ల‌న్నీ అప్ర‌ధాన‌మైన‌వేనా? అనే డౌట్లు వ‌స్తున్నాయి. క‌నీసం ప్ర‌మోష‌న్ల‌లోనూ వీరెవ‌రూ క‌నిపించం లేదు. క‌ల్కి విడుద‌ల‌కు రెండు రోజుల స‌మ‌యం కూడా లేదు. ఈరోజు జ‌ర‌గాల్సిన‌ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ రాజ‌శేఖ‌ర్ అనారోగ్యం పాల‌వ్వ‌డంతో… ర‌ద్ద‌య్యింది. రేపు జ‌రిగే ఛాన్స్ లేదు. విడుద‌ల‌కు ముందు ప్ర‌మోష‌న్ల‌కు బ్రేకులు ప‌డ‌డం, క‌థానాయిక‌లెవ‌రూ బ‌య‌ట‌కు రాక‌పోవ‌డం… క‌ల్కికి మైన‌స్‌గా మారుతుందేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close